E-Paper
Advertisement

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రముఖ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య.. చెల్లెలికి తీవ్ర గాయాలు!

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రముఖ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య.. చెల్లెలికి తీవ్ర గాయాలు!
Advertisement

TikTok Star Murder: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ షమ్సు బీబీ (Shamsu Bibi) దారుణ హత్యకు గురయ్యారు. ట్యాక్సిలా ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆమెపైకి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 14న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కాల్పుల ఘటన ఎలా జరిగిందంటే?

హత్య జరిగిన రోజు కషిష్ అనే వ్యక్తి తన కుమార్తెకు ఫోన్ చేసి ఇంటి బయటకు రమ్మని పిలిచాడని షమ్సు బీబీ తండ్రి ఫజల్ సాహిబ్‌జాదా తెలిపారు. ఆ తర్వాత షమ్సు బీబీ తన 15 ఏళ్ల చెల్లెలు అసిమా, సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయలుదేరినట్లు స్పష్టం చేశారు. వారు ఒక పెట్రోల్ బంక్ సమీపానికి చేరుకోగానే.. 30 నుంచి 35 ఏళ్ల వయస్సున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారుపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్లు షమ్సు బీబీ మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు ఆమె చెల్లెలు అసిమా తీవ్రంగా గాయపడింది.

Advertisement

టిక్‌టాక్ ఖాతా డీయాక్టివేషన్

షమ్సు బీబీ గత 3-4 ఏళ్లుగా టిక్‌టాక్ వీడియోలు చేస్తోందని ఆమె తండ్రి ఫజల్ సాహిబ్‌జాదా పేర్కొన్నారు. ఆమె సోదరుడు రహమతుల్లా చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె ఖాతాకు 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. 30 నుంచి 35 మిలియన్ల మంది ఆమె పోస్టులను లైక్స్ చేశారు. అయితే ఈ దారుణ హత్య అనంతరం కుటుంబ సభ్యులు ఆమె సామాజిక మాధ్యమ ఖాతాను డీయాక్టివేట్ చేశారు.

Advertisement

Also Read: బీజేపి కొత్త కార్యవర్గం.. జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి.. స్మృతి ఇరానీకి కీలక పదవి!

ఆర్థిక లావాదేవీల వల్లే..

షమ్సు బీబీకి కౌసర్, జావేద్ అనే వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వద్ద ఉన్న తన డబ్బును తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో షమ్సుకి బెదిరింపులు మెుదలయ్యాయని పేర్కొన్నారు. దీనిపై ఆమె గతంలోనే ఇస్లామాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలియజేశారు. తన కుమార్తె డబ్బును కాజేసే ఉద్దేశంతోనే సదరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రైమ్‌లో కషిష్ అనే వ్యక్తి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Vi బంపరాఫర్.. రూ.160 లోపే బెస్ట్ కాంబో ప్యాక్స్.. ఫ్రీ కాల్స్, డేటా ఆఫర్లు!

Tags

Related News

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

Big Stories

Advertisement
×