EPAPER

Evol ott movie : ఓటీటీలో సెన్సార్ బ్యాన్ చేసిన బోల్డ్ సినిమా.. నేరుగా తెలుగులో

Evol ott movie : ఓటీటీలో సెన్సార్ బ్యాన్ చేసిన బోల్డ్ సినిమా..  నేరుగా తెలుగులో

Telugu bold content movie evol ready to streaming through OTT: ఓటీటీలో కంటెంట్ బాగుంటే చూడటానికి జనం అలవాటు పడ్డారు. థియేటర్లలో ఎంతో బాగుంటేనే..అది కూడా థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసమే కొన్ని పరిమిత సినిమాలను మాత్రమే చూస్తున్నారు ప్రేక్షకులు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లి పాదీ మూవీస్ చూసే ఓటీటీ అందుబాటులోకి వచ్చాక థియేటర్లకు వెళ్లడమే మానేశారుప్రేక్షకులు అయితే ఓటీటీకి సంబంధించి కఠినమైన ఆంక్షలు, సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో కొందరు నిర్మాతలు బోల్డ్, వైలెంట్ కంటెంట్ ను చూపిస్తున్నారు.


తెలుగులో తక్కువ

యువ ప్రేక్షకులు వాటిని ఆదరించడంతో ఆ తరహా సినిమాలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నాయి. అయితే తెలుగులో బోల్డ్ కంటెంట్ సినిమాలు చాలా తక్కువ. ఎక్కువగా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు మాత్రమే చూసేందుకు అలవాటుపడ్డారు జనం. ఇప్పుడు ఈ తరహా సినిమాలు తెలుగులోనూ వస్తున్నాయి. ఎవోల్ అనే మూవీ తెలుగులో రాబోతోంది. ఇంగ్లీష్ లెటర్స్ ఎల్ ఓ వి ఈ తిరగేస్తే లవ్ అనే అర్థం వచ్చేలా ఉంటుంది. దర్శక నిర్మాతలు ఎలా భావించారో తెలియదుగానీ లవ్ తిరగేస్తే లస్ట్ అనుకున్నారో ఏమో ఈ మూవీని చాలా బోల్డ్ గా అడ్డూ అదుపూ లేకుండా తీశారు. సెన్సార్ అంటూ ఒకటి ఉన్నదన్న సోయే లేకుండా ఈ సినిమాను కావలసినంత బోల్డ్ గానే తీశారు. పైగా ఇది ఒక రొమాంటిక మూవీ అంటూ దానికి చక్కని కవరింగ్ కూడా ఇచ్చారు. రామ్ వెలగపూడి అనే యువ దర్శకుడు దాదాపు అందరూ కొత్తవారితో ఈ మూవీని నిర్మించాడు.


సెన్సార్ ఆంక్షలు

ఈ మూవీని ఓటీటీకి రిలీజ్ చేయాలనే ఆలోచన లేదు నిర్మాతలకు. అందుకే థియేటర్లలో విడుదల చేస్తే మంచి కలెక్షన్లు వస్తాయని భావించారు. తీరా చూస్తే సెన్సార్ అధికారులు ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేనంత బోల్డ్ సన్నివేశాలు బోలెడు ఉన్నాయంటూ ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించరాదంటూ బ్యాన్ చేశారు. దీనితో ఈ మూవీకి ఒక్కసారిగా ఫ్రీ పబ్లిసిటీ చేసినట్లయింది. ఈ మూవీలో ఏదో విషయం ఉందని ప్రతి ఒక్కరూ ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక వేళ సెన్సార్ సభ్యులు ఒప్పుకుంటే గత నెలలోనే మూవీ రిలీజయి ఉండేది. అయితే ఈ ఆగస్టు 15 నుంచి ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న ఓటీటీ మూవీని విడుదల చేసేందుకు అహా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మూవీకి ఎక్కువ రేటు ఇచ్చి మరీ కొనుగోలు చేసిందని సమాచారం.

ఆహా..ఇదేం తీరు?

అల్లు అరవింద్ ఆహా ఎంటర్ టైన్ మెంట్ నిర్వాహకులుగా తమ కుమారులను కూడా కలుపుకుని నిర్వహిస్తున్నారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఆహా తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శిస్తున్నారు. ఇప్పటిదాకా ఆహా కంటెంట్ అంటే ఆహా అనిపించేదిగా ఉంటోంది. బాలకృష్ణ తో నిర్వహించిన రియాలిటీ షో కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆహా నుంచి వస్తున్న మూవీ అంటే ఫ్యామిలీ సభ్యులంతా కలిసి చూసేలా ఉంటుందని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న ఎవోల్ మూవీని ఆహా నిర్వాహకులు ఎలాంటి విలువలు పాటించకుండా ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు యూత్ మాత్రం ఎవోల్ ఎప్పుడొస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Related News

Best OTT Movie: కూతురి శవం కోసం 15 ఏళ్లుగా ఆ తండ్రి తవ్వని ప్రాంతం లేదు.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మెంటల్ ఎక్కుతుంది!

OTT Movie : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలకు బాబు లాంటిది ఈ టామ్ క్రూయిజ్ మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : మైండ్ డిస్టర్బింగ్ టీనేజర్స్ మూవీ.. స్టూడెంట్స్ మస్ట్ వాచ్

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన అచ్చ తెలంగాణ ఫీల్ గుడ్ మూవీ… చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళాల్సిందే

OTT Movie : అమ్మాయి కోసం ప్రాణాలు పణంగా పెట్టే మగాళ్లు… భయపెడుతూనే నవ్వించే ఈ మూవీని ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?

Horror Thriller OTT : ఊహకందని ట్విస్టులతో హార్రర్ థ్రిల్లర్ మూవీ.. మళ్లీ మళ్లీ చూడాలంపించే సీన్స్..

Best OTT Movies: ఒక షాపింగ్ మాల్.. ఒక మాస్క్ మ్యాన్.. దారుణ హత్యలు, ఇంట్రెస్టింగ్‌గా సాగిపోయే సిరియల్ కిల్లర్ మూవీ ఇది

Big Stories

×