Best Summer Vacations: వేసవి సెలవు వచ్చాయంటే చాలా మంది పిల్లలతో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు. ఆర్థిక స్తోమతను బట్టి ఆయా ప్లేసెస్ ను సెలక్ట్ చేసుకుంటారు. తక్కువ ఖర్చలో అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలకు వెళ్తారు. మరికాస్త డబ్బులు వెచ్చించే అవకాశం ఉంటే, దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్తారు. అయితే, తక్కువ ధరలో విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి వారి కోసం బెస్ట్ కంట్రీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ శ్రీలంక
తక్కువ ఖర్చులో శ్రీలంకలో పర్యటించవచ్చు. ఈ దేశంలో అద్భుతమూన బీచ్‌లు, సహజమైన ప్రకృతి అందాలు, ఆకర్షణీయమైన సాంస్కృతిక వారసత్వం కనువిందు చేస్తాయి. శ్రీలంకలో సందర్శించాల్సిన బెస్ట్ ప్రదేశాలు సిగిరియా, పోలన్నారువా, కాండీ, నువారా ఎలియా, కొలంబో, యాలా నేషనల్ పార్క్, ఉదవాలవే నేషనల్ పార్క్, గాలె. హైబరీ కొలంబో అకోమోడేషన్ లో తక్కువ ధరలో బస చేసే అవకాశం ఉటుంది.
⦿ భూటాన్
చైనా, భారతదేశం మధ్య తూర్పు హిమాలయాలలో ఉన్న భూటాన్ అత్యంత సంతోషకరమైన ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. బౌద్ధ మతాన్ని ఆదరించే ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా తక్త్సాంగ్ పాల్ఫుగ్ మొనాస్టరీ, గాంగ్టే లోయ, డోచులా పాస్, పునాఖా జొంగ్, రిన్‌పుంగ్ జొంగ్, డ్రామెట్సే గోయెంబా, టాలో, జిగ్మే డోర్జీ నేషనల్ పార్క్ ఆకట్టుకుంటాయి. చంగంగ్‌ఖా, థింఫు లో తక్కువ ధరలో బస చేయవచ్చు.
⦿ మలేషియా
ఇక మలేషియాలో అద్భుతమైన నగరాలు, సాంప్రదాయ గ్రామాలు ఆకట్టుకుంటాయి. మరే ఇతర దేశంలో లేని విధంగా అనేక సాంస్కృతులు ఇక్కడ దర్శనం ఇస్తాయి. కౌలాలంపూర్ లోని ఎత్తైన భవనాల నుంచి బోర్నియోలోని సాంప్రదాయ గ్రామాల వరకు కనువిందు చేస్తాయి. మలేషియాలో మిరి, కంగర్, కౌలాలంపూర్, లాబువాన్, పాంగ్కోర్, రెడాంగ్ ద్వీపం, సారవాక్, రాంటౌ అబాంగ్ ద్వీపం, కపాస్ ద్వీపం, కామెరాన్ హైలాండ్స్, కుచింగ్, పెనాంగ్ ప్రాంతాలను తప్పకుండా విజిట్ చేయండి. నూర్డిన్ మ్యూస్ బసకు అనుకూలంగా ఉంటుంది.
⦿ థాయిలాండ్
అద్భుతమైన దీవులు, బీచ్ లు ఆకట్టుకుంటాయి. బౌద్ధ అభయారణ్యాలు అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. థాయిలాండ్‌లో సందర్శించాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి క్రాబీ, సుఖోతై, కో స్యామ్యూయ్, ఖావో సామ్ రోయ్ యోట్ నేషనల్ పార్క్, చియాంగ్ రాయ్, కాంచనబురి. థాయ్ మసాజ్ ఇష్టపడేవారు బ్యాంకాక్ కు చెక్కేయండి. అలమా సీ విలేజ్ రిసార్ట్ లో చక్కగా బస చేయవచ్చు.
⦿ ఇండోనేషియా
ఇండోనేషియా అనేది 17,000 దీవుల సముదాయం. పర్యాటకులకు ఇదో స్వర్గధామంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన బీచ్ లు, సాంస్కృతిక ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. మౌంట్ బ్రోమో, బాలి, లాంబాక్, బోరోబుదూర్, గిలి దీవులు, కొమోడో నేషనల్ పార్క్, ఉబుద్, కాలిమంటన్, మౌంట్ క్రాకటౌ అద్భుతంగా ఆకట్టుకుంటాయి. బుకు బెజి ఉబుద్ లో బస చేయవచ్చు.
⦿ ఖతార్
పురాతన సంప్రదాయాలు, ఆధునిక పోకడల కలబోతతో ఆకట్టుకుంటుంది. ఎడారి అందాలు, అద్భుతమైన రెస్టారెంట్లు అలరిస్తాయి. కటారా మసీదు (దోహా), అల్ వక్ర మ్యూజియం (అల్ వక్ర), దోహా కార్నిచ్, దోహా ఫోర్ట్, జెక్రీత్ బీచ్ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు. ఖతార్ ప్యాలెస్ హోటల్ లో బస చేయవచ్చు.
⦿ వియత్నాం
అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు వియత్నాం. ఆకట్టుకునే తీర ప్రాంతం, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, ఉత్కంఠ భరితమైన పర్వతాలు, దట్టమైన అడవులు ఆహా అనిపిస్తాయి. హో చి మిన్ సిటీ, సాపా, హనోయ్, హా లాంగ్ బే, హ్యూ, మై సన్, హోయ్ ఆన్, న్హా ట్రాంగ్ లాంటి ప్రదేశాలను తప్పకుండా చూసిరండి. న్యూ విజన్ ప్యాలెస్ హోటల్ లో బస చేయవచ్చు.
Read Also: కొద్ది రోజులు ఊటీ, కొడైకెనాల్ వెళ్లొద్దు.. ఎందుకంటే?