OTT Movie : కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అవి సినిమాలు గా కాకుండా, జీవితం నేర్పిన పాఠాన్ని చూపిస్తాయి. ఈ సినిమాలలో మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. అంతలా మనసుని ప్రభావితం చేస్తాయి ఈ సినిమాలు. అటువంటి సినిమాలను కొంతమంది దర్శకులు అద్భుతంగా తరికెక్కిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జపనీస్ మూవీ, ఒక చిన్న ఎమోషన్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుష్టు వ్యాధి ఉండే ఒక వృద్ధురాలు వంట మనిషిగా చేరుతుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ ఫీల్ గుడ్ జపనీస్ మూవీ పేరు ‘స్వీట్ బీన్’ (Sweet bean). ఈ మూవీకి నవోమి కవాసే దర్శకత్వం వహించారు. ఈ మూవీ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని కాంటెంపరరీ వరల్డ్ సినిమా విభాగంలో ప్రదర్శించడానికి ఎంపిక చేయబడింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఆపిల్ టీవీ (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక బేకరీలో చెఫ్ గా పనిచేస్తుంటాడు. అతడు ఓనర్ దగ్గర అప్పు తీసుకోవడంతో అక్కడే పని చేయాల్సి వస్తుంది. ఎప్పుడూ అతడు డల్ గానే ఉంటాడు. అతనికి కుటుంబం అనేది లేకుండా ఒంటరిగా ఉంటాడు. ఈ క్రమంలోనే అతని బేకరీ కి కొంతమంది చదువుకునే అమ్మాయిలు వస్తూ ఉంటారు. అందులో ఒక స్టూడెంట్, హీరోని ఇష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు ఒక వృద్ధురాలు ఇతని దగ్గరికి వచ్చి పని ఇవ్వమని అడుగుతుంది. హీరో కూడా ఒక చిన్న హెల్పర్ కోసం చూస్తుంటాడు. అయితే ఈ వయసులో ఈ బామ్మ ఏం చేస్తుంది అని డ్యూటీ లేదని చెప్తాడు. ఆ మరుసటి రోజు ఒక కేక్ తయారు చేసి ఇస్తుంది. అది చాలా అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఆ వృద్ధురాలికి హీరో పని ఇస్తాడు. అప్పట్నుంచి ఆ బేకరీ కి వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఆమె వంటలు చాలా రుచిగా తయారు చేస్తుంది. అయితే ఆ వృద్ధురాలికి ఒకప్పుడు కుష్టి ఉండేది. చాలా సంవత్సరాలు ఆమె ఆశ్రమంలోనే ఉండిపోయింది.
అయితే ఇప్పుడు ఆమె చేతికి కొన్ని మచ్చలు ఉండటంతో, కుష్టి ఉందని కొందరు ప్రచారం చేస్తారు. ఇక ఆ హోటల్ కి ఆమె రాకూడదని హీరోతో ఓనర్ చెప్తుంది. ఈ విషయం ఆ వృద్ధురాలికి చెప్పడానికి చాలా సంకోచిస్తాడు. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఆ వృద్ధురాలు వచ్చాక హీరో జీవితంలో ఒక చిరునవ్వు వస్తుంది. ఆ ముసలామె వల్ల కస్టమర్లు చాలా మంది వచ్చారు. అయితే ఆమెకు ఉన్న రోగం ఎప్పుడో నయం అయినా కూడా ప్రచారం చేయడంతో, ఇప్పుడు కస్టమర్లు రావడం ఆగిపోయింది. విషయం తెలుసుకుని తనకు తానుగానే అక్కడినుంచి బాధగా వెళ్ళిపోతుంది. చివరికి ఆ వృద్ధురాలు ఏమవుతుంది? హీరో ఆమె వంటలను మళ్లీ చేస్తాడా? హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ ఎంతవరకు వెళుతుంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడండి.