E-Paper
Advertisement

హైదరాబాద్ సిటీలో పెద్ద సమస్య.. జీహెచ్‌ఎంసీలో ఉచిత పథకం, ఇంకెందుకు ఆలస్యం వెంటనే

హైదరాబాద్ సిటీలో పెద్ద సమస్య.. జీహెచ్‌ఎంసీలో ఉచిత పథకం, ఇంకెందుకు ఆలస్యం వెంటనే
Advertisement

Hyderabad City: హైదరాబాద్ సిటీలో అతి పెద్ద సమస్యకు చెక్ పెట్టింది జీహెచ్ఎంసీ.  దీనివల్ల హైదరాబాద్ సిటీ మరింత సర్వాంగ సుందరంగా కనిపించనుంది. చాలామంది ప్రజలు ఇళ్లు మారినప్పుడు పాత ఫర్నిచర్‌ను రోడ్డు పక్కనున్న ఖాళీ ప్రాంతాల్లో పడేస్తున్నారు. ఆ సమస్య అక్కర్లేదు, జీహెచ్ఎంసీ‌ ప్రవేశపెట్టిన నెంబర్‌కు సమాచారం ఇస్తే చాలు, వారే తీసుకెళ్లిపోతారు. ఈ పథకంపై భాగ్య నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ సిటీలో పెద్ద సమస్య: హైదరాబాద్ సిటీలో ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సిటీవాసులు తమ ఇళ్లలో పాడైన పాత పరుపులు, సోఫాలు, పాత ఫర్నిచర్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఉచితంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి డోర్‌స్టెప్ పికప్ సేవలను అధికారికంగా ప్రారంభించింది.

Advertisement

నగరవాసులు ఇళ్లు మారినప్పుడు, స్థానికులు పాడైన తమ పాత ఫర్నిచర్‌‌ను నేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేయవచ్చు. అదెలా సాధ్యమని అంటారా? హైదరాబాద్ సిటీలో ఏటా వానాకాలంలో నాలాలు పేరుకుపోతుంటాయి. వాటిల్లో ఎక్కువగా పాత పరుపులు, పాడైన మంచాలు, డ్యామేజ్ అయిన సోఫాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత పథకం: వాటివల్ల సిటీలో డ్రైనేజీ సమస్యలు తీవ్రమవుతున్నాయి. నాలాల మురుగునీటి ప్రవాహానికి పాత ఫర్నీచర్ అడ్డుపడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. దీన్ని గుర్తించిన మున్సిపల్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. నగర వీధులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వరద ముప్పును నివారించడానికి ఉచితంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది.

Advertisement

ప్రస్తుతం ఆరు జోన్‌ల పరిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే చాలామంది ఇళ్లు మారినప్పుడు పాడైన ఫర్మీచర్‌ను రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీనివల్లే లేనిపోని సమస్యలు వస్తున్నాయి. వీటిని సుదూర ప్రాంతాలకు తరలించేందుకు రవాణా ఖర్చులు భారంగా మారుతుందని భావిస్తున్నారు.

మరింత అందంగా హైదరాబాద్ సిటీ: కొందరైతే భయపడి రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ ప్రదేశాలు, రోడ్డు, నల్లాల పక్కన వాటిని పడేస్తుంటారు. దీనివల్ల సిటీ అపరిశుభ్రంగా తయారవుతోంది. ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టిన ఉచిత సేవల వల్ల ఈ సమస్యకు చెక్ పడినట్లయ్యింది.

ALSO READ: యూట్యూబర్ రావణ్ ఫోన్‌లో మావోయిస్ట్ భావజాలం.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు!

నగరంలో ఉచిత సేవను వినియోగించుకునేవారు తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, చిరునామాను సమర్పించాలి. శానిటేషన్ సిబ్బంది ఇచ్చిన తేదీ, సమయానికి ఇంటికి వస్తారు. ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకుండా ప్రజల పాత వస్తువులను తీసుకుంటారు.

పర్యావరణానికి హాని కలగని రీతిలో శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్‌కు వాటిని పంపనుంది. పాడైన పరుపులు, ఫర్నిచర్‌ నాలాల్లో పడేసి నగరాన్ని కలుషితం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది జీహెచ్‌ఎంసీ. ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుని హరిత హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

 

Related News

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల జాతకం తేలేది అప్పుడే!

మంచిర్యాల కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య పెరుగుతున్న దూరం!

Big Stories

Advertisement
×