BigTV English
Advertisement

Stree 2 OTT: ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోన్న ‘స్త్రీ 2’.. ఎప్పటి నుంచంటే?

Stree 2 OTT: ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోన్న ‘స్త్రీ 2’.. ఎప్పటి నుంచంటే?

Stree 2 OTT Release Date: హారర్ కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను చాలాసార్లు హారర్ కామెడీ చిత్రాలే కాపాడాయి. ఇటీవల విడుదలయిన ఒక హారర్ కామెడీ కూడా ఇతర సినిమాల రికార్డులను బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్లింది. అంతే కాకుండా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆ మూవీనే ‘స్త్రీ 2’. ఆగస్ట్ 15న ఎన్నో సినిమాలతో పోటీపడుతూ విడుదలయిన ‘స్త్రీ 2’.. మొదటిరోజు నుండి పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో మూవీ ఎదురులేని రన్‌ను సాధించింది. థియేటర్లలో ఒక రేంజ్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది.


స్ట్రీమింగ్‌కు సిద్ధం

‘స్త్రీ 2’ మూవీ విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతున్నా ఇప్పటికీ చాలా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పలు థియేటర్లలో ఇంకా ఈ సినిమా హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. అలాంటి మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటికొచ్చింది. బాలీవుడ్‌లో ఒక మూవీ హిట్ టాక్ అందుకుందంటే కచ్చితంగా రెండు లేదా మూడు నెలల వరకు దానిని ఓటీటీ స్ట్రీమ్ చేయడానికి మేకర్స్ ఒప్పుకోవడం లేదు. కానీ ‘స్త్రీ 2’ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. సెప్టెంబర్‌లోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: అలాంటి వ్యక్తితో రిలేషన్ కరెక్ట్ కాదనిపించింది, అప్పుడే నా హృదయం ముక్కలయ్యింది – తమన్నా

అధికారిక ప్రకటన

సెప్టెంబర్ 27 నుండి ‘స్త్రీ 2’ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన అమెజాన్ ప్రైమ్.. ఈ మూవీ రైట్స్‌ను కొనుగోలు చేసింది. అయితే థియేటర్లలో మాత్రం ఈ మూవీ కేవలం హిందీలోనే విడుదల అయ్యింది. ఓటీటీలో మాత్రం హిందీతో పాటు సౌత్ భాషల్లో కూడా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ‘స్త్రీ 2’ ఓటీటీ రిలీజ్ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీని థియేటర్లలో చూసినవారు సైతం మళ్లీ ఓటీటీలో చూడడానికి ఎదురుచూస్తున్నారు. హారర్ కామెడీ అయినా కూడా ట్విస్టులతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ సాధించింది ‘స్త్రీ 2’.

అత్యధిక వసూళ్లు

అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ 2’లో రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ ఓ రేంజ్‌లో హిట్ అవ్వడానికి నటీనటుల నటనే ముఖ్య కారణమని చాలామంది ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. అంతే కాకుండా విజువల్స్ కూడా ప్రేక్షకులను భయపెట్టేలా ఉండడం, దాంతో పాటు అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ కూడా మూవీలో పాజిటివ్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇప్పటివరకు ‘స్త్రీ 2’ రూ.750 కోట్ల కలెక్షన్స్ సాధించి 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డ్ దక్కించుకుంది. ‘యానిమల్’, ‘ఫైటర్’లాంటి చిత్రాల కలెక్షన్స్‌ను కూడా ఈ మూవీ దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Related News

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Big Stories

×