Snake News: ప్రపంచంలో పాములు లేని దేశం ఒక్కటి ఉందా..? మనం అయితే మామూలుగా పాములు ఉండని దేశం కానీ, రాష్ట్రం కానీ ఉండదని అనుకుంటాం. కానీ ఆ దేశంలో ఎంత వెతికినా ఒక్క పామంటే ఒక్కటి కనిపించదట. ఏంత విచిత్రమో కదా.. చాలా మంది అక్కడకు వెళ్లి ఎంత సెర్చ్ చేసిన పాములు కనిపించలేదంట. ఇది ముమ్మాటికీ నిజం. ఆ దేశం ఏదో తెలుసుకోవాలని ఉందా..? సృష్టిలో జీవించే హక్కు ప్రతి జీవికి ఉంటుంది. ఈ భూమి మీద ఏ జీవి అయిన ఇతర జీవులకు హానీ చేయకుండా స్వేచ్చగా బతకవచ్చు. అయితే జీవులకు.. పర్యావరణానికి మధ్య సమతుల్యత ఉంటుంది. ప్రకృతిలో సరీసృపాలు కూడా వాటి పాత్రను అవ్వి ఏదో విధంగా పోషిస్తాయి. అందులో పాములు కీలకం. వీటికి ప్రకృతిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒకదేశంలో మాత్రం పాములు ఉండదు. ఆ దేశం వాటిపై నిషేధం ఉంచింది.
పాములు.. పాములకు మనిషి దూరంగా ఉంటాడు. అవ్వి అపాయాన్ని కలగజేస్తాయని వాటికి భయపడుతుంటారు. విషపూరితమైనవి కాబట్టి.. అవి కనబడగానే భయబ్రాంతులకు గురవుతారు. కానీ పర్యావరణానికి, రైతులకు పాములు మేలు చేస్తాయి. పాములు కనుక పర్యావరణంలో భాగం కాకపోతే.. చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. పర్యావరణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. పర్యావరణ వ్యవస్థలో పాములు చాలా కీలకం.. పొలాల్లో, పంటల్లో ఎలుకలు, కప్పలు, ఇతర కీటకాలను నశింపజేసి.. రైతుకు మేలు చేస్తాయి. మన గ్రహం మీద కనిపించే విషపూరతమైన జీవుల్లో పాములు కీలకమైనవి. అయితే ఆ పాములు ప్రపంచమంతా ఉంటాయి. కానీ ఒక దేశంలో మాత్రం పాములు కనిపించవు. ఆ దేశమే న్యూజిలాండ్. ఈ దేశంలో పాము రహితదేశంగా ప్రకటించుకుంది. ఇలా ప్రకటించుకున్న ఏకైక దేశం న్యూజిలాండ్. అసలు అక్కడ పాములు ఎందుకు లేవంటే..?
ALSO READ: Weather News: రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షం.. ఈ మూడు రోజులు జాగ్రత్త.. పిడుగులు పడే ఛాన్స్
న్యూజిలాండ్ అనేది ద్వీప దేశం. ఈ దేశం చుట్టూరా సముద్రం ఉంటుంది. చుట్టూ చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి. దీంతో ఈ దేశానికి పాములు వచ్చేందుకు వీలు ఉండదు. దీంతో ఆ దేశంలో పాములు కనిపించవు. అక్కడ జూపార్కుల్లో కూడా పాములు ఉండవు. ఆ దేశానికి పాములను తీసుకురావడం అక్కడ నిషేధం. జంతువుల కోసం న్యూజిలాండ్ దేశంలో ప్రత్యేక చట్టాలే ఉన్నాయి. దీంతో ఆ దేశంలో పాములను తీసుకురావడం నిషేధించారు. అయితే న్యూజిలాండ్‌తో పాటు.. ఐర్లాండ్‌లో కూడా పాములు అంతగా కనిపించవట. అయితే బ్రెజిల్ దేశంలో పాములు ఎక్కువ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నారు. బ్రెజిల్ దేశంలో 400 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయట. అత్యంత విషపూరితమైన పాములు ఇక్కడ ఉన్నాయి.
ALSO READ: Best Mobiles: రూ.20వేల లోపు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్.. కిర్రాక్ ఫీచర్స్ భయ్యా..
అయితే.. న్యూజిలాండ్ దేశంలో పాములు లేనప్పటికీ.. ఇతర విషపూరితమైన సాలెపురుగులు ఉన్నాయి. కానీ అవి పాములంత ప్రమాదకరమై జీవులు కావు. అయితే న్యూజిలాండ్ దేశం చాలా ప్రకృతి సౌందర్యం ఉంటుందని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. పాముల లేని వాతావరణంతో కలిసి.. పర్యాటకులకు స్వర్గధామంగా చేస్తుంది. న్యూజిలాండ్ ఈ ప్రత్యేక లక్షణం దాని పర్యావరణ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటిగా నిలబెడుతుంది. ఆ దేశ ప్రకృతి సౌందర్యం గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. మీరూ చూసేయండి మరి.
?utm_source=ig_web_copy_link