BigTV English

OTT Movie : క్షుద్ర పూజలతో ఫ్రెండ్ భార్యను వశపరచుకుని… సింగిల్ గా చూడాల్సిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : క్షుద్ర పూజలతో ఫ్రెండ్ భార్యను వశపరచుకుని… సింగిల్ గా చూడాల్సిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : తాంత్రిక శక్తులతో ఇప్పుడు సినిమాలు బాగానే తెరకెక్కుతున్నాయి. వీటిని మూవీ లవర్స్ వదిలిపెట్టకుండా చూస్తున్నారు. మసూద, పొలిమేర లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని బాగానే భయపెట్టాయి. అదే కోవలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా వస్తుంది. ఈ మూవీలో ఒక అమ్మాయికి దైవశక్తులు ఉంటాయి. వాటిని సొంతం చేసుకోవడానికి ఒక మంత్రి కూడు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (Aha) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేర్ ‘తంత్ర’ (Tantra). 2024 లో విడుదలైన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని అస్వని వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ రేఖ అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.  ఈ సినిమా మార్చి 15, 2024న థియేటర్లలో విడుదలైంది. 2024 ఏప్రిల్ 5 నుంచి ఆహా (Aha) ఓటీటీ ప్లాట్‌ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

రేఖ అనే ఒక సాధారణ అమ్మాయి ఉంటుంది. అయితే ఆమెకు కాస్తంత సిగ్గు కూడా ఎక్కువే. రేఖకు ఆత్మలను చూసే ఒక అసాధారణ శక్తి ఉంటుంది. ఈ శక్తి వల్ల స్టోరీ ముందుకు వెళ్ళే కొద్ది ఈమె ప్రమాదంలో పడుతుంది.  ఆమె జీవితంలో చిన్నప్పటి నుండి తేజు అనే అబ్బాయి ఉంటాడు. వెళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. తేజు ఒక వేశ్య కొడుకుగా, సమాజంలో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు.  అయినప్పటికీ అతనికి, రేఖకు మధ్య బంధం బలంగా ఉంటుంది.  రేఖ ఎప్పుడూ దెయ్యాలు, శక్తుల చుట్టూ ఉండటం వల్ల భయపడుతూ ఉంటుంది. ఒక దశలో, రేఖ ఒక దుష్ట తాంత్రికున్ని ఎదుర్కొంటుంది.  అతను ఆమె శక్తులను తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తాడు. ఈ తాంత్రికుడు రేఖ తల్లి రాజేశ్వరి జీవితంతో కూడా సంబంధం కలిగి ఉంటాడు. రాజేశ్వరికి కూడా దైవి శక్తులు ఉండేవి. కానీ ఆమె జీవితం ఈ మాంత్రికుడి వల్ల విషాదంగా ముగుస్తుంది.

ఆమె భర్త కుమార్‌ను తాంత్రికుడు తాంత్రిక శక్తుల కోసం ఉపయోగించుకుంటాడు. ఫ్రెండ్ భార్య అని చూడకుండా, ఆమె జీవితాన్ని నాశనం చేస్తాడు.  తన దుష్ట శక్తి తో రాజేశ్వరిని చంపేలా చేస్తాడు. ఇప్పుడు రేఖ తన తల్లి గతాన్ని, తన శక్తుల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటుంది. చివరికి, ఆమె తనలోని శక్తులను ఉపయోగించి చెడు పనులను చేసే, విగతి అనే తాంత్రికుడిని అంతం చేయాలనుకుంటుంది. ఆ తరువాత కథలో ఒక ముఖ్యమైన ట్విస్ట్ బయట పడుతుంది. రేఖ మహాకాళీ దేవి అవతారంగా గుర్తిస్తారు. రేఖ తన గ్రామాన్ని కాపాడుకోవడానికి ఈ శక్తులను ఉపయోగిస్తుంది. చివరికి రేఖ ఆ మాంత్రికుణ్ణి అంతం చేస్తుందా ? తన ఊరిని కాపాడుకుంటుందా ? తన ప్రేమను నిలుపుకుంటుందా ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

OTT Movie : చనిపోయిన భార్యతో కనెక్ట్ అవ్వడానికి అలాంటి పని… నెక్స్ట్ ట్విస్టుకు గుండె గుభేల్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీ

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి హత్య చేసే కిల్లర్… 6 నెలల తరువాత ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి..మూవీ లవర్స్ కు పండగే..!

OTT Movie : కళ్ళు కన్పించని కన్నిబలిస్టిక్ జీవులు… ట్రిప్పుకెళ్లి అడ్డంగా బుక్కయ్యే గ్రూప్… ఒళ్ళు జలదరించే సీన్స్

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

Big Stories

×