MLA Rajasingh: హైదరాబాద్ నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్రలో గోషా మహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో రామ భక్తులు ఆలోచన, ఓర్పుతో ఉండేవారని.. అప్పుడు ఆలోచించినట్లు ఇప్పుడు లేరని అన్నారు. రామ భక్తులు ఏదైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది స్వాతంత్రం వచ్చినప్పటి భారత దేశం కాదని.. ప్రస్తుతం దేశంలో ఉన్నది మోదీ భారత్ అని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పుకొచ్చారు.
ALSO READ: Weather News: జాగ్రత్త..! రాష్ట్రంలో ఐదు రోజులు పాటు వర్షాలే వర్షాలు..
వక్ఫ్ బోర్డు రాకముందు 4వేల ఎకరాల భూమి..
‘భారత్ లో జిహాద్ పాతుకుపోయింది. ప్రధాని మోదీ వచ్చిన తర్వాత ఎవరైనా జిహాద్ కు పాల్పడాలి అంటే భయపడుతున్నారు. ఎందుకంటే జిహాద్ కు పాల్పడితే.. వారి ఇంట్లోకి బుల్డోజర్ లు వస్తాయనే భయం పట్టుకుంది. వక్ఫ్ బోర్డ్ బిల్ పార్లమెంట్‌లో పాస్ చేశారు. వక్ఫ్ బోర్డ్ పేరు మీద ఎన్నో భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి పత్రాలు, రిజిస్ట్రేషన్ లేకుండా వక్ఫ్ భూములు అంటూ బోర్డ్ లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డ్ రాకముందు వాళ్లకు 4 వేల ఎకరాల భూములు ఉండేవి. వక్ఫ్ బోర్డ్ ను అడ్డం పెట్టుకొని దాదాపు 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారు’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
ఒవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరు భయపడేది లేదు
‘ప్రధాని మోదీ బిల్లు తెచ్చేందుకు వారికి వ్యతిరేకం కాదు. ప్రధాని వారి నిజమైన భూములకు రక్షణ కల్పిస్తారు. వక్ఫ్ బిల్ పార్లమెంట్ పాస్ అయ్యిందని ఒవైసీ బ్రదర్స్ గగ్గోలు పెడుతున్నారు. ఒవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరు భయపడేది లేదు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ను హిందు దేశంగా చేసే దిశగా కృషి చేస్తున్నారు. మనం ఐక్యంగా ప్రధానికి అండగా నిలవాలి. ముస్లింలను మోసం చేస్తున్న వ్యక్తి ఒవైసీ. ఒకవైపు ప్రధాని మోదీ, మరో వైపు యూపీ సీఎం యోగి ఇద్దరి వైపు దేశం మొత్తం చూస్తుంది. రాం మందిర్ నిర్మాణం జరగదు అని ఓవైసీ భావించారు. శ్రీ రామనవమి రోజు జనసంద్రాన్ని చూసి ఒవైసీ కంగుతిన్నారు’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ALSO READ: Inter Results: ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..? ఫలితాలు ఎలా చూసుకోవాలి..? ఇదిగో పూర్తి వివరాలు..
ALSO READ: AAI Recruitment: ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు.. జీతమైతే రూ.31,000