OTT Movie : ఓటీటీలో వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో హాలీవుడ్ నుంచి వచ్చే సిరీస్ లకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో ఒక ఫ్యామిలీకి అనుకోకుండా సూపర్ పవర్స్ వస్తాయి. ఆ తరువాత స్టోరీ రసవత్తరంగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్-ఫిక్షన్ సూపర్ హీరో వెబ్ సిరీస్ పేరు ‘నో ఆర్డినరీ ఫ్యామిలీ’ (No Ordinary Family). దీనిని గ్రెగ్ బెర్లాంటి, జోన్ హార్మన్ ఫెల్డ్‌మాన్ సృష్టించారు. ఈ వెబ్ సిరీస్ 2010-2011లో ABC ఛానెల్‌లో ప్రసారమైంది. ఈ సిరీస్ ఒక అమెరికన్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదం తర్వాత, ఈ కుటుంబంలోని వాళ్ళకు అసాధారణ శక్తులు వస్తాయి. ఆ తరువాత అసలు స్టోరీ మొదలౌతుంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జిమ్, స్టెఫానీ అనే భర్య భర్తలకు డాఫ్నే, జెజె అనే టీనేజ్ వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉంటారు. కాలిఫోర్నియాలోని పసిఫిక్ బేలో వీళ్ళు నివసిస్తుంటారు. 16 సంవత్సరాల వివాహం తర్వాత, జిమ్, స్టెఫానీల మధ్య సంబంధం రొటీన్ గా మారి, కుటుంబ బంధం బలహీనపడుతుంది. తన కుటుంబంలో జోష్ నింపేందుకు, ఒక యాత్రకు అందరినీ తీసుకెళ్తాడు జిమ్. వాళ్ళు ప్రయాణిస్తున్న విమానం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో, ఒక నీటి సరస్సులో కూలిపోతుంది.
అయితే ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడతారు. కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ప్రతి కుటుంబ సభ్యుడు తమలో అసాధారణ శక్తులను ఉన్నాయని కనిపెడతారు. జిమ్ కు టన్నుల బరువును ఎత్తగలిగే సామర్థ్యం వస్తుంది. స్టెఫానీ కాంతి వేగాన్ని మించి టైమ్ ట్రావెల్ చేయగల సామర్థ్యం పొందుతుంది. డాఫ్నే ఇతరుల మనసులో ఏముందో తెలుసుకోగలుగుతుంది. జెజె సాధారణ మనిషి కంటే 40% ఎక్కువ మెదడును ఉపయోగించగలడు. ఈ కుటుంబం వారి శక్తులను అర్థం చేసుకుని, వాటిని రహస్యంగా ఉంచుతూ, సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది.
Read Also : బ్లడ్ బాయిల్ అయ్యేలా చేసే రివేంజ్ డ్రామా… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే?
జిమ్ ఒక పోలీస్ స్కెచ్ ఆర్టిస్ట్‌గా, తన శక్తులను రహస్యంగా ఉపయోగించి, నేరస్థులను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. స్టెఫానీ తన స్నేహితుడు సహాయంతో, తమకు శక్తుల ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి ఈ కుటుంబానికి శక్తులు ఎలా వచ్చాయి ? వాటివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? వీటితో ఈ కుటుంబం ఎటువంటి సాహసాలు చేస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.