BigTV English

OTT Movie : సాయం చేద్దామని వెళ్ళి కిడ్నాప్ కేసులో అడ్డంగా బుక్కయ్యే అన్నదమ్ములు… గంటన్నర సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : సాయం చేద్దామని వెళ్ళి కిడ్నాప్ కేసులో అడ్డంగా బుక్కయ్యే అన్నదమ్ములు… గంటన్నర సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో ఒక బాలీవుడ్ సినిమా దుమ్ము లేపుతోంది. ఈ సినిమాను రియల్ స్టోరీ ఆధారంగా రూపొందించారు. ఇది 2018లో అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ లించింగ్ లో జరిగిన, ఒక రియల్ సంఘటన నుండి స్ఫూర్తి పొందింది.  అక్కడ WhatsApp ద్వారా వ్యాపించిన ఒక తప్పుడు ప్రచారం వల్ల, ఇద్దరు వ్యక్తులు అకారణంగా హత్యకు గురవుతారు. ఈ స్టోరీతో రీసెంట్ గా వచ్చిన ఒక మూవీ, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ  సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్టోలన్’ (Stolen). 2025 లో వచ్చిన ఈ సినిమాకి కరణ్ తేజ్‌పాల్ దర్శకత్వం వహించారు. ఇందులో అభిషేక్ బెనర్జీ (గౌతమ్ బన్సాల్), శుభం వర్ధన్ (రామన్ బన్సాల్), మియా మెల్జర్ (ఝుంపా) ప్రధాన పాత్రల్లో నటించారు.  1 గంట 33 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.5/10 రేటింగ్ ఉంది. 2025 జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

రాజస్థాన్‌లోని ఒక చిన్న రైల్వే స్టేషన్‌లో, గౌతమ్ బన్సాల్ అనే వ్యాపారవేత్త, తన తమ్ముడు రామన్ బన్సాల్ ని రిసీవ్ చసుకోవడానికి వస్తాడు. రామన్ సున్నిత మనస్తత్వం కలిగినవాడు. గౌతమ్ స్వార్థపరుడుగా  ఉంటాడు. రైల్వే స్టేషన్‌లో ఝుంపా అనే పేద మహిళ తన 5 నెలల బిడ్డ చంపాను కోల్పోయిన సంఘటనను చూస్తాడు. ఆమె బిడ్డకోసం రోధిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక మహిళ శిశువుతో పరిగెత్తడం చూసిన రామన్, ఝుంపా బాధను చూసి, ఆమెకు సహాయం చేయాలని అనుకుంటాడు. అయితే గౌతమ్ మాత్రం ఈ సమస్యలో చిక్కుకోవడానికి ఇష్టపడడు.

స్థానిక పోలీసులు ఝుంపా పేదరికం కారణంగా,  ఈ కేసును పెద్దగా పట్టించుకోరు. కాబట్టి రామన్, గౌతమ్‌ను ఒప్పించి, ఝుంపాతో కలిసి శిశువును వెతకడానికి ఒక ప్రమాదకరమైన ప్రయాణంలోకి దిగుతారు. వాళ్ళు ఒక సురిలీ అనే మహిళ, ఆమె సహచరుడు అచ్చేలాల్‌ను వెతుకుతూ, బన్స్‌దోలా అనే గ్రామంలోని రిహాబిలిటేషన్ సెంటర్‌కు చేరుకుంటారు. ఈ ప్రయాణంలో, వీళ్ళు ఒక WhatsApp వైరల్ వీడియో ద్వారా, పొరపాటున అనుమా నితులుగా ఆరోపించబడతారు. ఇది స్థానిక గ్రామస్తులలో కోపాన్ని పెంచుతుంది. ఈ తప్పుడు సమాచారంతో వీళ్ళు ఒక దాడికి గురవుతారు.

ఇక కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ కిడ్నాప్ వెనుక అసలు రహస్యాలు బయటపడతాయి. సంపన్నులు పేదలను దోపిడీ చేసే సరోగసీ దందా బయటకి వసుంది. ఈ క్రమంలో గౌతమ్ వ్యక్తిత్వం స్వార్థపరుడిగా మొదలై, ఝుంపా బాధను, రామన్ నీతిని చూసి క్రమంగా మారతాడు. ఝుంపా పాత్ర, ఒక తల్లిగా తన బిడ్డ కోసం పోరాడే సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వీళ్ళంతా చంపాను రక్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ కథ ఒక సాఫ్ట్ ఎండింగ్‌తో ముగుస్తుంది. చివరికి వీళ్ళంతా ఝుంపా బిడ్డను కనిపెడతారా ? తనని ఎవరు కిడ్నాప్ చేస్తారు. ఎందుకు చేస్తారు ? అనే విషయాలను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఈ మూవీని చూస్తే లైఫ్ లో అస్సలు బిర్యానీని ముట్టుకోరు ఒట్టు… ఇంత రియలిస్టిక్ గా ఎలా తీశారు భయ్యా ?

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

Big Stories

×