Cigarette Fire With Porsche| సోషల్ మీడియాలో గుర్తింపు పొందడానికి యువతీ యువకులు చేయకూడని సాహసాలు, విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఓ ఖరీదైన కారు సైలెన్సర్ తో సిగరెట్ కు నిప్పంటించాలని ప్రయత్నిస్తూ కొత్తగా ట్రై చేశాడు. ఈ వీడియా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కోట్లు ఖరీదు చేసే కారుని అతను సిగరెట్ కాల్చడానికి ఉపయోగించడంతో నెటిజెన్లు మండిపడుతున్నారు. పైగా సిగరెట్ కాల్చడానికి ప్రయత్నించి చేయి కూడా గాయపరుచుకున్నాడు. కారు వెనుక భాగంలో ఉన్న సైలెన్సర్ వద్దకు వెళ్లి అక్కడ చిన్న మంటలో అతను సిగరెట్ కాల్చలాని చూశాడు. కానీ సైలెన్సర్ నుంచి పెద్ద మంట రావడంతో తగిన శాస్తి జరిగింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన అసద్ ఖాన్ అనే యువకుడు ఇన్స్‌టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి విచిత్ర వీడియోలు చేస్తుంటాడు. ఇన్స్‌టాగ్రామ్ లో ఈ వీడియోకి ఇప్పటికే ఒన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందులో భాగంగానే పోర్చ్ కారు సైలెన్సర్ తో సిగరెట్ అంటిస్తూ వీడియా చేశాడు. పై గా ఇన్స్ టా లో ఆ వీడియోతోపాటు ఓ కాప్షన్ కూడా పెట్టాడు.”సిగరెట్ కు నిప్పంటించడానికి సులువైన దారి ఏదో తెలుసా? నేను స్మోకింగ్ చేయను. ఆరోగ్యానికి అది మంచిది కాదు. కానీ నా రేసింగ్ కారు పోర్చె 718 కేమెన్ ఒక ప్రత్యేకత ఉంది. అది చూడండి” అని రాశాడు.
Also Read: ముంబై రోడ్లపై టవల్‌తో తిరిగిన అమ్మాయి.. ఒక్కసారిగా టవల్ తీసేయడంతో..
అసద్ ఖన్ వీడియోపై చాలా మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలకు ఒక డిస్కెలైమర్ పెట్టాలని ఒక యూజర్ రాస్తే.. మరొకరు వీడికి అసలు బుర్ర ఉందా? అని మండిపడ్డాడు. మరొకరైతే చేయితో కాకుండా ఎలాగో నోట్లో సిగరెట్ పెట్టుకొని కాల్చాలేదు అని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు. అసద్ ఖాన్ వీడియోపై పోలీసులు చర్యలు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి విన్యాసాలు వీడియోలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఇటీవలే ఒక వ్యక్తి తన శరీరాన్ని మొత్తం ప్లాస్టిక్ లో చుట్టి కారు నుంచి నడుస్తున్న కారులో వేలాడుతూ వీడియో చేశాడు. మరో వీడియో లో అయితే నలుగురు యువకులు.. వేగంగా కదులుతున్న కారుపై భాగంలో ఉన్న సన్ రూఫ్, పక్క విండోలపై నిలబడి విన్యాసాలు చేశారు.
View this post on Instagram