Rain Alert: మార్చి నెలలో ఎండలు దంచికొట్టాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొద్దుపొద్దున నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భారీ ఎండల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వస్తే భారీ ఉష్ణోగ్రతలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
మార్చి నెలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయంటే ఎండలు ఏ రేంజ్ లో దంచి కొట్టాయో అర్థం చేసుకోవచ్చు. మూములుగా మే నెలలో ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అలాంటి మార్చి నెలలోనే ఎండలు మే నెలను తలపించాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజుల నుంచి చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు కాగా… కొన్ని చోట్ల అయితే 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడ్డారు. ఏప్రిల్, మే నెలల్లో దంచి కొట్టాల్సిన ఎండలు.. మార్చి నెలలో చుక్కలు చూపిస్తున్నాయి.
అయితే, గత మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో వర్షం లేని ప్రాంతం అనేదే లేదు. మహానగరంలోని రోడ్లు వాగులను తలిపించాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఖైరతాబాద్, ఆనందనగర్, దిల్‌సుఖ్‌నగర్, రామ్‌నగర్‌లలో పలుచోట్ల చెట్లు కూలాయి. కొన్ని చోట్ల వాహనాలపై కూడా చెట్లు కూలి పలువురుకి గాయాలు అయ్యాయి. చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల వల్ల పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. సికింద్రాబాద్ అడ్డగుట్ట బస్తీలో మురుగునీటి కాలువ నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర బుల్కాపూర్ నాలా రహదారిని ముంచేసింది.
ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
అయితే, తెలంగాణ మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7, 8 తేదీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని వివరించింది ఈ నెల 7 న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 8 న కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములతో, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ప్రజలు తీవ్రమైన ఎండ, ఉక్కపోత నుంచి ఊరట కాస్త పొందారు. భూఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములో నింబస్ కారణంగా వడగండ్ల వానలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అకాల వర్షాల కారణంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ALSO READ: Telangana Court Exam: 1673 తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు ఎగ్జామ్ డేట్స్ విడుదల..
ALSO READ: BEL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతమైతే రూ.90,000.. ఇంకా 4 రోజులే భయ్యా..