OTT Movie : ఈ చైనీస్, జపనీస్, కొరియన్ సినిమాలు కొన్ని చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ సినిమాలు చివరి వరకు సరదాగా సాగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ హారర్ కంటెంట్ తో చాలా కామెడీగా ఉంటుంది. దయ్యాల సినిమాలు చాలా వరకు భయపెడుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం నవ్వు తెప్పిస్తుంది. ఈ చైనీస్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ చైనీస్ మూవీ పేరు సూపర్ మీ (Super me). 2021 లో వచ్చిన ఈ ఫాంటసీ మూవీకి జాంగ్ చాంగ్ దర్శకత్వం వహించాడు. కలలో వచ్చే ఒక దయ్యం వల్ల, ఒక వ్యక్తి కోటీశ్వరుడు అయిపోతాడు. ఈ మూవీ చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది. ఈ ఫాంటసీ హారర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో స్క్రిప్ట్ రైటర్ గా అవతారం ఎత్తుతాడు. తన ఫ్రెండ్ దగ్గర ఒక స్టోరీ రాస్తానని చెప్పి డబ్బులు కూడా తీసుకుంటాడు. అయితే ఆ డబ్బును తన కలలో వచ్చే దయ్యం గురించి ఖర్చు పెడుతుంటాడు. ఎందుకంటే తన కలలో ఒక దయ్యం వచ్చి భయపెడుతూ ఉంటుంది. అతనికి నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవడంతో బాధపడుతూ ఉంటాడు. ఇంటి రెంట్ కి కూడా పైసలు ఉండవు. ఇంటి ఓనర్ అద్దె చెల్లించకపోవడంతో సామాన్లు బయట పడేస్తాడు. మరోవైపు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని స్నేహితుడు అతడి వెంటపడతాడు. ఇవన్నీ తప్పించుకోవడానికి హీరో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఇంతలోనే అక్కడ టిఫిన్స్ నడిపే ఒక చిన్న వ్యాపారి, అతని దగ్గరికి వచ్చి నీ బాధ ఏంటని అడుగుతాడు. అప్పుడు తన కలలోకి వచ్చే దయ్యం గురించి చెప్తాడు. ఈసారి కలలోకి దయ్యం వస్తే ఇదంతా కల అని అనుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదేదో బాగుందని ఆ తర్వాత నిద్రపోతాడు. కలలో మళ్ళీ దయ్యం వచ్చి అతన్ని కత్తి తీసుకుని చంపబోతుంది.
అప్పుడు హీరో ఇదంతా కలే కదా అనుకుంటాడు. వెంటనే కలలో నుంచి బయటికి వస్తాడు. తీరా చూస్తే అతని చేతిలో దయ్యం పోడవాలనుకున్న కత్తి ఉంటుంది. దానిని తీసుకొని ఒక వ్యాపారికి అమ్ముతాడు. అతనికి బాగా డబ్బులు వస్తాయి. అలా ప్రతిరోజు ఆ దయ్యం వల్ల చాలా బంగారం తెచ్చుకుంటాడు. దయ్యం కూడా ఇతన్ని చంపడానికి వస్తూ బంగారం వదిలించుకుంటూ ఉంటుంది. హీరో తన ఫ్రెండ్ ని కూడా దగ్గరికి తీసుకుని సినిమాలు కూడా తీస్తాడు. కొద్ది రోజుల్లోనే హీరో చాలా ఫేమస్ అయిపోతాడు. బంగారం కొనే ఒక గ్యాంగ్ హీరోని కిడ్నాప్ చేస్తుంది. హీరోకి అంత డబ్బు ఎలా వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటారు. చివరికి ఆ దయ్యం ఎందుకు కలలోకి వస్తుంది? కిడ్నాప్ చేసిన వాళ్ళు హీరోని ఏం చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.