E-Paper
Advertisement

Social Drama OTT : ఎన్టీఆర్ మెచ్చిన మూవీ … కుల వివక్షతో నడిచే కథ… ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

Social Drama OTT : ఎన్టీఆర్ మెచ్చిన మూవీ … కుల వివక్షతో నడిచే కథ… ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?
Advertisement

Social Drama OTT : గ్రామీణ ప్రాంతాల్లోని కుల వివక్ష, పరువు హత్యల వంటి సున్నితమైన అంశాలతో వచ్చిన సినిమా ‘దండోరా’. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సోషల్ మెసేజ్ డ్రామాకి ఆడియన్స్ నుంచే కాకుండా, సినీ నటుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను చూసి, కథను, నటీనటుల నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్‌కు అభినందనలు తెలిపాడు. ఇక ఈ సినిమా కథ ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

తెలంగాణ నేప‌థ్యంతో వచ్చిన ఈ ‘దండోరా’ (Dhandoraa) సినిమాను ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ దీనిని నిర్మించగా, మురళీకాంత్ దేవసోత్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2025 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. శివాజీ ప్రధాన పాత్రలో నటించగా, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2026 జనవరి 14 నుండి అమెజాన్ ప్రైమ్‌ (Prime Video) లో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అగ్రకులానికి చెందిన శివాజీ అనే వ్యక్తికి, తన సొంత కుల సంఘంతోనే విభేదాలు వస్తాయి. అతను మరణించిన తర్వాత, అతని అంత్యక్రియలకు కుల పెద్దలు శ్మశానవాటికలో చోటు ఇవ్వడానికి నిరాకరిస్తారు. అసలు అగ్ర కులానికి చెందిన శివాజీని కుల పెద్ద‌లు ఎందుకు బ‌హిష్కరించారు? మనిషి మరణించినా ఎందుకు శ్మశానంలోకి అనుమతి ఇవ్వలేదు ? కుల వివక్షతో ఆ గ్రామంలో చోటుచేసుకునే రాజకీయాలు ఏమిటి ? అనే ప్రశ్నలతో ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా శివాజీ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని అభినందనలు వస్తున్నాయి.

Read Also : అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి… కూర వండుకుని తినే సైకో… గూస్ బంప్స్ పక్కా

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×