E-Paper
Advertisement

కోట్లాది మంది చూసిన ఈ రెండు సిరీస్‌లకు నెట్‌ఫ్లిక్స్ గుడ్‌బై… లాస్ట్ ఛాన్స్ భయ్యా

కోట్లాది మంది చూసిన ఈ రెండు సిరీస్‌లకు నెట్‌ఫ్లిక్స్ గుడ్‌బై… లాస్ట్ ఛాన్స్ భయ్యా
Advertisement

Netflix Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాకముందే రెండు పాపులర్ సిరీస్‌లు ప్లాట్‌ఫామ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాయి. ఒకటి రోమన్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గ్లాడియేటర్ కథ… మరొకటి అమెరికా కంట్రీ మ్యూజిక్ ప్రపంచంలో జరిగే ప్రేమలు, పోటీలు, రాజకీయాల కథ. అసలు ఈ రెండు సిరీస్‌లను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు తొలగిస్తోంది? ఎప్పటి వరకు చూడొచ్చు? మళ్లీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందా? ఈ రెండు సిరీస్‌లలో అంత ప్రత్యేకత ఏముంది? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ముందుగా స్పార్టకస్ (Spartacus) విషయానికి వస్తే… రోమన్ సామ్రాజ్యంలో ఒక సాధారణ మనిషి బానిసగా మారి, గ్లాడియేటర్‌గా అరేనాలోకి పంపుతారు. మరణం తప్పదనుకున్న సమయంలో తన ప్రాణాలను కాపాడుకోవడమే కాదు, యుద్ధంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాడు. క్రమంగా అతని చుట్టూ మరికొందరు బానిసలు, గ్లాడియేటర్లు చేరతారు. చివరకు రోమన్ సామ్రాజ్యానికే సవాల్ విసిరే భారీ తిరుగుబాటుకు స్పార్టకస్ నాయకుడిగా మారతాడు.

Advertisement

రక్తపాతం, గ్లాడియేటర్ ఫైట్స్, ప్రతీకారం, స్నేహం, ప్రేమ, రాజకీయ కుట్రలు కలిసిన ఈ సిరీస్‌లో స్పార్టకస్ ప్రయాణం ఒక్క సీజన్‌తో ముగిసిపోదు. బానిసగా మొదలైన అతని కథ క్రమంగా ఒక యోధుడి కథగా, ఆ తర్వాత రోమ్‌కు వ్యతిరేకంగా నిలిచిన తిరుగుబాటు కథగా మారుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం సిరీస్‌కు సంబంధించిన నాలుగు సీజన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక రెండో సిరీస్ నాష్‌విల్లే (Nashville). పేరు వింటే మ్యూజిక్ గుర్తొస్తుంది. కానీ ఇది కేవలం పాటల కథ కాదు. అమెరికా కంట్రీ మ్యూజిక్ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ కోసం జరిగే పోటీ, ఈగోలు, వ్యక్తిగత సంబంధాలు, కెరీర్ కోసం తీసుకునే కఠిన నిర్ణయాలు, ఇండస్ట్రీలోని రాజకీయాల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది.

Advertisement

ఒకప్పుడు మ్యూజిక్ ప్రపంచాన్ని ఏలిన సీనియర్ సింగర్ రేయ్నా జేమ్స్ తన కెరీర్ క్రమంగా తగ్గిపోతున్న సమయంలో, కొత్త తరం స్టార్ జూలియెట్ బార్న్స్ తన స్థానాన్ని సంపాదించుకోవడానికి దూసుకొస్తుంది. వీరిద్దరి మధ్య మొదలయ్యే పోటీ క్రమంగా వ్యక్తిగత జీవితాలు, ప్రేమలు, కుటుంబ సంబంధాలు, మ్యూజిక్ బిజినెస్‌తో ముడిపడుతుంది. మొత్తం ఆరు సీజన్లలో ఈ ప్రపంచం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఏడాది కాకుండానే డిలీట్

అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ రెండు సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎందుకు వెళ్తున్నాయి ? అంటే… కారణం కంటెంట్ నచ్చకపోవడం కాదు. నెట్‌ఫ్లిక్స్‌కు ఈ టైటిల్స్‌పై శాశ్వత హక్కులు లేవు. ఇతర స్టూడియోలు, ప్రొడక్షన్ సంస్థల నుంచి లైసెన్స్ తీసుకుని ప్రసారం చేస్తున్న సిరీస్‌లకు ఒప్పంద గడువు ముగిసినప్పుడు వాటిని తొలగించాల్సి వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ స్వయంగా కూడా లైసెన్సింగ్ ఒప్పందాలు ముగిసినప్పుడు కొన్ని సినిమాలు, సిరీస్‌లు ప్లాట్‌ఫామ్ నుంచి వెళ్లిపోతాయని చెబుతోంది.

అమెరికాలో నెట్‌ఫ్లిక్స్ నుంచి సెప్టెంబర్ 15న ఈ రెండు సిరీస్‌లను డిలీట్ చేయనున్నారు. అంటే వీటిని చూడాడనికి చివరి ఛాన్స్ సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. అయితే ఇది Netflix US లైబ్రరీకి సంబంధించిన సమాచారం. ఇతర దేశాల్లో తొలగింపు తేదీలు వేరుగా ఉండొచ్చు. కాబట్టి స్పార్టకస్‌లోని రక్తికట్టించే గ్లాడియేటర్ యాక్షన్ చూడాలనుకున్నా, నాష్‌విల్లేలోని మ్యూజిక్, ఎమోషన్స్, ఇండస్ట్రీ డ్రామాను ఆస్వాదించాలనుకున్నా… నెట్‌ఫ్లిక్స్‌ ఉన్నవారికి ఇప్పుడు వీటిని పూర్తిగా చూసే సమయం ఉంది. ముఖ్యంగా స్పార్టకస్‌ను యాక్షన్, హిస్టారికల్ డ్రామా ఇష్టపడేవారు మిస్ కాకుండా చూడొచ్చు.

Read Also: ప్రాణాలు కాపాడిన డాక్టర్‌పైనే పిచ్చి… పెళ్ళాం ఉన్నా వదలకుండా ఇదేం అరాచకం భయ్యా

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×