E-Paper
Advertisement

Suspense Thriller OTT : ఒకరినొకరు చంపుకోవడానికి భార్యభర్తల ట్రిప్… యాక్షన్ థ్రిల్లర్లో కడుపుబ్బా నవ్వించే కామెడీ

Suspense Thriller OTT : ఒకరినొకరు చంపుకోవడానికి భార్యభర్తల ట్రిప్… యాక్షన్ థ్రిల్లర్లో కడుపుబ్బా నవ్వించే కామెడీ
Advertisement

Suspense Thriller OTT : ఓటీటీలలో బ్లాక్ కామెడీ చిత్రాలకు రోజురోజుకూ ఆదరణ పెరిగిపోతోంది. భాషతో సంబంధం లేకుండా ఇలాంటి సినిమాలను చూస్తున్నారు మూవీ లవర్స్. ఇదివరకు భాష అనేది ఒక అడ్డుగోడ. కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని మల్టీ లాంగ్వేజ్ ఆడియో లేదా సబ్ టైటిల్స్ తో ఆ సమస్య కాస్తా తిరిపోయింది. అలా భాష అడ్డు కాదు అనుకునే వారి కోసమే ఈ బెస్ట్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? ఎక్కడ చూడవచ్చు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2021లో వచ్చిన నార్వేజియన్ బ్లాక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ది ట్రిప్’ (The Trip). టామీ విర్కోలా (డెడ్ స్నో ఫేమ్) ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. కపుల్ మర్డర్ ప్లాన్స్ చుట్టూ తిరిగే డార్క్ హ్యూమర్ స్టోరీ ఇది. 1 గంట 53 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాలో వయలెన్స్, భయంకరమైన సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు మాత్రమే చూస్తే బెటర్. క్రిటిక్స్ నుండి మూవీకి మంచి రివ్యూస్ వచ్చాయి. రిలీజ్ అయిన ఏడాది అక్టోబర్ నుంచే మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నార్వేజియన్ ఆడియోతో ఇంగ్లీష్/తెలుగు సబ్‌టైటిల్స్ ఆప్షన్ ఉంది.

Advertisement

మెయిన్ లీడ్‌లో నూమి రాపేస్ (లిసా పాత్రలో – స్వీడిష్ యాక్ట్రెస్), అక్సెల్ హెన్నీ (లార్స్ పాత్రలో – నార్వేజియన్ డైరెక్టర్) నటించారు. సపోర్టింగ్‌ రోల్స్ లో అట్లే ఆంటోన్సెన్ (పెట్టర్), క్రిస్టియన్ రుబెక్, ఆండ్రే ఎరిక్సెన్ లాంటి వాళ్లు కన్పిస్తారు. హీరోహీరోయిన్లు నూమి రాపేస్, అక్సెల్ హెన్నీ పర్ఫార్మెన్సెస్ సూపర్. టామీ విర్కోలా డైరెక్షన్‌ కూడా బాగుంటుంది. హారర్-కామెడీ లవర్స్‌కి ఈ మూవీ పర్ఫెక్ట్. కానీ వయలెన్స్ ఎక్కువగా ఉంటుంది. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు స్కిప్ చేయొచ్చు. డార్క్ హ్యూమర్ ఇష్టపడేవాళ్లు మాత్రం తప్పక చూడండి.

Read Also :  అతీంద్రియ శక్తులతో అరాచకం… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కొరియన్ సూపర్ హీరో సిరీస్… 8 ఎపిసోడ్లు ఒకేసారి

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

స్టోరీ లార్స్ (అక్సెల్ హెన్నీ – స్ట్రగ్లింగ్ డైరెక్టర్), లిసా (నూమి రాపేస్ – స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్) అనే అన్‌హ్యాపీ మ్యారీడ్ కపుల్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ల మధ్య ప్రేమ పోయి హేట్ ఒక్కటే మిగులుతుంది. ద్వేషంతో ఇద్దరూ ఒకరినొకరు చంపాలని ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా ఎక్కడో సిటీకి దూరంగా మారుమూలన ఉన్న క్యాబిన్‌కి వీకెండ్ ట్రిప్‌ కి వెళ్తారు. లార్స్ హాక్సా, రోప్ లాంటివి తీసుకెళ్తాడు. లిసా కూడా తక్కువేం కాదు… ఆమెకు సీక్రెట్ ప్లాన్ ఉంది. కానీ వాళ్ల ప్లాన్స్ స్టార్ట్ అవ్వకముందే ముగ్గురు జైలు నుంచి పారిపోయిన క్రిమినల్స్ క్యాబిన్‌లోకి వచ్చేస్తారు. ఇక కపుల్ తమ ప్లాన్స్ పక్కన పెట్టి, ఈ డేంజరస్ గ్యాంగ్ నుండి ఎస్కేప్ అయ్యి, బతికి బయట పడడానికి కలిసి పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్స్ చాలానే ఉంటాయి. చివరికి వాళ్ల రిలేషన్‌షిప్ ఎలా మారుతుంది ? అనేది ఇంట్రెస్టింగ్. అలాగే ఆ దొంగల నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×