Nataraj Master:బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం అనే థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున (Nagarjuna) మిగతా సీజన్ల కంటే పది రెట్లు వినోదంతో పాటు పదిరెట్లు గొడవలు కూడా ఉంటాయని ముందే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ పది రెట్ల గొడవల్లో భాగంగా అసభ్యకర పదజాలాలు , మహిళలపై దూషించడం, మానవత్వం లేకుండా కొట్టుకునే వరకు వెళ్లడం చూస్తుంటే అసహ్యం వేస్తోందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు బిగ్ బాస్ కి వెళ్ళాలనే ఆలోచన కూడా ఈ సీజన్ చూశాక లేకుండా పోతోంది అంటూ కొంతమంది సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా కంటెస్టెంట్ త్రిగుణ్ (Trigun) చేతిలోనే బిగ్ బాస్ ఆట నడుస్తోంది అంటూ గత కొన్ని వారాలుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే విషయంపై బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్, ప్రముఖ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ (Nataraj Master) ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన నీతూ మాస్టర్(Neetu Natraj Master) అనూహ్యంగా ఓటింగ్ తో సంబంధం లేకుండా 11వ వారం ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తన భార్యది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ చెప్పిన నటరాజ్ మాస్టర్ హౌస్ లో జరుగుతున్న గుట్టు బయటపెట్టారు.
నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ..” మేము ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ షోలో పాల్గొన్నప్పుడు మా జంటకు మంచి రెస్పాన్స్ లభించింది. ఆడియన్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తారని , తమ ప్రేమను చూపిస్తారని బిగ్ బాస్ హౌస్ కి నా భార్యను పంపించాను. అయితే షో చూసి , కంటెస్టెంట్స్ గొడవలను చూసి, జనాలు ఎంటర్టైన్ అవుతున్నారే కానీ ఓట్లు వేయడం లేదు. నిజానికి ఓట్ల వెనుక వేరే గేమ్ ఉంది. దానిని ప్రైవేటు పీ ఆర్ టీంలు నిర్వహిస్తున్నాయి. ఇతర కంటెస్టెంట్ల గురించి నెగటివ్ గా పోస్ట్లు పెట్టించి, జనాలను ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాదు ఆడియన్స్ ఎలా ఆలోచించాలో కూడా వాళ్లే చెబుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
also read:ప్రీ స్కూల్ లోకి అడుగుపెట్టిన క్లీంకారా.. ఉపాసన – రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్స్ వైరల్!
దొంగ పి ఆర్ లు, దొంగ నా కొడుకులు.. ఇదంతా తప్పుగా పోట్రేట్ చేస్తున్నారు. కంటెస్టెంట్లకి , ఓట్లకి సంబంధించిన పోలింగ్ కూడా ఫేక్ ..వాళ్లంతా పెయిడ్ బ్యాచ్ చేసే పని.. వాళ్లు ఎవరికి ఓట్లు వేయాలో ..ఈ వారం ఎవరు ఎలిమినేట్ కావాలో కూడా డిసైడ్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే లోపల త్రిగుణ్ ఆడిస్తుంటే.. బయట ఈ పి ఆర్ టీంలు ఆడిస్తున్నాయి. త్రిగుణ్ చెప్పినట్టుగానే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పి ఆర్ టీంలో ఎంత దారుణంగా ఉన్నారంటే నా కూతురిపై కూడా అసభ్యకరంగా కామెంట్ పెట్టారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటరాజ్ మాస్టర్. మొత్తానికి అయితే కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ఆడియన్స్ చేతుల్లో ఉండదని.. పెయిడ్ పి ఆర్ టీముల వల్లే కంటెస్టెంట్స్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతున్నారనే నిజాన్ని బయటపెట్టారు నటరాజ్ మాస్టర్ . ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.