E-Paper
Advertisement

40 ఏళ్ల బ్యాచిలర్ ఇంట్లోకి అందమైన యువతి ఎంట్రీ.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘పరివారిక్ మనోరంజన్’!

40 ఏళ్ల బ్యాచిలర్ ఇంట్లోకి అందమైన యువతి ఎంట్రీ.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘పరివారిక్ మనోరంజన్’!
Advertisement

Parivarik ManuRanjan OTT: పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని చెప్పే కథలు చాలానే వచ్చాయి. నలభై ఏళ్ల వయసులోనూ బ్యాచిలర్‌గా ఉంటూ, తన జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఓ యువతితో ప్రేమలో పడితే పరిస్థితులు ఎలా మారతాయో సరదాగా చూపిస్తోంది  ‘Parivarik ManuRanjan’ సినిమా. బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి, అందాల తార అదితి రావు హైదరి జంటగా నటించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ కి వరుణ్ వి. శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేటర్లకు వెళ్ళకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లక్నో నేపథ్యంలో సాగే ఈ కథలో రొమాన్స్‌తో పాటు కుటుంబ బంధాలు, పొరుగువారి గాసిప్స్, చిన్నపాటి సస్పెన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాను ఎందుకు చూడాలి? కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ కథ లక్నోకు చెందిన 40 ఏళ్ల బ్రహ్మచారి రంజన్ దూబే (పంకజ్ త్రిపాఠి) చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రంజన్, తన ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసే బాధ్యతలో పడి తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ ఒంటరిగా మిగిలిపోతాడు. తండ్రి వదిలివెళ్లిన పెద్ద పురాతన భవనంలో నివసించే రంజన్, ఇంటి పనులు చూసుకోవడం కష్టమవడంతో ఒక హౌస్ కీపర్ కోసం పేపర్‌లో ప్రకటన ఇస్తాడు. ఆ ప్రకటన చూసి హెలెన్ (అదితి రావ్ హైదరీ) ఆ ఇంటికి ప్రాపర్టీ మేనేజర్‌గా వస్తుంది. హెలెన్ రాకతో పాడుబడినట్లు ఉన్న ఆ భవనం కళకళలాడటమే కాకుండా, రంజన్ నిస్సారమైన జీవితంలోకి కొత్త వెలుగు వస్తుంది. పెళ్లికాని ఆడ, మగ ఒకే ఇంట్లో కలిసి ఉండటంపై ఇరుగుపొరుగు వారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ, వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. రోజులు గడిచేకొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఆ స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది.

Advertisement

అయితే కథ సాఫీగా సాగుతున్న సమయంలో హెలెన్ అసలు పేరు మను జోషి అని, ఆమె గతానికి సంబంధించి ఒక పెద్ద రహస్యం ఉందని బయటపడుతుంది. ఈ నిజం తెలియడంతో రంజన్ కుటుంబంలో మరియు కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. అసలు మను ఆ ఇంటికి ఎందుకు వచ్చింది, ఆమె గతం ఏమిటి, ఆ పరిస్థితులన్నింటినీ దాటుకుని రంజన్, మను ఒక్కటయ్యారా లేదా అనేదే మిగిలిన కథ. పెద్దగా ఉత్కంఠభరితమైన మలుపుల కోసం కాకుండా, తేలికపాటి హాస్యం, రొమాన్స్‌తో కూడిన కుటుంబ కథను చూడాలనుకునేవారికి ఇది ఒకసారి ప్రయత్నించదగ్గ సినిమా.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

ఈ సినిమాలో రంజన్ దూబేగా పంకజ్ త్రిపాఠి, హెలెన్‌గా అదితి రావు హైదరి నటించారు. వీరితో పాటు బ్రిజేంద్ర కాలా, ముకేశ్ తివారీ, సునీతా రాజ్వర్, విజయంత్ కోహ్లీ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. వరుణ్ వి. శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బ్రిజేంద్ర కాలా, అలీ అబ్బాస్ జాఫర్, వరుణ్ వి. శర్మ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ సినిమా 2026 నవంబర్ 13 నుంచి SonyLIVలో నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ భాషలో అందుబాటులో ఉన్న ఈ సినిమా నిడివి 1 గంట 54 నిమిషాలు.

Advertisement

Read Also: లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా

Tags

Related News

దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు… ప్రతి క్షణం ఉత్కంఠ.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తెరవెనుక గ్లామర్ తారల చీకటి దందాలు… ఓ హీరోయిన్ సూసైడ్ వెనుక ఇంత పెద్ద మాఫియా కథా?

లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా

రణబాలిగా ఓటీటీలో విజయ్ దేవరకొండ ఊచకోత షురూ… ఈ రేంజ్ వైలెన్స్ ఎప్పుడైనా చూశారా?

ఓటీటీలోకి ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ కల్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Friday OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 18 స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×