OTT Movie : దెయ్యాలు పట్టడం అన్నది సినిమాలలో చూసే సర్వసాధారణ విషయం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం ఒక యువ జంట జీవితంలో దుష్ట శక్తి చొరబడి, వారి వివాహా జీవితాన్ని నాశనం చేస్తూ భయంకరమైన సంఘటనలను సృష్టిస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
11 మిలియన్లకు పైగా వ్యూస్
ఈ సినిమా పేరు “ది డెవిల్స్ బ్రైడ్” (The Devil’s Bride). ఇందులో ఎరికా కార్లినా (ఎచా), ఎమిర్ మహిరా (ఏరియల్), రూత్ మరిని, వావి జిహాన్, ఎన్స్ బాగస్, ఆల్ఫీ ఆల్ఫాండి తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో లేదు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇదొక ఇండోనేషియన్ సూపర్ నాచురల్ హారర్ చిత్రం. ఇందులో భయంకరమైన అంశాలతో పాటు సాంస్కృతిక అంశాలను (ముస్లిం ఎక్సార్సిజం) మిక్స్ చేశారు. ఈ చిత్రం జిన్ డాసిమ్ అనే దెయ్యం చుట్టూ తిరుగుతుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అంశాలతో, అతీంద్రియ శక్తుల సన్నివేశాలతో హారర్ అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఈ మూవీ. ఇందులో ఉన్న డ్రామా అంశాలు, ముఖ్యంగా వివాహ సమస్యలు, కుటుంబ బంధాలు, కథకు భావోద్వేగ లోతును జోడిస్తాయి. Rjl 5 పాడ్‌కాస్ట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది టిక్‌టాక్‌లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.
Read Also : దెయ్యాన్ని వదిలించే వాళ్ళకే దెయ్యం పడితే… ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉన్న హర్రర్ మూవీ
కథలోకి వెళ్తే…
ఎచా (ఎరికా కార్లినా), ఏరియల్ (ఎమిర్ మహిరా) వివాహ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న ఒక జంట. ఎచా తన కలల్లో ఒక ఆకర్షణీయమైన వ్యక్తిని కలుస్తుంది. అంతేకాదు అతనితో చేయకూడని పనులన్నీ చేస్తుంది. మరోవైపు భర్తకు ఆమె తీరుపై అనుమానం వస్తుంది. ఇక ఆమె అనుకోకుండా ప్రెగ్నెంట్ అని తెలియడంతో గొడవ పెద్దది అవుతుంది. హాస్పిటల్ కి వెళ్తే అసలు ఆమె ప్రెగ్నెంట్ కాదనే షాకింగ్ విషయం బయటపడుతుంది. అయితే కలలో కన్పించే ఆ అబ్బాయి జిన్ డాసిమ్ అనే దుష్ట ఆత్మ అని త్వరగానే తెలుసుకుంటుంది ఈ జంట. ఆమెను తన “దెయ్యం వధువు”గా చేసుకోవాలని కోరుకుంటాడు. అందుకే ఈ జిన్ హీరోయిన్ మ్యారేజ్ లైఫ్ ను నాశనం చేయడానికి చాలా పనులే చేస్తుంది. ఇంతకీ ఈ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఆ జంట ఏం చేసింది? ఆ దెయ్యం ఎందుకు ఈ అమ్మాయి వెంట పడింది? క్లైమాక్స్ ఏంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవలసిన అంశం.