OTT Movie : భూమి మీదసృష్టించబడని జీవి ఏదైనా ఉంది అంటే అది ఏలియన్ మాత్రమే. వీటి గురించి చాలా సినిమాలే వచ్చాయి. చాలా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసి డిఎన్ఏ, మనిషి డిఎన్ఏ కలిపి ఒక కొత్త జీవిని సృష్టిస్తారు. ఆ తర్వాత ఇబ్బందుల్లో పడతారు. ఆ జీవి మానవ రూపంలో ఉంటూ, తీవ్రంగా ప్రవర్తిస్తుంటుంది. కొంతమంది దీని బారిన పడి చనిపోతూ ఉంటారు. ఉత్కంఠంగా సాగిపోయే ఈ సినిమా పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (mazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా పేరు ‘స్పీసీస్’ (Species). ఈ మూవీకి రోజర్ డోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. ఇందులో బెన్ కింగ్‌స్లీ, మైఖేల్ మాడ్‌సెన్, ఆల్‌ఫ్రెడ్ మోలినా, ఫారెస్ట్ విటేకర్, మార్గ్ హెల్గెన్‌బెర్గర్, నటాషా హెన్‌స్ట్రిడ్జ్ నటించారు. ఈ మూవీలో శాస్త్రవేత్తలు గ్రహాంతర, మానవ జాతి అయిన ఒక జీవిని సృష్టిస్తారు. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీలో హారర్, సైన్స్ ఫిక్షన్ అంశాలు కలిసి ఉంటాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
శాస్త్రవేత్తల బృందం ఒక ప్రోగ్రామ్ లో భాగంగా, అంతరిక్షం నుండి ఒక సంకేతాన్ని స్వీకరిస్తుంది. ఈ సంకేతంలో గ్రహాంతర వాసి DNA ను, మానవ DNA తో కలపడానికి సూచనలు ఉంటాయి. ఈ ప్రయోగాన్ని నిర్వహించే శాస్త్రవేత్తలు ఒక కొత్త జీవిని సృష్టిస్తారు. ఈ ప్రయోగం ఫలితంగా సిల్ అనే అమ్మాయి పుడుతుంది. ఆమె చిన్న వయస్సులోనే అసాధారణ వేగంతో పెరుగుతుంది. సిల్ త్వరలోనే ఒక అందమైన యువతిగా మారుతుంది, కానీ ఆమెలోని గ్రహాంతర స్వభావం ఉంటుంది. ఆమె మనిషి రూపంలో ఉన్నా కూడా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. ఆమె శాస్త్రవేత్తల నుండి తప్పించుకుని, మానవ జాతిని ఆకర్షించి తన జాతిని విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. అందులో బాగంగా చాలా మందితో రొమాన్స్ చేస్తుంది. ఆ తరువాత వాళ్ళను చంపేస్తుంది. ఆమె మనిషి రూపంలో కనిపించినప్పటికీ, ఆమెలో దాగి ఉన్న గ్రహాంతర రూపం చాలా శక్తివంతంగా ఉంటుంది.
ఆమెను ఆపడానికి శాస్త్రవేత్తలు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక శాస్త్రవేత్త , ఒక ప్రభుత్వ ఏజెంట్ , ఒక సైనిక నిపుణుడు ఉంటారు. వారు సిల్‌ను లాస్ ఏంజిల్స్‌లో ట్రాక్ చేస్తారు. ఆమె అక్కడ పురుషులను తన అందంతో రెచ్చగొట్టి, ఏకాంతంగా గడపటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సిల్‌ను ఆపడానికి బృందం చేసే ప్రయత్నాలు, ఆమె భయంకరమైన సామర్థ్యాలు కథను ముందుకు నడిపిస్తాయి. ఆ తరువాత సిల్‌ను నాశనం చేయడంలో ఈ బృందం పక్కా ప్రాణాళికతో ముందుకు వెళ్తుంది. చివరికి సిల్‌ను శాస్త్రవేత్తల బృందం అంతం చేస్తుందా ? సిల్ వల్ల జరగబోయే నష్టం ఏమిటి ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.