Malayalam Crime Thriller: సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ తీయడంలో మలయాళ మేకర్స్ తర్వాతే ఎవరైనా. తక్కువ బడ్జెట్ తో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ మైండ్ తో ఆడుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. పెద్ద హంగామా లేకుండానే ఆసక్తికరమైన కథనం, ఊహించని మలుపులతో ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తారు. ఇప్పుడు అలాంటి కంటెంట్ ఉన్న క్రైమ్ మిస్టరీతో వచ్చిన మలయాళ చిత్రం ‘ది థర్డ్ మర్డర్’ (The Third Murder) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (నవంబర్ 13) రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చిందో? కథేంటో చూద్దాం పదండి.
ఓ నగరంలో డ్రగ్స్ వ్యాపారం చేసే జస్టిన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే వ్యాపారవేత్త బోబన్ కూడా అదే తరహాలో హత్యకు గురవుతాడు. రెండు హత్యలు ఒకే పద్ధతిలో జరగడంతో పోలీసులకు అనుమానాలు మొదలవుతాయి. ఈ కేసును ఛేదించే బాధ్యత DYSP క్రిస్టీ (సైజు కురుప్)కు అప్పగిస్తారు.
అయితే, ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడం అంత సులభం కాదని క్రిస్టీకి అర్థమవుతుంది. దీంతో సీరియల్ కిల్లర్ కేసులపై అనుభవం ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారి స్వామి (ఇంద్రన్స్) సహాయం తీసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఆధారాలను పరిశీలిస్తూ, హత్యల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
ఈ దర్యాప్తు క్రమంలో ఆదిత్య అనే సమస్యలతో సతమతమవుతున్న యువకుడి పేరు తెరపైకి వస్తుంది. అతనికి తన తండ్రితో ఉన్న విభేదాలు, కుటుంబ పరిస్థితులు కూడా ఈ కేసులో కీలకంగా మారతాయి. ఒకవైపు మరో హత్య జరగకుండా అడ్డుకోవాల్సిన ఒత్తిడి, మరోవైపు కనిపిస్తున్న ఆధారాల వెనుక దాగి ఉన్న నిజాలను కనిపెట్టాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురవుతుంది.
అసలు జస్టిన్, బోబన్‌లను హత్య చేసింది ఎవరు? ఈ రెండు హత్యలకు ఆదిత్యకు ఉన్న సంబంధం ఏమిటి? మూడో హత్య జరగకముందే క్రిస్టీ, స్వామి అసలు నేరస్థుడిని పట్టుకోగలిగారా? అనే అంశాలతో సినిమా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మూడు హత్యల చుట్టూ అల్లుకున్న మిస్టరీ, పాత్రల మధ్య దాగి ఉన్న సంబంధాలు కథలో ఆసక్తిని పెంచుతాయి.
సైజు కురుప్, ఇంద్రన్స్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది థర్డ్ మర్డర్’ (The Third Murder) సినిమాకు సునీల్ ఇబ్రహీం దర్శకత్వం వహించారు. 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 13 నుంచి ManoramaMAXలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓవర్సీస్ ప్రేక్షకులు SimplySouthలో చూడవచ్చు. మలయాళం ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: ఇదెక్కడి కొరియన్ థ్రిల్లర్రా సామీ… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది… చావాలనుకుంటే ఈ సిరీస్ ను చూడండి