E-Paper
Advertisement

మార్నింగ్ బాయ్ ఫ్రెండ్, నైట్ గర్ల్ ఫ్రెండ్ తో… నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవడిదిరా బాధ్యత

మార్నింగ్ బాయ్ ఫ్రెండ్, నైట్ గర్ల్ ఫ్రెండ్ తో… నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవడిదిరా బాధ్యత
Advertisement

Romantic Comedy: అబ్బాయిల లైఫ్ ఎంత బాగుంటుంది అని అమ్మాయిలు… అమ్మాయిల్లా పుట్టి ఉంటే ఎంత బాగుండేది అని అబ్బాయిలు అని మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు. అది ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి ఓ నిట్టూర్పుతో ఆ ఆలోచనని అక్కడే వదిలేస్తాము. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమాలో హీరో మాత్రం పగటి పూట అమ్మాయిలా, రాత్రయితే అమ్మాయిలా మారి, ఇద్దరిలా లైఫ్ ను ఎంజాయ్ చేస్తాడు. మరి నిజంగానే ఇలాంటి పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది ? ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయం తెలుసుకోవాలంటే ‘డబుల్ ఆక్యుపెన్సీ’ (Double Occupancy) సినిమాను చూడాల్సిందే. 2026లో విడుదలై సినిమా ప్రేమికులను అలరించిన ఈ హై-కాన్సెప్ట్ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ తమిళ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒకే శరీరంలో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు జీవించడం అన్నది మామూలు కథ కాదు. ఒక వింత మాయా శక్తి లేదా శాపం వల్ల ఒక శరీరం పగటిపూట ఒక అమ్మాయిగా, రాత్రి అబ్బాయిగా మారిపోతుంది. పగటిపూట ఆ శరీరం రజిని (రేష్మా వెంకటేష్) కంట్రోల్ లో ఉంటుంది. ఆమె స్వతంత్ర స్వభావం గల, చురుకైన అమ్మాయి. రజిని కార్తీక్ (వినోద్ కిషన్) అనే యువకుడిని ప్రేమిస్తుంది.

Advertisement

రాత్రి వేళల్లో అదే శరీరం రాజ్ (సంతోష్)గా మారిపోతుంది. రాజ్ సంయుక్త (సంయుక్త విశ్వనాథన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ వింత పరిస్థితి వల్ల వారి జీవితాలు తారుమారవుతాయి. పగటిపూట రజిని కార్తీక్‌ తో రొమాంటిక్ మాటలు మాట్లాడుతుంటే, రాత్రి అదే శరీరంలో రాజ్ సంయుక్తతో డేటింగ్‌ కు వెళ్తాడు. గతం, అలవాట్లు, ఇష్టాలు… ఇద్దరివీ డిఫరెంట్ గా ఉంటాయి. పైగా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరి తెలియదు. దీంతో ఒకరి పార్టనర్ తో మరొకరు ఉన్నప్పుడు వచ్చే సిట్యుయేషనల్ కామెడీ, గందరగోళం ఆకట్టుకుంటాయి.

ఈ క్రమంలోనే రజిని, రాజ్ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, తమ రహస్యాన్ని బయట పెట్టకుండా, రెండు ప్రేమలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకే శరీరంలో రెండు జీవితాలు గడపడం అంత సులభం కాదు కదా. ఒకరు చేసిన తప్పుకు మరొకరు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఫోన్ కాల్స్, డేటింగ్ ప్లాన్స్, కుటుంబ సమస్యలు… ప్రతి విషయంలోనూ వాళ్ళు ఎదుర్కొనే సవాళ్లు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. మరి ఈ మ్యాజిక్ ఎందుకు ఎలా జరిగింది ? రాజ్ఈ, రజినిలకు ఆ శాపం ఎలా వచ్చింది? దీని నుండి విముక్తి పొందడానికి వాళ్ళు ఏం చేశారు ? అసలు వాళ్లిద్దరికీ ఈ శాపంతో ఉన్న లింకు ఏంటి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

తెలుగులో లేదు

Advertisement

జెండర్ స్వాప్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా కామెడీతో కితకితలు పెడుతుంది. అశ్విన్ కందసామి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సంతోష్, రేష్మా వెంకటేష్, సంయుక్త విశ్వనాథన్, వినోద్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఖుష్బూ సుందర్, ఏ.సి.ఎస్. అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ప్రస్తుతం థియేటర్ రన్ ముగించుకుని Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తమిళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు ఆడియోలో ఇంకా అందుబాటులో లేదు. మరి ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకొస్తారా ? అన్నది చూడాలి.

Read Also: చేతబడి తిప్పికొడితే ఎలా ఉంటుందో తెలుసా ? ఓటీటీని వణికిస్తున్న మలయాళం హర్రర్ సిరీస్

Related News

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

Big Stories

Advertisement
×