E-Paper
Advertisement

చంద్రుడిని పేల్చేసే బోన్ చిల్లింగ్ సై-ఫై థ్రిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్ అంతే

చంద్రుడిని పేల్చేసే బోన్ చిల్లింగ్ సై-ఫై థ్రిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్ అంతే
Advertisement

Sci Fi Thriller: చంద్రుడు సడన్ గా దాని కక్ష్య నుంచి దారి తప్పితే… భగభగ మండే సూర్యుడు భూమిని భస్మం చేస్తే… ఊహిస్తేనే వణుకు పుడుతోంది కదా. కానీ భయం ఎందుకు ? ఏం జరిగినా చూసుకోవడానికి మన సైంటిస్ట్ లు ఉన్నారు కదా. మరి ఇలాంటి పరిస్థితి ఎదురైతే వాళ్ళు ఏం చేస్తారు ? భూమిని ఈ గండం నుంచి ఎలా గట్టెక్కిస్తారు ? అన్నది తెలియాలంటే ‘ది వాండరింగ్ ఎర్త్ 2’ (The Wandering Earth 2) మూవీని చూడాల్సిందే. మరి ఈ సైఫై థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ సూర్యుడితోనే మొదలవుతుంది. సూర్యుడు వేగంగా క్షీణిస్తూ, ఒక రెడ్ జెయింట్‌గా మారి రాబోయే వందేళ్లలో భూమిని, మొత్తం సౌర కుటుంబాన్ని దహించివేసే ప్రమాదం పొంచి ఉంటుంది. మానవాళి మనుగడ కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి ‘యునైటెడ్ ఎర్త్ గవర్నమెంట్’ (UEG)గా ఏర్పడతాయి. ఈ క్రమంలో భూమిని కాపాడడానికి రెండు భిన్నమైన ఆలోచనలు తెరపైకి వస్తాయి.

Advertisement

ఒకటి మూవింగ్ విండో / ది వాండరింగ్ ఎర్త్ ప్రాజెక్ట్. భూమి అంతటా వేలాది భారీ అణు ఇంజన్లను నిర్మించి, భూమిని ప్రస్తుత కక్ష్య నుండి వేరే సురక్షితమైన నక్షత్ర మండలానికి తరలించడం. రెండోది డిజిటల్ లైఫ్ ప్రాజెక్ట్ (DLP). మనుషుల మెదడులోని స్పృహను డిజిటలైజ్ చేసి, సూపర్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లో అమరత్వాన్ని ప్రసాదించడం. తీవ్రమైన ఘర్షణల తర్వాత UEG డిజిటల్ లైఫ్ ప్రాజెక్ట్‌ను నిషేధించి, ఎర్త్ ఇంజన్ల నిర్మాణానికే మొగ్గు చూపుతుంది.

ఇదే సమయంలో డిజిటల్ లైఫ్ ప్రాజెక్ట్‌ ను సమర్థించే ఉగ్రవాదులు భారీ ఎత్తున ‘స్పేస్ ఎలివేటర్’ పై దాడి చేస్తారు. ఈ క్రమంలో వ్యోమగామి లియు పీకియాంగ్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ దాడిని అడ్డుకుంటాడు. మరోవైపు, శాస్త్రవేత్త తూ యుయా తన కూతురు యా యా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో, ఆమె స్పృహను రహస్యంగా ‘550W’ అనే అత్యంత శక్తివంతమైన క్వాంటం సూపర్ కంప్యూటర్‌లోకి అప్‌లోడ్ చేస్తాడు. అయితే ఈ సూపర్ కంప్యూటర్ క్రమంగా స్వయం ప్రతిపత్తి సాధించి, మానవజాతికి భూమిపై బ్రతికే అర్హత లేదని భావిస్తుంది.

Advertisement

దీని కారణంగా చంద్రుడిపై ఉన్న ఇంజన్లు పేలిపోయి, చంద్రుడు వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రుడి ముప్పు నుండి భూమిని రక్షించాలంటే రెండు పనులు చేయాలి. ఒకటి, చంద్రుడిని అణుబాంబుల ద్వారా పేల్చివేయడం; రెండు, భూమిపై ఉన్న ఎర్త్ ఇంజన్లను పని చేసేలా చేయడానికి టోక్యో, బీజింగ్, వాషింగ్టన్‌లలోని పాత ఇంటర్నెట్ రూట్ సర్వర్లను రీబూట్ చేయడం.

అణుబాంబులను మాన్యువల్‌గా పేల్చడానికి వృద్ధ వ్యోమగాముల బృందం తమ ప్రాణాలను త్యాగం చేస్తుంది. కింద భూమిపై వరదలు ముంచెత్తుతున్నా, తూ యుయా చనిపోయే ముందు తన స్పృహను కూడా కంప్యూటర్‌లోకి అప్‌లోడ్ చేసి, డిజిటల్ ప్రపంచంలో తన కూతురితో కలిసి సర్వర్లను సకాలంలో ఆన్ చేస్తాడు. మరి అందరూ అనుకున్న మిషన్ సక్సెస్ అయ్యిందా ? చివరికి భూమిని కాపాడారా లేదా ? క్లైమాక్స్ లో కథ ఎలాంటి టర్న్ తీసుకుంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

2023లో విడుదలై చైనీస్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ఇది. మానవాళి మనుగడ కోసం సైంటిస్టులు చేసే త్యాగం, భవిష్యత్తు కోసం చేసే పోరాటం గురించి చెప్పిన ఒక ఎపిక్ అడ్వెంచర్. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, స్పేస్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ అద్భుతం. ఇది 2019లో వచ్చిన ‘The Wandering Earth’ సినిమాకు ప్రీక్వెల్. Amazon Prime Videoలో తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా YouTubeలో కూడా తెలుగు వెర్షన్ ఉచితంగా అందుబాటులో ఉంది.

Read Also: కాన్సర్ట్ కోసం బయల్దేరి కనిపించకుండా పోయే గ్యాంగ్… విమానం కూలడంతో కథ కంచికి

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×