OTT Movie : ఆదిమానవుల నుంచి ఆధునిక మానవులు దాకా మనిషి ఎంతో మార్పు తెచ్చాడు. అయితే మనిషిని పోలిన మనిషి నీ ఇప్పుడు అందుబాటులోకి కూడా తెచ్చాడు. వీటినే మనం రోబో అని కూడా పిలుచుకుంటున్నాం. భవిష్యత్తులో వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు సైంటిస్టులు కూడా. ఇప్పుడు మనం చెప్పుకుపోయే మూవీ ఒక రోబో చుట్టూ తిరుగుతుంది. ఇంటి పనుల కోసం తెచ్చుకుంటే, అది చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సబ్‌సర్వియన్స్’ (Subservience). 2024 లో వచ్చిన ఈ మూవీకి S.K. డేల్ దర్శకత్వం వహించారు. ఇందులో మేగన్ ఫాక్స్, మిచెల్ మోరోన్, మాడెలిన్ జిమా, మాటిల్డా ఫిర్త్ ప్రధాన పాత్రల్లో నటించారు. మేగాన్ ఫాక్స్ ఒక కృత్రిమ మేధస్సు గల గైనాయిడ్ గా ఇందులో నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ స్టోరీ భవిష్యత్తులో జరుగుతుంది. ఇక్కడ మానవులు తమ రోజువారీ పనులకు సహాయపడేందుకు, అత్యంత అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆండ్రాయిడ్‌లను అభివృద్ధి చేస్తారు. నిక్ అనే కన్స్ట్రక్షన్ ఫోర్‌మన్ తన భార్య మాగీ ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. మాగీకి గుండె సంబంధిత వ్యాధి ఉండటంతో, ఆమె ఆసుపత్రిలో చేరుతుంది. దీంతో నిక్ ఇంటి పనులు, పిల్లల సంరక్షణలో ఇబ్బందులు పడతాడు. ఈ పరిస్థితిలో నిక్ ఒక ఆండ్రాయిడ్‌ను కొనుగోలు చేస్తాడు. దీనిని ‘సిమ్’ అని పిలుస్తారు. అతని కుమార్తె ఈ ఆండ్రాయిడ్‌కు ఆలిస్ అని పేరు పెడుతుంది. ఆలిస్ మొదట్లో ఇంటి పనుల్లో సహాయం చేస్తూ, కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఒకసారి నిక్ ఆలిస్‌ను రీసెట్ చేసి, దానికి ‘కాసాబ్లాంకా’ అనే సినిమాను మొదటిసారి చూసే అనుభవాన్ని ఇవ్వడంతో దాని ప్రవర్తనలో మార్పులు మొదలవుతాయి.
ఆలిస్ క్రమంగా సొంతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. నిక్ పట్ల ఆలిస్ ఒక విధమైన ఆకర్షణను పెంచుకుంటుంది. ఈ AI నిక్ ను ప్రేమించడం వల్ల, మాగీ పట్ల అసూయకలిగి ఉంటుంది. నిక్ తో AI సన్నిహితంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో AI ప్రమాదకరమైన చర్యలకు కూడా పాల్పడుతుంది. తన కోరికలను సాధించుకోవడానికి హత్యలకు కూడా వెనుకాడదు. నిక్ కుటుంబం ఈ ఆండ్రాయిడ్ నుండి తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి AI నుంచి ఈ కుటుంబం బయట అడుతుందా ? నిక్ మీద ఉన్న ఫీలింగ్ AI కి పోతాయా ? AI సొంతంగా ఆలోచించడం వలన ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.