E-Paper
Advertisement

ప్రేయసి తల్లి, అక్కతోనే రిలేషన్… పెళ్లి చేసుకున్నాక బయటపడే షాకింగ్ ట్విస్ట్

ప్రేయసి తల్లి, అక్కతోనే రిలేషన్… పెళ్లి చేసుకున్నాక బయటపడే షాకింగ్ ట్విస్ట్
Advertisement

Adult Comedy on OTT: ఓ అబ్బాయి అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెళ్లికి ముందు తన గతంలోని ప్రేమ సంబంధాలన్నింటినీ ప్రేయసికి నిజాయితీగా చెప్పేస్తాడు. ఆమె కూడా అతని గతాన్ని అంగీకరించి పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక్కడితో కథ సాఫీగా సాగిపోతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. పెళ్లి తర్వాత అత్తారింట్లో అడుగు పెట్టిన హీరో… అక్కడ కనిపించిన ఇద్దరు మహిళలను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే వాళ్లిద్దరితోనూ అతనికి గతంలో సంబంధాలు ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన అడల్ట్ కామెడీ మూవీ ‘స్వీటీ నాటీ క్రేజీ’ (Sweety Naughty Crazy). మరి హీరో గతంలో ఎవరెవరితో రిలేషన్‌లో ఉన్నాడు? పెళ్లి తర్వాత అతని జీవితం ఎలా తలకిందులైంది? ఈ బోల్డ్ కామెడీని తెలుగులో ఎక్కడ చూడొచ్చు? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

శివ అనే కాలేజీ కుర్రాడు సరదాగా ఉండే వ్యక్తి. అయితే అతని లవ్ లైఫ్ మాత్రం కాస్త గందరగోళంగానే ఉంటుంది. ఒకేసారి మూడు రిలేషన్‌షిప్స్‌ను ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో అనిత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ చివరకు పెళ్లి చేసుకునే స్థాయికి చేరుతుంది. పెళ్లికి ముందు తన గతాన్ని దాచకూడదని నిర్ణయించుకున్న శివ, గతంలో తనకు ఉన్న ప్రేమ సంబంధాల గురించి అనితకు నిజాయితీగా చెబుతాడు. అతని నిజాయితీని అర్థం చేసుకున్న అనిత కూడా గతాన్ని అంగీకరించి పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని అనిత ఇంటికి వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది.

Advertisement

ఇంట్లో అడుగు పెట్టిన శివకు అక్కడ కనిపించిన ఇద్దరు మహిళలను చూసి దిమ్మతిరిగిపోతుంది. ఎందుకంటే వాళ్లిద్దరితోనూ అతనికి గతంలో సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. వారిలో ఒకరు అనిత అక్క కాగా… మరొకరు అనిత తల్లి అని బయట పడటంతో షాకింగ్ సిట్యుయేషన్ ఎదురవుతుంది. అప్పటి వరకు గతాన్ని దాచి పెట్టి మూడు రిలేషన్‌షిప్స్‌ను బ్యాలెన్స్ చేసిన శివకు, ఇప్పుడు అదే గతం పెళ్లి తర్వాత ఇంట్లోనే ఎదురవుతుంది. భార్యకు నిజం తెలిసిపోతుందేమోననే భయం, కుటుంబ సభ్యుల ముందు పరిస్థితిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం, గత పరిచయాలతో ఎదురయ్యే ఇబ్బందులు… ఇవన్నీ కలిసి కథను కామెడీగా నడిపిస్తాయి.

అయితే శివ గతం ఒక్కటే సమస్య కాదు. ఒక్కో విషయం బయటపడే కొద్దీ అతని పెళ్లి జీవితం మరింత కష్టంగా మారుతుంది. భార్యకు అసలు నిజం పూర్తిగా తెలిసిన తర్వాత ఏం జరిగింది ? కుటుంబంలో ఇంకా ఎలాంటి రహస్యాలు బయటపడ్డాయి ? శివ తన పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాడు ? అనేదే సినిమాలో మిగిలిన కథ.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

‘స్వీటీ నాటీ క్రేజీ’కి రాజశేఖర్ జి దర్శకత్వం వహించారు. త్రిగుణ్, శ్రీజితా ఘోష్, ఇనియా, రాధ, తంబి రామయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సుమారు 2 గంటల 20 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. ప్రస్తుతం Aha Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీగా అందుబాటులో ఉన్న ఈ సినిమా బోల్డ్ హ్యూమర్, రిలేషన్‌షిప్ గందరగోళం, ఊహించని ఫ్యామిలీ ట్విస్టులతో సాగుతుంది. అయితే A-rated అడల్ట్ కామెడీ కావడంతో ఇది పిల్లలతో కలిసి చూడడానికి మాత్రం సరైన సినిమా కాదు. అంటే ‘స్వీటీ నాటీ క్రేజీ’ పెద్దలకు మాత్రమే.

Read Also: పెళ్లయ్యాక భర్తే అత్తారింటికి వెళ్తే… కడుపుబ్బా నవ్వించే ఈ జెన్ జీ రోమ్ కామ్ మూవీ తెలుగులోనే స్ట్రీమింగ్

Tags

Related News

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×