E-Paper
Advertisement

మొబైల్ పాతబడే కొద్దీ ఎందుకు హ్యాంగ్ అవుతుంది? వేగం పెంచే ట్రిక్స్ ఇవే!

మొబైల్ పాతబడే కొద్దీ ఎందుకు హ్యాంగ్ అవుతుంది? వేగం పెంచే ట్రిక్స్ ఇవే!
Advertisement

Mobile hang problem: కొత్తగా కొన్నప్పుడు రాకెట్‌లా దూసుకెళ్లే స్మార్ట్‌ఫోన్, కొద్ది రోజులు గడిచేసరికి విపరీతంగా హ్యాంగ్ అవ్వడం లేదా స్లో అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ లేదా కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అసలు మొబైల్ ఫోన్లు పాతబడే కొద్దీ.. ఎందుకు హ్యాంగ్ అవుతాయి? దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? అలాగే మీ ఫోన్ వేగాన్ని మళ్లీ  పెంచేలా చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడే గ్యాడ్జెట్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా స్మార్ట్‌ఫోనే. అయితే ఫోన్ కొన్న కొత్తలో ఉన్న స్పీడ్, ఏడాది తిరిగేసరికి లేదా రెండేళ్లు గడిచేసరికి ఉండదు. యాప్స్ ఓపెన్ అవ్వడానికి చాలా టైమ్ తీసుకోవడం, మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. అసలు దీనికి కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి కారణాలు:

Advertisement

స్టోరేజ్ : మనం ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ ఫైల్స్‌తో ఇంటర్నల్ స్టోరేజ్‌ను పూర్తిగా నింపేస్తుంటాం. స్పేస్ లేకపోతే.. ప్రాసెసర్‌కు డేటాను ప్రాసెస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ : మనం వాడకపోయినా.. సరే చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి రామ్ ని ఖాళీ లేకుండా చేస్తాయి.

Advertisement

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్: పాత మోడల్ ఫోన్లలోకి కొత్త ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ అప్‌డేట్‌లు వచ్చినప్పుడు, హార్డ్‌వేర్ వాటిని తట్టుకోలేక ఫోన్ స్లో అవుతుంది.

క్యాచే మెమొరీ: రోజూ వాడే యాప్స్ జమా చేసే డేటా ఫోన్ వేగాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.

మొబైల్ వేగాన్ని పెంచే మార్గాలు:

మీ ఫోన్ హ్యాంగ్ సమస్యను తగ్గించి.. దాని వేగాన్ని పెంచడానికి ఈ కింది చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి.

స్టోరేజ్ క్లీన్: ఫోన్ మెమొరీ ఎప్పుడూ కనీసం 15 నుంచి 20 శాతం ఖాళీగా ఉండేలా చూసుకోండి. పనికిరాని యాప్స్, పెద్ద వీడియోలను డిలీట్ చేయండి లేదా గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోండి.

క్యాచే మెమొరీ : సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ మేనేజ్‌మెంట్‌లో ‘Clear Cache’ ఆప్షన్‌ను ఉపయోగించండి. ఇది ఫోన్ మీద ఉండే భారాన్ని తగ్గిస్తుంది.

Also Read: ఇన్‌స్టాలో పోస్ట్‌లను ముందుగానే షెడ్యూల్ చేయడం ఎలా? సింపుల్ ట్రిక్స్!

లైట్ వెర్షన్ యాప్స్ : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటికి బదులుగా ‘Lite’ వెర్షన్ యాప్స్‌ను వాడితే రామ్ , బ్యాటరీ చాలా వరకు ఆదా అవుతాయి.

అనిమేషన్ : డెవలపర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి విండో అనిమేషన్ స్కేల్‌ను 0.5x కి మార్చితే ఫోన్ చాలా ఫాస్ట్ అయిపోయినట్లు అనిపిస్తుంది.

ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి: వారానికి కనీసం ఒక సారైనా ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లు రిఫ్రెష్ అయ్యి ఫోన్ స్మూత్ గా పనిచేస్తుంది.

మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవుతుందంటే.. వెంటనే కొత్తది కొనాల్సిన అవసరం లేదు. పైన పేర్కొన్న చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను కూడా సరి కొత్త దానిలా వేగంగా పని చేసేలా చేసుకోవచ్చు.

Related News

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×