BigTV English

OTT Movie : పనివాడితో ఓనర్ భార్య… ఐలాండ్ లో ఒంటరిగా ఇదేం పని ?

OTT Movie : పనివాడితో ఓనర్ భార్య… ఐలాండ్ లో ఒంటరిగా ఇదేం పని ?

OTT Movie : మధ్యధరా సముద్రంలో ఒక ఒంటరి దీవిలో, సూర్యుడు అస్తమిస్తున్నాడు… అక్కడ ఒక రిచ్ అమ్మాయి, ఆమె శరీరంపై గాయాలతో ఒక సీమ్యాన్ (పనివాడు)తో కలిసి ఇసుక తీరంపై నిలబడి ఉంది. ఆమె అతన్ని ద్వేషిస్తుంది. కానీ ఇప్పుడు అతనే ఆమె బతుకుదెరువు. ఒక తుఫాను వారిని ఈ దీవికి చేర్చింది. కానీ ఇక్కడ జరిగే సంఘటనలు ఆమె జీవితాన్ని శాశ్వతంగా మారుస్తాయి. ఈ ద్వీపం వారిని ఒక్కటి చేస్తుందా? లేక ద్వేషం వాళ్ళను నాశనం చేస్తుందా? ఈ ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పేరేంటో, ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…

40 ఏళ్ల రిచ్, సెల్ఫీష్, అహంకారం తలకెక్కిన మహిళ అంబర్ లీటన్. ఆమె భర్త టోనీ లీటన్ ఒక బడా వ్యాపారవేత్త. అతను గ్రీస్ నుండి ఇటలీకి ఒక ప్రైవేట్ క్రూయిజ్‌లో ఇతర జంటలతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తాడు. కానీ ఆమెకు ఈ క్రూయిజ్ నచ్చదు. ఎందుకంటే ఆమె ఊహించిన లగ్జరీ యాట్ కాకుండా ఒక సాధారణ గ్రీక్ ఫిషింగ్ బోట్‌లో లాంగ్ జర్నీ ఉంటుంది. దీంతో ఆమె తన నిరాశను షిప్ ఫస్ట్ మేట్, జుసేప్పేపి తీస్తుంది. అతను ఒక సాధారణ ఇటాలియన్ సీమ్యాన్‌.


అలా బోటు ఎక్కింది మొదలు అతన్ని నిరంతరం అవమానిస్తూ, “పీ-పీ” అని పిలుస్తుంది. అయితే ఆమె ఆస్తి, అంతస్తు, పేరు చూసి జుసే అవన్నీ భరిస్తాడు. ఒక రోజు అంబర్ తన ఆనందం కోసం ఒక చిన్న బోట్‌ లో బయటకు వెళ్లాలని జుసే దగ్గర పట్టుబడుతుంది. తుఫాను వస్తుందని అతను ఎంత హెచ్చరించినా అసలు పట్టించుకోదు. అలా వెళ్ళగా, వారి బోట్ ఇంజన్ ఫెయిల్ అవుతుంది. ఇంకేముంది హెల్ప్ అందక వాళ్ళిద్దరూ అదే బోట్ లో రెండు రోజుల పాటు సముద్రంలో తేలియాడుతారు. ఈ క్రమంలో అంబర్ అతన్ని మరింత అవమానిస్తుంది.

చివరికి, ఇద్దరూ ఉన్న బోట్ ఒక ద్వీపంలోకి కొట్టుకుపోతుంది. అయితే అక్కడ సామాజిక స్థితి, డబ్బుకు ఎలాంటి వాల్యూ ఉండదు కదా ! ఇక్కడి నుంచి స్టోరీ మరింత మజా వస్తుంది. జుసేప్పే ఎప్పుడూ సముద్రంలోనే తిరుగుతుంటాడు కాబట్టి అతనుకున్న ఫిషింగ్, సర్వైవల్ స్కిల్స్ తో ఎలాగైనా బతికేస్తాడు. కానీ అంబర్ కు ఇవేమీ చేతకావు. కాబట్టి అతనిపై ఆధారపడవలసి వస్తుంది. ఈ పరిస్థితిలో, వాళ్ళ మధ్య అప్పటిదాకా ఉన్న శత్రుత్వం ఒక అనూహ్యమైన డైనమిక్‌గా మారుతుంది. నెమ్మదిగా శత్రువులు కాస్తా శత్రువులుగా మారిపోతారు. ఆ తరువాత వీళ్ళు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు? చివరికి వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఏమైంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఓటీటీలోకి వచ్చేసిన 850 కోట్ల మూవీ… ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

గ్లోబల్ స్టార్ మూవీని ఇక్కడి నుంచే కాపీ కొట్టారా ?

ఇప్పుడు మనం చెప్పుకున్న మూవీ పేరు ‘Swept Away’. 2002లో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది. మడోన్నా, అడ్రియానో జియానినీ, బ్రూస్ గ్రీన్‌వుడ్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ స్టోరీ విన్నంత సేపు అచ్చం చిరుత మూవీని చూసినట్టే ఉంటుంది. అయితే ఈ మూవీ 2002 అక్టోబర్ 11న రిలీజ్ అయ్యింది. కానీ చిరుత 2007లో వచ్చింది. కాబట్టి అప్పట్లో ఈ మూవీని కాపీ కొట్టి చిరుత తీశారనే కామెంట్స్ కూడా విన్పిస్తుంటాయి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×