E-Paper
Advertisement

పిల్లల సమస్యలకు సొల్యూషన్ చెప్పే సూపర్ పాండా… ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు

పిల్లల సమస్యలకు సొల్యూషన్ చెప్పే సూపర్ పాండా… ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు
Advertisement

Stillwater Season 5 OTT: పిల్లలకు ఏదైనా సమస్య వస్తే పెద్దలు వెంటనే సలహా ఇవ్వడం కామన్. కానీ ఆ సమస్యలకు పరిష్కారం చెప్పేది ఓ పెద్దాయన కాదు… ప్రశాంతంగా ఉండే ఓ సూపర్ పాండా అయితే ? స్కూల్‌లో ఫ్రెండ్స్‌తో గొడవలు, కొత్తవాళ్లను కలవడం, భయం, బాధ, ఒంటరితనం, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు… ఇలా పిల్లల రొటీన్ లైఫ్ లో ఎదురయ్యే ఎన్నో విషయాలకు స్టిల్‌వాటర్ అనే పాండా చాలా కూల్‌గా పరిష్కారాలు చూపిస్తుంటే ? అలాంటి అందమైన కాన్సెప్ట్‌తో పిల్లలతో పాటు పెద్దలను ఆకట్టుకున్న యానిమేటెడ్ ఫ్యామిలీ సిరీస్ ‘Stillwater’ ఇప్పుడు సీజన్ 5తో వచ్చేసింది. మరి ఈ పాండా స్పెషల్ ఏంటి ? పిల్లలకు ఏం నేర్పిస్తుంది ? ఏ ఓటీటీలో ఉంది ? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కార్ల్, యాడీ, మైఖేల్ అనే ముగ్గురు పిల్లలకు స్టిల్‌వాటర్ అనే పొరుగింటి స్నేహితుడు ఉంటాడు. అయితే అతను మనిషి కాదు. ఎంతో ప్రశాంతంగా, తెలివిగా ఉండే ఓ పాండా. పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే సమాధానం చెప్పకుండా, వాళ్లే తమ సమస్యను అర్థం చేసుకునేలా ప్రశ్నలు అడుగుతూ, తన అనుభవాలు, కథల ద్వారా సరైన దారి చూపిస్తాడు. పిల్లల జీవితాల్లో ప్రతిరోజూ కొత్త సమస్యలు ఎదురవుతుంటాయి. స్నేహితులతో గొడవలు, కొత్త వ్యక్తులతో ఎలా కలవాలో తెలియకపోవడం, భయం, కోపం, బాధ, ఒంటరితనం వంటి భావోద్వేగాలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకపోవడం జరుగుతుంది.

Advertisement

అలాంటి సమయంలో స్టిల్‌వాటర్ వాళ్లకు మంచి స్నేహితుడిలా అండగా నిలుస్తాడు. అయితే స్టిల్‌వాటర్ రెడీమేడ్ సొల్యూషన్స్ ఇవ్వడు. ముందుగా పిల్లలు తమ భావాలను అర్థం చేసుకునేలా చేస్తాడు. కోపం ఎందుకు వస్తుంది ? భయపడినప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండాలి ? స్నేహితుడితో గొడవ అయితే ఎలా పరిష్కరించుకోవాలి ? ఇలాంటి విషయాలను చాలా సింపుల్‌గా, పిల్లలకు అర్థమయ్యే విధంగా చెబుతాడు.

ఇదే ఈ సిరీస్‌లోని ప్రత్యేకత. భారీ యాక్షన్, ట్విస్టులు లేకుండా, పిల్లల జీవితంలో జరిగే చిన్న సంఘటనలనే కథలుగా తీసుకుని, వాటి ద్వారా మంచి లైఫ్ లెసన్స్ చెప్పడం ఆకట్టుకుంటుంది. సీజన్ 5లో కూడా కొత్త కథలతో పిల్లల ముందుకు వచ్చింది. మైఖేల్ స్కూల్లో కొత్త పిల్లాడితో స్నేహం చేయడం, చనిపోయిన ఓ పక్షిని చూసినప్పుడు పిల్లలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వంటి సున్నితమైన అంశాలను ఇందులో చూపించారు. అంటే సంతోషంతో పాటు బాధ, నష్టం వంటి భావాలను కూడా పిల్లలు అర్థం చేసుకునేలా కథలు సాగుతాయి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

Advertisement

పిల్లలను ఎంటర్‌టైన్ చేయడంతో పాటు మైండ్‌ఫుల్‌నెస్, ఓపిక, స్నేహం, ఇతరులను గౌరవించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వంటి మంచి విషయాలను నేర్పించడం ఈ సిరీస్ ప్రత్యేకత. పిల్లల సమస్యలపై వెంటనే తీర్పు చెప్పకుండా వాళ్ల మాట వినడం వంటి విషయాలను తల్లిదండ్రులకు కూడా ఈ సిరీస్ గుర్తు చేస్తుంది. జాన్ జే ముత్ రాసిన ప్రముఖ Zen పుస్తకాల సిరీస్ ఆధారంగా ఈ షో రూపొందింది. స్టిల్‌వాటర్‌కు జేమ్స్ సీ, కార్ల్‌కు జుడా మాకీ, యాడీకి ఇవా ఏరియల్ బైండర్, మైఖేల్‌కు టక్కర్ చాండ్లర్ వాయిస్ అందించారు. ఈ సిరీస్ ఆగస్టు 21 నుంచి Apple TV+లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు కొత్త ఎపిసోడ్‌లతో సీజన్ ప్రారంభమైంది. గత నాలుగు సీజన్లు కూడా యాపిల్ టీవీలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఈ సిరీస్ తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.

Read Also: ప్రేయసి తల్లి, అక్కతోనే రిలేషన్… పెళ్లి చేసుకున్నాక బయటపడే షాకింగ్ ట్విస్ట్

Tags

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×