E-Paper
Advertisement

అవుటర్ స్పేస్ లో అనాథలు… ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కు గూస్ బంప్స్

అవుటర్ స్పేస్ లో అనాథలు… ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కు గూస్ బంప్స్
Advertisement

Korean Space Movie: అవుటర్ స్పేస్ కు వెళ్ళాలి అనేది ఎప్పటి నుంచో మనుషులకు ఉన్న కోరిక. అయితే నార్మల్ గా భూమిపై ఎంతోమంది అనాథలు ఉన్నారు. కానీ అదే స్పేస్ లో అనాథ ఉంటే… అందులోనూ స్పెషల్ పవర్స్ ఉన్న ఆ పిల్లాడిని కాపాడడానికి యుద్ధం చేయాల్సి వస్తే… ఎలా ఉంటుందో ‘స్పేస్ స్వీపర్స్’ (Space Sweepers) అనే ఈ సినిమాను చూస్తే తెలుస్తుంది. మరి ఈ సై-ఫై థ్రిల్లర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? దాని కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 2092వ సంవత్సరంలో నడుస్తుంది. విపరీతమైన కాలుష్యం, అడవులు నశించిపోవడం వల్ల భూమి పూర్తిగా మనుషులు జీవించడానికి వీలులేని ఎడారిలా మారిపోతుంది. ‘UTS’ అనే పవర్ ఫుల్ కార్పొరేట్ సంస్థ అంతరిక్షంలో మార్స్ చుట్టూ ఒక సరికొత్త అందమైన ఉపగ్రహ నగరాన్ని నిర్మిస్తుంది. అయితే అక్కడ నివసించే అవకాశం కేవలం ప్రపంచంలోని కొద్దిమంది ధనవంతులకు, ఉన్నత వర్గాలకే లభిస్తుంది.

Advertisement

సామాన్యులు భూమిపై నరకం అనుభవిస్తూ ఉంటారు. అంతరిక్షంలో తిరిగే శాటిలైట్లు, స్పేస్ స్టేషన్ల విరిగిపోయిన వ్యర్థాలను సేకరించి, వాటిని అమ్మి జీవించే టీమ్‌ను ‘స్పేస్ స్వీపర్స్’ అంటారు. అలాంటి ఒక ‘విక్టరీ’ అనే స్పేస్ షిప్‌లో నలుగురు విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళలో తే-హో అనే మాజీ యూటీఎస్ కమాండర్ అంతరిక్షంలో తప్పిపోయిన తన కూతురిని వెతకడానికి డబ్బు కోసం ఆరాటపడుతుంటాడు. విక్టరీ షిప్‌ను నడిపే ధైర్యవంతురాలైన లీడర్ కెప్టెన్ జాంగ్, డ్రగ్ గ్యాంగ్ మాజీ లీడర్, షిప్ ఇంజనీర్ టైగర్ పార్క్, హ్యుమనాయిడ్ రోబో బాబ్స్ ఆ లిస్ట్ లో ఉన్నవాళ్లే.

ఒకరోజు అంతరిక్ష వ్యర్థాలను క్లియర్ చేస్తుండగా ఈ నలుగురికి ఒక విడిపోయిన స్పేస్ క్రాఫ్ట్ దొరుకుతుంది. అందులో ‘డొరొతీ’ అనే ఒక 7 ఏళ్ల చిన్న పాప కనిపిస్తుంది. అయితే, ఆ పాప సాదాసీదా అమ్మాయి కాదు. UTS సంస్థ అంతకుముందే ప్రకటన విడుదల చేస్తుంది. డొరొతీ ఒక అత్యంత ప్రమాదకరమైన రోబో. దాని లోపల ఒక హై-గ్రాడ్యుయెట్ హైడ్రోజన్ బాంబు అమర్చబడి ఉంది అనేది ఆ ప్రకటన సారాంశం. మొదట ఈ నలుగురు భయపడినా, ఆ పాపను ‘బ్లాక్ ఫాక్సెస్’ అనే ఉగ్రవాద ముఠాకు భారీ మొత్తానికి అమ్మేసి తమ అప్పులన్నీ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తారు.

Advertisement

ఈ క్రమంలో డొరొతీతో వీరు గడిపే సమయం, ఆమె అమాయకత్వం చూసి ముఖ్యంగా టైగర్ పార్క్, తే-హోలు ఆమెను సొంత కూతురిలా ప్రేమించడం మొదలుపెడతారు. ఆమె రోబో కాదు.. నానోటెక్నాలజీ వల్ల అద్భుత శక్తులు పొందిన ఒక సాధారణ మానవ శిశువు అని తెలుసుకుంటారు. విచారణలో అసలు విలన్ UTS సంస్థ అధినేత జేమ్స్ సుల్లివన్ అని తేలుతుంది. అతను భూమిని పూర్తిగా సర్వనాశనం చేసి, మార్స్ మీద తన కొత్త సామ్రాజ్యాన్ని శాసించాలనుకుంటాడు. డొరొతీలో ఉన్న శక్తుల ద్వారా భూమిని పూర్తిగా పేల్చివేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈ నిజం తెలుసుకున్న విక్టరీ టీమ్ ప్రాణాలకు తెగించి డొరొతీని ఎలా కాపాడింది ? క్లైమాక్స్‌లో జరిగిన భీకరమైన అంతరిక్ష పోరాటం ఏంటి ? అన్నది తెలుసుకోవడానికి ఈ సినిమాను వీక్షించాల్సిందే.

తెలుగులో మాత్రం లేదు

అంతరిక్ష చెత్త ఏరుకునేవారి అద్భుత ప్రయాణమే ఈ సినిమా. 2021లో విడుదలై దక్షిణ కొరియా సినిమా పరిశ్రమలోనే మొట్టమొదటి భారీ స్పేస్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా గుర్తింపు పొందిన మూవీ ‘స్పేస్ స్వీపర్స్’. సాంగ్ జూంగ్-కి, కిమ్ టే-రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం Netflixలో కొరియన్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో మాత్రం అందుబాటులో లేదు.

Read Also: బ్రతికొచ్చే శవాలు, చేతబడులు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో ఎపిక్ హర్రర్ థ్రిల్లర్

Tags

Related News

చంద్రుడిని పేల్చేసే బోన్ చిల్లింగ్ సై-ఫై థ్రిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్ అంతే

ఇక్కడ బ్రతకాలంటే పక్కనే ఉన్నోడిని చంపాల్సిందే… క్రేజీ కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్

కాంక్రీట్ గోడలో యువతి శవం… పుట్టిన ప్రతీ ఆడపిల్లను క్రూరంగా చంపే ముఠా

అలాంటి అమ్మాయిల రూపంలో లక్ష్మీదేవి… మోస్ట్ అండర్రేటెడ్ మాస్టర్ పీస్

సమంత ‘మా ఇంటి బంగారం’ అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

ప్రేమించిన వాడు పోయాడని కొడుకుతో… ఒంటరిగా చూడాల్సిన మూవీ

బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తే సోకే వైరస్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

Big Stories

Advertisement
×