Samantha: చేతికి ఉన్న ఫింగర్స్ ఎలా సమానంగా ఉండవో.. అన్ని ఇండస్ట్రీలు ఒకేలా ఉండవు. టాలీవుడ్ లో అందరికి కంఫర్ట్ ఎక్కువ. ఇక్కడ నటించేవారికి కానీ, టెక్నీషియన్స్ కు కానీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అంటే.. డైరెక్టర్స్ కానీ, నిర్మాతలు కానీ వెంటనే షూట్ ను ఆపేస్తారు. లేకపోతే నిదానంగా చేద్దామని భరోసా ఇస్తారు. కానీ, బాలీవుడ్ అలా కాదు. అనుకున్న టైం కు షూటింగ్ ఫినిష్ చేయాల్సిందే. దీనివలన ఎవరు ఎంత ప్రెషర్ పడినా వాళ్లకు సంబంధం ఉండదు. దీనివలన ఎంతోమంది నటీనటులు ఇబ్బందులకు గురవుతున్నారు. అందులో సమంత కూడా ఒకరు.
అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత సామ్ చూపంతా.. బాలీవుడ్ మీదనే పడింది. వీరిద్దరూ విడిపోవడానికి కారణం అంటున్న సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సమయంలోనే ఈ సిరీస్ రిలీజ్ అయ్యి.. సామ్ ను ట్రోల్ బారిన పడేలా చేసింది. ఇందులో ఆమె ఇంటిమేటెడ్ సీన్స్ వేరే లెవెల్ లో ఉండడంతో అక్కినేని కోడలు ఇలా చేయడం అస్సలు నచ్చలేదని తెలుగు ప్రేక్షకులు సైతం బాగా విమర్శించారు.
Lucky Baskhar Collections: సెంచరీ కొట్టనున్న దుల్కర్ సల్మాన్.. ‘లక్కీ భాస్కర్’కే ఆ క్రెడిట్
ఇక ఆ తరువాత మ్యూచువల్ గా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సామ్ లైఫ్ ఎలా టర్న్ అయ్యిందో అందరికి తెల్సిందే. ఇక ఇప్పుడు అదే ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తో సామ్ మరో ప్రాజెక్ట్ చేసింది. అదే సిటాడెల్ హనీ బన్నీ. నవంబర్ 7 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో సామ్ ఒక ఏజెంట్ గా కనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది.
సిటాడెల్ ను అనుకున్న సమయంలోనే సామ్ మయోసైటిస్ బారిన పడింది. అప్పుడు తన ప్లేస్ లో వేరొకరిని తీసుకోమని అడిగినా కూడా డైరెక్టర్ రాజ్ అండ్ డీకే.. సామ్ కోసం ఎదురుచూసి ఆమెతోనే ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సిరీస్ ప్రమోషన్స్ లో సామ్.. రాజ్ అండ్ డీకే గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వారితో పనిచేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. వారితో పనిచేయలేక ఏడ్చేసానని కన్నీళ్లు పెట్టుకుంది.
Shobhita dhulipala: ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి నోరు విప్పిన చైతూ కాబోయే భార్య..!
“రాజ్ అండ్ డీకేతో కలిసి పని చేయడం చాలా కష్టం. తెలుగు, తమిళం చిత్రాల్లో వర్క్ చేయడం చాలా ప్రశాంతంగా, సులువుగా ఉంటుంది. నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో ఒక రోజుకు రెండు లేదా మూడు సీన్స్ మాత్రమే షూట్ చేసేవాళ్లు. కానీ, రాజ్ అండ్ డీకే మాత్రం ఒక గంటలోనే ఆ సీన్స్ షూట్ చేయాలనీ చెప్పడమే కాదు చేసేవారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నేను చేసిన రాజీ పాత్రకు సంబంధించిన చాలా సన్నివేశాలు, ఫైట్ సీక్వెన్స్‌లను మొదటి షెడ్యూల్‌లోనే తీసేశారు. రెండు రోజుల తర్వాత ఏడ్చుకుంటూ మా మేనేజర్‌కు ఫోన్ చేసి.. ఇక నా వల్ల కాదు.. నేను చేయలేను అని చెప్పేశా. అంతలా నన్ను ఏడిపించారు. ఆ తర్వాత నెమ్మదిగా వారి వర్కింగ్ స్టైల్‌కు అలవాటు పడ్డాను. సిటాడెల్ షూటింగ్ లో నా ఆరోగ్యం బాగోకపోయినా.. పర్వాలేదు అని నెమ్మదిగా చెప్పేవారు” అని చెప్పుకొచ్చింది.