BigTV English

Empuraan Day 2 Collections : బాక్సాఫీస్ ఊచకోత.. రికార్డులను బ్రేక్ చేస్తున్న కలెక్షన్స్..?

Empuraan Day 2 Collections : బాక్సాఫీస్ ఊచకోత.. రికార్డులను బ్రేక్ చేస్తున్న కలెక్షన్స్..?

Empuraan Day 2 Collections : మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ఎంపురాన్ అనే మూవీ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టేస్తుంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు. 2019 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేసిన మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ చిత్రానికి సీక్వెల్ ఈ మూవీ వచ్చింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని వసూలు చేసింది. లూసీఫర్ మూవీతో పోలిస్తే ఈ మూవీ కలెక్షన్స్ భారీగానే వసూల్ చేస్తుంది. రెండు రోజులకు గాను ఎంపురాన్ ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం..


Also Read: అక్కినేని ఫ్యామిలీకి షాక్.. శోభిత ఇలా చేస్తుందేంటి..?

ఎంపురాన్ కలెక్షన్స్.. 


మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ `ఎల్‌ 2 ఎంపురాన్‌`. ఈ చిత్రం గురువారం విడుదలైంది.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 150 కోట్ల రూపాయలు, కేరళలో తొలి భారీ బడ్జెట్ చిత్రమని ఆయన వెల్లడించారు.. పలు భాషల్లో ప్రముఖ పంపిణీదారులు ఈ సినిమాను రిలీజ్ చేశారు. కేరళలో గోకుళం ఫిలింస్, కన్నడలో హోంబలే ఫిలింస్, హిందీలో అనిల్ తడానీ లాంటి వ్యక్తులు కమిషన్ బేస్ మీద రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొదటి రోజు ఓవర్సీస్ తో కలిపి 40 కోట్లకు పైగా వసూల్ చేసింది. రెండో రోజు కూడా అదే జోరులో వసూల్ చెయ్యడం విశేషం.7 కోట్లకుపైగా వసూళ్లను, తెలుగులో ఈ చిత్రం 1 కోటి రూపాయలు, కన్నడలో 2.5 కోట్లు, ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని వెల్లడించారు. దాంతో ఈ సినిమా 2వ రోజు 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని అంచనా.. మొత్తానికి రెండో రోజుకే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందని తెలుస్తుంది. ఇక ఇదే విధంగా కలెక్షన్స్ వస్తే.. నెలలోపే 2000 కోట్లు వసూల్ చేసే అవకాశాలు ఉన్నాయన ట్రేడ్ పంతులు అంటున్నారు.

స్టోరీ విషయానికొస్తే..

ఈ ఎంపురాన్ చిత్రాన్ని శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. లూసీఫర్ 2 : ఎంపురాన్ చిత్రానికి 150 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. ఎంపురాన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు .. స్టోరీ కొత్తగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులకు చిత్రం బాగా నచ్చేసింది. ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్‌ మూవీకి కంటిన్యూగా తెరకెక్కించారు డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. పీఆకేఆర్‌ వారసత్వంగా వచ్చిన జితిన్‌ తప్పుదారి పట్టడం, రాష్ట్రాన్ని అవినీతి మయంగా చేసి తాను స్వలాభం పొందే ప్రయత్నం చేయగా దాన్ని లూసిఫర్‌, ప్రియదర్శిని రామ్‌ దాస్‌ ఎలా ఎదుర్కొన్నారనేది మూవీ స్టోరీ.. మొత్తం దేశంలో జరిగిన కొన్ని పరిస్థితులను చూపించారు. మోహన్ లాల్ నటిస్తున్న ప్రతి మూవీ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×