E-Paper
Advertisement

మై విలేజ్ షో అసలు నిజాలు బయటపెట్టిన అంజి మామ.. శ్రీకాంత్ మోసం చేశాడా?

మై విలేజ్ షో అసలు నిజాలు బయటపెట్టిన అంజి మామ.. శ్రీకాంత్ మోసం చేశాడా?
Advertisement

My Village Show Controversy:మై విలేజ్ షో…తెలుగు యూట్యూబ్ లో ఇదొక సంచలనం.ముఖ్యంగా గంగవ్వ, చందు, అంజి మామ, అనిల్ కలిసి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు.అయితే ప్రస్తుతం ఈ టీమ్ విడిపోయిన సంగతి తెల్సిందే.దీంతో శ్రీకాంత్ అందరినీ వాడుకుని వదిలేశాడా?”, “అనిల్, అంజుమామలు శ్రీకాంత్‌కు ద్రోహం చేశారా?అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.దీంతో వాటన్నింటికి ఇదిగో ఇలా ఒక ఇంటర్వ్యూలో ఫుల్ స్టాప్ పెట్టేశాడు అంజిమామ.

మై విలేజ్ షోలో 14 ఏళ్ల నుంచి అనుబంధం

జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామనికి చెందిన అంజి మామ ఒకప్పుడు కుటుంబ బాధ్యతలు, అప్పుల కోసం ఇరాక్ వెళ్లి కష్టపడ్డానని తెలిపాడు.ఇక స్వగ్రామానికి తిరిగొచ్చాక మేనల్లుడైన శ్రీకాంత్ ‘మై విలేజ్ షో’ ప్రారంభించి అవకాశమిచ్చాడని గుర్తు చేసుకున్నాడు.అయితే, ఛానెల్ సక్సెస్ అయ్యాక క్రమంగా కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు, డబ్బు విషయాలు అన్నీ తెరపైకి వచ్చాయని తెలిపాడు.ముఖ్యంగా మై విలేజ్ షోలో 14 ఏళ్ల నుంచి అనుబంధం ఉన్నప్పటికీ, చివరికి ప్రతి ఒక్కరికీ సొంత సంపాదన, స్థిరపడటం ముఖ్యం కాబట్టి వేరే దారి చూసుకోవాల్సి వచ్చిందని అంజి మామ వివరించాడు.

అదే నచ్చలేదు 

Advertisement

ఇక యూట్యూబ్ చానెల్ మొదలెట్టిన కొత్తలో రెవెన్యూ షేరింగ్ లేదా బోనస్‌ల గురించి ఎవరికీ సరైన అవగాహన లేదని . శ్రీకాంత్ టీమ్ సభ్యులకు డబ్బులు ఇచ్చినప్పటికీ , బ్రాండ్ రివ్యూలు, సొంతంగా పర్సనల్ ప్రాజెక్టులు చేయడం వంటి చేయకూడదన్న అగ్రిమెంట్ నచ్చలేదు తెలిపాడు.దీంతో కొందరు సభ్యులు బయటకు వచ్చి సొంత ఛానెళ్లు ప్రారంభించారని, ఒకప్పుడు 60 నుండి 80 మందితో కలకలలాడిన టీమ్, ఇప్పుడు 15-16 మందికి తగ్గిపోయిందని వాపోయాడు.

శ్రీకాంత్ లేకపోతే నేను, అనిల్ లేదా చందు ఎవరూ లేరు

అయితే విమర్శలు ఎలా ఉన్నా, శ్రీకాంత్ ప్రాముఖ్యతను అంజి మామ గట్టిగా సమర్థించడం విశేషం.శ్రీకాంత్ లేకపోతే నేను, అనిల్ లేదా చందు ఎవరూ లేరు” అని స్పష్టం చేశాడు. ఒక నటుడిగా, కెమెరామెన్‌గా, ఎడిటర్‌గా ప్రతి ఒక్కరికీ గుర్తింపు తెచ్చింది శ్రీకాంతేనని, ఆయన వేసిన పునాదిని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. వారి మధ్య ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని, ఇప్పటికీ కుటుంబ అనుబంధం కొనసాగుతోందని స్పష్టం చేశాడు.

శ్రీకాంత్ సినిమా ఎందుకు తీయట్లేదంటే 

Advertisement

ఇక శ్రీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా ఎందుకు తీయట్లేదనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు అంజి మామ. ఒక సినిమా తీయడానికి కనీసం ఒక కోటి బడ్జెట్ అవసరం. కానీ, ప్రస్తుత OTT మార్కెట్‌లో కోటి రూపాయలతో సినిమా తీస్తే అందులో సగం అంటే 50 లక్షలు మాత్రమే ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని, అందుకే ఆర్థిక రిస్క్ తీసుకోకుండా శ్రీకాంత్ జాగ్రత్త పడుతున్నాడని వెల్లడించాడు. మై విలేజ్ షో, మై విలేజ్ షో వ్లాగ్స్ అంటూ దాదాపు 4-5 ఛానెళ్లని శ్రీకాంత్ పెట్టాడని తెలిపాడు.

also read :ఈశ్వర్ సాయి-మాధురి వ్యవహారంపై భార్య ఫస్ట్ టైమ్ ఓపెన్.. అసలు కథ ఇదే!

మొత్తంగా ఒకప్పుడు ఒకే కుటుంబంలా కలిసి పనిచేసిన టీమ్ సభ్యులు ఇప్పుడు తమ సొంత కెరీర్ కోసం వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నామని చెప్పుకొచ్చాడు అంజి మామ !

Tags

Related News

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Big Stories

Advertisement
×