BigTV English

Shubman Gill – Sara: లండన్ పార్టీలో గిల్ కు అవమానం… సారాతో క్లోజ్ గా యువరాజ్ !

Shubman Gill –  Sara: లండన్ పార్టీలో గిల్ కు అవమానం… సారాతో క్లోజ్ గా యువరాజ్ !
Advertisement

Shubman Gill – Sara: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా ఎదగడమే కాకుండా.. టెస్ట్ కెప్టెన్ గా కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇంగ్లాండ్ గడ్డ పైన అద్భుతంగా రాణిస్తున్నాడు టీమిండియా కెప్టెన్ గిల్. అయితే టీమిండియాలో ఉన్నత స్థాయికి చేరకముందు… లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమాయణం నడిపినట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే లండన్ లో తాజాగా ఈ ఇద్దరు ఎదురుపడ్డారు. యువరాజ్ ఇచ్చిన ఓ డిన్నర్ పార్టీకి… సారా టెండూల్కర్ అలాగే టీమిండియా కెప్టెన్ గిల్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా… ఎదురుపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.


 Also Read:  Watch Video : ఇదెక్కడి బౌలింగ్ రా… బుడ్డోడు వేసిన బంతికి నడ్డి విరిగింది.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

లండన్ డిన్నర్ లో సారా, గిల్ ఎంజాయ్


టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి తెలియని వారు ఉండరు. అయితే తాజాగా టీమిండియా ప్లేయర్లు, మాజీ క్రికెటర్లు అందరికీ మంచి డిన్నర్ పార్టీ ఇచ్చాడు యువరాజ్ సింగ్. తన చారిటీ YouWeCan అనే ఫౌండేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో… తన చారిటీ తరఫున మంచి డిన్నర్ పార్టీ ఇచ్చాడు యువరాజ్ సింగ్. ఇది క్యాన్సర్ కు సంబంధించిన ఫౌండేషన్. క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకుగాను ఈ ఫౌండేషన్ పెట్టాడు యువరాజ్ సింగ్. అయితే ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లు కూడా లండన్ లోనే ఉండడంతో… వాళ్లందరినీ పిలిచి మంచి డిన్నర్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ కు సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ కూడా రావడం జరిగింది. సచిన్ టెండూల్కర్ కూతురు కూడా వైట్ డ్రెస్ లో ఈవెంట్ కు వచ్చి మెరిసింది.

 Also Read: Atlee – The Rock: అల్లు అర్జున్ కోసం పాండ్యా, రాక్… ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే ?   

టీమిండియా కెప్టెన్ గిల్ ను అవమానించిన సారా

యువరాజ్ నిర్వహించిన ఈ ఈవెంట్ లో… సారా టెండూల్కర్ కూర్చున్న టేబుల్ ముందు నుంచే టీమిండియా కెప్టెన్ గిల్ నడుచుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంగా ఆమెను… కాస్త రొమాంటిక్ గా చూస్తూ గిల్ నడుచుకుంటూ వచ్చాడు. కానీ సారా టెండూల్కర్ మాత్రం సైలెంట్ గా కూర్చున్నారు. పక్కనే సచిన్ టెండూల్కర్ ఉన్న నేపథ్యంలో ఆమె కూడా ఏమీ అనలేకపోయారు. ఆ తర్వాత… టీమిండియా ప్లేయర్లతో కూర్చున్న గిల్ పదేపదే.. తన ప్రియురాలు సారా టెండూల్కర్ ను చూసే ప్రయత్నం చేశాడు. కానీ గిల్ ను ఏ మాత్రం సారా టెండూల్కర్… పట్టించుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అదే సమయంలో… టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తో కలిసి కాస్త రొమాంటిక్గా కనిపించారు సారా టెండూల్కర్. ఆయనతో ఫోటో కూడా దిగారు. ఈ ఫోటో వైరల్ కావడంతో కొంతమంది టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. నీ ప్రియురాలు అంకుల్తో వెళ్లిపోతుందని… గిల్ ను ఏడిపిస్తున్నారు కొంతమంది నెటిజెన్స్.

Related News

Gautam Gambhir: కుల్దీప్ ఏం త‌ప్పు చేశాడు..ఓట‌మికి మూల‌ కార‌ణం గంభీరే, టీమిండియా 5 సిరీస్ లు గోవిందా

Yuzvendra Chahal: విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌కు భ‌ర‌ణం ఇవ్వొద్దు… చాహ‌ల్ సంచ‌ల‌నం పోస్ట్‌

INDW vs NZW: ఒకే మ్యాచ్ లో ఇద్ద‌రు భీక‌ర సెంచ‌రీలు.. సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా

PSL-Multan Sultans: PCBలో ప్ర‌కంప‌న‌లు..ముల్తాన్ సుల్తాన్స్ పై నఖ్వీ కుట్ర‌లు..PSL టోర్న‌మెంటే ర‌ద్దు?

IND VS AUS, 2ND ODI: అడిలైడ్ వ‌న్డేలో తెగించిన జంట‌…లిప్ కిస్సులు పెట్టుకుంటూ, పెగ్గు వేస్తూ మ‌రీ

IND VS AUS, 2ND ODI: కొంప‌ముంచిన సిరాజ్ ఫీల్డింగ్..17 ఏళ్ల త‌ర్వాత టీమిండియా ఓట‌మి…సిరీస్ ఆస్ట్రేలియా వ‌శం

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌కు తీవ్ర గాయం..ర‌క్తం వ‌చ్చినా బ్యాటింగ్‌, శ్రేయాస్ ను బండబూతులు తిడుతూ !

Virat Kohli: వ‌రుసగా రెండు డ‌కౌట్స్‌..అర్థాంత‌రంగా ఆస్ట్రేలియా నుంచి లండ‌న్ వెళ్లిపోతున్న కోహ్లీ..?

Big Stories

×