E-Paper
Advertisement

గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు

గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు
Advertisement

Romantic Comedy: ఒకవైపు చిన్నప్పటి ప్రాణ స్నేహితుడు… మరోవైపు కొత్తగా జీవితంలోకి వచ్చిన గర్ల్‌ఫ్రెండ్. ఇద్దరినీ వదులుకోలేని పరిస్థితిలో ఓ యువకుడు చిక్కుకుంటే ? స్నేహితుడి ప్రేమ వల్ల తమ ఫ్రెండ్‌షిప్ దూరమవుతుందని భయపడిన మరో వ్యక్తి… ఆ అమ్మాయిని అతని జీవితంలో నుంచి పంపించేందుకు వరుసగా ప్లాన్లు వేస్తే ? చివరికి ఈ ముగ్గురి మధ్య స్నేహం గెలిచిందా ? ప్రేమ గెలిచిందా? ఇదే ఫన్, ఎమోషన్, ఇగోతో సాగిపోయే జర్మన్ కామెడీ మూవీ ‘మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ’ (My Best Friend, His Girlfriend and Me). మరి ఈ సినిమా ఏ ఓటీటీలో చూడొచ్చు? తెలుగులో ఉందా? కథేంటి? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఓలీ, మాట్జే చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరి స్నేహం ఎంత బలమైనదంటే… ఒకే ఇంట్లో రూమ్‌మేట్స్‌గా ఉంటూ, ఒకే రియల్ ఎస్టేట్ కంపెనీలో కలిసి పని చేస్తుంటారు. వ్యక్తిగత జీవితం నుంచి ఉద్యోగం వరకు ప్రతిదీ కలిసి చేసే ఈ ఇద్దరూ… ఒకరోజు తమ జీవితంలోనే ఓ పెద్ద ప్లాన్ వేసుకుంటారు. ఏడాది పాటు ప్రపంచమంతా చుట్టి రావాలని నిర్ణయించుకుంటారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఆ వరల్డ్ టూర్‌కు బయలుదేరడమే మిగిలింది. కానీ సరిగ్గా అదే సమయంలో మాట్జే జీవితంలోకి రెబెక్కా వస్తుంది. ఆఫీస్ క్లయింట్‌గా పరిచయమైన ఆమెను చూసిన మాట్జే మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కొద్దిరోజుల్లోనే వీరి పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారిపోతుంది.

Advertisement

మాట్జే ప్రేమలో పడటం అతనికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో… ఓలీకి మాత్రం అంతే టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే మాట్జే ఎప్పుడూ రెబెక్కా గురించే ఆలోచించడం మొదలుపెడతాడు. ఇద్దరూ కలిసి గడిపే సమయం తగ్గిపోతుంది. ఇన్నాళ్లూ తనకు మాత్రమే ఉన్న బెస్ట్ ఫ్రెండ్‌షిప్‌లోకి ఇప్పుడు రెబెక్కా రావడంతో… ఓలీకి అసూయ మొదలవుతుంది. అంతేకాదు… వాళ్లు కలిసి చేయాలనుకున్న ఏడాది వరల్డ్ టూర్ కూడా ఇప్పుడు డౌట్‌లో పడుతుంది. మాట్జే ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తమ ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుందని ఓలీ భయపడతాడు. దీంతో ఎలాగైనా రెబెక్కాను మాట్జే జీవితంలో నుంచి దూరం చేయాలని నిర్ణయించుకుంటాడు.

అక్కడి నుంచే అసలు కామెడీ మొదలవుతుంది. రెబెక్కాను ఇబ్బంది పెట్టేందుకు ఓలీ చిన్న చిన్న ప్లాన్లు వేస్తుంటాడు. ఆమెకు నచ్చని పనులు చేస్తూ, మాట్జేతో ఆమె సంబంధాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఒక సందర్భంలో రెబెక్కా ఏర్పాటు చేసిన పెద్ద పార్టీని కూడా ఓలీ కావాలనే పాడుచేస్తాడు. ఇక ఓలీ ప్రవర్తనతో విసిగిపోయిన రెబెక్కా కూడా వెనక్కి తగ్గదు. అతని నుంచి దూరంగా ఉండేందుకు మాట్జేను తనతో కలిసి వేరే ఫ్లాట్‌కు వచ్చేయమని అడుగుతుంది. ఇప్పుడు మాట్జే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఒకవైపు తన ప్రాణ స్నేహితుడు ఓలీ… మరోవైపు తాను ప్రేమించిన రెబెక్కా. ఇద్దరిలో ఎవరినీ వదులుకోలేక అతను నలిగిపోతుంటాడు.

Advertisement

ఓలీ మాత్రం రెబెక్కాను తేలిగ్గా తీసుకుంటాడు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్‌ను తన నుంచి దూరం చేస్తోందని భావిస్తూ మరిన్ని ప్లాన్లు వేస్తుంటాడు. కానీ అతను ఊహించని విధంగా రెబెక్కా కూడా గట్టిగానే ఎదురు తిరుగుతుంది. దీంతో స్నేహం, ప్రేమ మధ్య చిన్నపాటి ఇగో వార్ మొదలవుతుంది. క్రమంగా మాట్జేకు కూడా అసలు విషయం అర్థమవుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ చేస్తున్న పనుల వెనుక ఉన్న అసూయ, స్వార్థం ఏంటో అతనికి తెలుస్తుంది. అదే సమయంలో ఓలీ ప్రవర్తన వల్ల రెబెక్కాకు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అతను గుర్తిస్తాడు.

మరి ఇన్నేళ్ల స్నేహం కోసం ఓలీ చేసిన ఈ పనులు చివరికి అతనికే రివర్స్ అయ్యాయా? మాట్జే తన స్నేహితుడి వైపు నిలిచాడా? లేక ప్రేమించిన రెబెక్కాతో కలిసి కొత్త జీవితాన్ని ఎంచుకున్నాడా? ఓలీ తన తప్పును అర్థం చేసుకుని ఈ ప్రేమను అంగీకరించాడా? చివరకు ఈ ముగ్గురి మధ్య మొదలైన ఇగో వార్ ఎలా ముగిసింది? అనేదే ‘మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ’లో చూడాల్సిన కథ.

తెలుగులో ఉందా ?

స్నేహం, ప్రేమ, అసూయ, ఇగో… వీటన్నింటినీ సరదాగా కలిపి తెరకెక్కించిన ‘మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ’. ఇందులో కోస్టియా ఉల్‌మాన్, డేవిడ్ క్రోస్, జానినా ఉహ్సే ప్రధాన పాత్రల్లో నటించారు. మార్కో పెట్రీ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు హిందీ, ఇంగ్లీష్, జర్మన్ ఆడియో ఆప్షన్లు ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లేదా తెలుగు సబ్‌టైటిల్స్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేవు.

Read Also: బెంగాల్ మొత్తం ఈ జంట  వెంటే.. హార్డ్ డ్రైవ్ కోసం ఇదేం అరాచకం భయ్యా

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×