E-Paper
Advertisement

Telugu Movies OTT : ఈ వీకెండ్ ఏకంగా 8 సినిమాలు… ఓటీటీలలో తెలుగు సినిమాల జాతర

Telugu Movies OTT : ఈ వీకెండ్ ఏకంగా 8 సినిమాలు… ఓటీటీలలో తెలుగు సినిమాల జాతర
Advertisement

Telugu Movies OTT : ప్రతీ వీకెండ్ ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు వస్తాయి. కానీ అందులో తెలుగు సినిమాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. మిగతా భాషల సినిమాల డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ, మన తెలుగు సినిమాలను మాత్రం బాగా మిస్ అవుతారు. కానీ ఈ వీకెండ్ మాత్రం ఓటీటీలో తెలుగు సినిమాల జాతరే సాగుతోంది. ఏకంగా 8 సినిమాలు వివిధ ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. అఖండ 2 – తాండవం (Akhanda 2 – Thaandavam)

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది. ఇందులో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, విజి చంద్రశేఖర్, కబీర్ దుహాన్ సింగ్, శాశ్వత చటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ వంటి స్టార్స్ నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో జనవరి 9 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. పొరుగు దేశం భారత్‌ ను అటాక్ చేయడానికి మహాకుంభమేళాలో బయోవార్‌ఫేర్ అటాక్ కు సన్నాహాలు చేస్తుంది. శత్రు మూకను దైవ శక్తి ఉన్న అఖండ ఎలా తరిమికొట్టాడు ? అన్నది స్టోరీ.

2. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 (Constable Kanakam Season 2)

Advertisement

వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం సీజన్ 2’. రాజీవ్ కనకాల, మేఘ లేఖ, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, కంచరపాలెం కిషోర్, జ్వాల కోటి, హరీంద్ర మౌళి, ప్రేమ్ సాగర్, సుచిత్రా అనందన్ వంటి నటీనటులు నటించిన ఈ సిరీస్ జనవరి 8 నుండి ETV Win ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1 తర్వాత పీసీ కనకం చంద్రిక మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ ను కంటిన్యూ చేస్తుంది.

3. జిగ్రిస్ (Jigris)

కృష్ణ బురుగుల, రామ్ నితిన్, మణి వాకా, ధీరజ్ అత్రేయ హీరోలుగా నటించిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’. సన్‌నెక్స్ట్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. నలుగురు చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్స్ కార్తీక్, ప్రవీణ్, వినయ్, ప్రశాంత్ స్టోరీ ఇది. ప్రశాంత్ క్యాన్సర్‌తో బాధపడుతూ చివరగా గోవా ట్రిప్ వెళ్లాలని ఆశపడతాడు. మారుతి 800లో జర్నీ స్టార్ట్ చేసి ఇబ్బందులో పడతారు ఆ నలుగురు.

4. సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ (Silent Screams: The Lost Girls Of Telangana)

Advertisement

శృతి హాసన్ నరేటర్‌ గా వ్యవహరించిన డాక్యుమెంటరీ ‘సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’. ఇప్పుడు సన్‌నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణలో మహిళలపై జరిగిన క్రైమ్స్ ను ఈ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీలో చూపించారు.

5. అయలాన్ (తెలుగు వెర్షన్) (Ayalaan Telugu Version)

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా, ఇమాన్, యోగి బాబు, కరుణాకరన్ వంటి నటీనటులు కీలకపాత్రల్లో నటించిన మూవీ ‘అయలాన్. ఈ తమిళ సై-ఫై థ్రిల్లర్ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో జనవరి 7 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

6. నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ : డ్యువల్ (తెలుగు) (Not All Movies Are The Same: Dual Telugu)

ఈ సై-ఫై మిస్టరీ థ్రిల్లర్ లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో జనవరి 9 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఓ యువకుడు పారలల్ వరల్డ్‌లో జాంబీల చేతిలో చిక్కుకున్న ఫ్యామిలీని సేవ్ చేసే ప్రయత్నమే ఈ మూవీ. ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

7. అందెల రవమిది (Andhela Ravamidhi)

ఇంద్రాణి దావలూరి నిర్మించిన ఈ మూవీకి సాయి రామ్ పల్లే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 8 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. గ్లోబల్ ఆడియెన్స్‌కి ఇండియన్ క్లాసికల్ డాన్స్ ను ఇంట్రడ్యూస్ చేసే అవార్డ్ విన్నింగ్ మూవీ ఇది.

8. మళ్లీ వచ్చిన వసంతం (Malli Vachina Vasantham)

కాశ్వి, తేజ, విష్ణు వంటి నటీనటులు నటించిన ఈ మూవీ ETV Win ఓటీటీలో జనవరి 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథా సుధా సిరీస్‌లో భాగంగా రిలీజ్ అయ్యింది.

Read Also : కేక పెట్టించే కన్నడ సినిమాల నుంచి అచ్చ తెలుగు ఆణిముత్యాల వరకు… ఓటీటీలో ఉన్న బెస్ట్ థ్రిల్లర్స్ ఇవే

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×