Kaakamma Kathalu Season 2 : టాలీవుడ్ ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ పోస్ట్ గా చేస్తున్న లేటెస్ట్ షో కాకమ్మ కథలు.. ఈ షో మొదటి సీజన్ రీతు చౌదరి పోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు సీజన్ 2 కు తేజస్వి వ్యాఖ్యాతగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో కి ఎంతోమంది స్టార్స్ వచ్చారు. తేజస్వి అడిగే బోల్డ్ ప్రశ్నలకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్లు వినిపిస్తుంటాయి.. అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా షో నిర్వాహకులు ముందుకు వెళ్తున్నారు. తాజాగా మరో ఎపిసోడ్ ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో యాంకర్ రవి, తేజస్విని గౌడ గెస్ట్లుగా వచ్చారు. అందులో తేజస్వి విడాకులపై మరోసారి స్పందించింది. అమర్ తో విడాకులు తీసుకోబోతున్న వార్తలపై తేజేశ్విని ఎలాంటి సమాధానం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రచ్చ చేసిన రవి.. ఎమోషనల్ అయిన తేజస్వి..
కాకమ్మ కథలు సీజన్ 2 ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.. ఆ ప్రోమోలో యాక్టింగ్ పరంగా చెప్పినవాళ్ల పేర్లు ఆర్డర్‌లో చెప్పాలంటూ తేజస్వి అడిగింది. అమర్, అర్జున్, ప్రియాంక, మానస్ అంటూ చెప్పగానే అందరికీ ఈక్వెల్ అంటూ తేజు అంది. దీంతో పక్కనే ఉన్న రవి అదిరిపోయే పంచ్ వేశాడు. తేజు చెప్పిన ప్రకారం వారందరికీ యాక్టింగ్ రాదని అర్థం అంటూ రవి పంచుల వర్షం కురిపించారు.. మొత్తానికి రవి సెటైర్లు ఎపిసోడ్కి హైలెట్ అవుతాయని తెలుస్తుంది.. అటు తేజస్వి కొన్ని సందర్భాల్లో తన తండ్రి ఎందుకు దూరమయ్యాడని కన్నీళ్లు పెట్టుకుంది. తేజు తేజస్విని ఓదార్చింది. మరోవైపు యాంకర్ రవిని కూడా ఇలానే ప్రశ్నలతో విసిగించింది తేజస్వి..
Also Read :జయం రవి – ఆర్తి విడాకుల కేసులో ట్విస్ట్.. వెనక్కి తగ్గిన భార్య..
అమర్ తో డివోర్స్ నిజమేనా..?
సీరియల్ హీరోయిన్ తేజస్వి ని తన భర్త అమర్ తో కలిసి విడాకులు తీసుకోబోతున్నారా? అనే ప్రశ్న అడిగింది.. తేజు బిగ్ బాస్ కి వెళ్తోందా అని హోస్ట్ అడిగేసరికి ఒక్కసారి ఊపిరి బిగబట్టి కూర్చుంది తేజు. మీరు అమర్ తో డివోర్స్ తీసుకుంటున్నారా అని మళ్ళీ హోస్ట్ అడిగింది. రీసెంట్ టైమ్స్ లో కొన్ని సిట్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు అనిపించింది ఈ సందర్భంలో డాడీ ఉండి ఉంటే..అదొక్కటే నేను డాడీని నా లైఫ్ లో మిస్ ఐన టైం అంతే అనే ఎమోషనల్ అయ్యేసరికి హోస్ట్ వెళ్లి ఆమెను ఓదార్చింది.. వీరిద్దరు విడాకుల గురించి ఈమధ్య సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.. మరి ఈ షో లైన అసలు నిజాన్ని బయటపెడుతుందేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… ఈ ప్రోమో ఎంత ఫన్నీగా ఉందో ఒక్కసారి చూసేయ్యండి..