E-Paper
Advertisement

BCCI-Gambhir: VVS ల‌క్ష్మ‌ణ్ తో బీసీసీఐ అత్య‌వ‌స‌ర మీటింగ్‌..గంభీర్ ముంద‌స్తుగా రాజీనామా?

BCCI-Gambhir: VVS ల‌క్ష్మ‌ణ్ తో బీసీసీఐ అత్య‌వ‌స‌ర మీటింగ్‌..గంభీర్ ముంద‌స్తుగా రాజీనామా?
Advertisement

BCCI-Gambhir:  టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవికి ఎసరు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి వేస్తున్న అడుగులు చూస్తుంటే, గౌతమ్ గంభీర్ పదవి అతి త్వరలోనే పోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తుమ్మితే ఓడిపోయేలా గౌతమ్ గంభీర్ పదవి తయారైంది. అనవసరపు గొడవల్లో వేలుపెట్టడం,, టీమిండియా బ్యాటింగ్ లైనప్ డిస్టర్బ్ చేయడం, స్వదేశంలో టీమిండియా ఓటమికి కారణమైన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

వీవీఎస్ లక్ష్మణ్ తో బీసీసీఐ పెద్దలు అత్యవసర సమావేశం

Advertisement

టీమిండియా అసిస్టెంట్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్ తో భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు తాజాగా సమావేశమయ్యారు. శనివారం రోజున ప్రత్యేకంగా వివిఎస్ లక్ష్మన్ ను పిలిపించింది బీసీసీఐ. శనివారం ఢిల్లీలో ఉన్న బీసీసీఐ కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ పదవి ఇస్తే చేయగలుగుతావా ? లేదా? అని వివిఎస్ లక్ష్మణును బిసిసిఐ పెద్దలు అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గౌతమ్ గంభీర్ పైన వేటు వేయడం గ్యారంటీ అంటున్నారు. అయితే గౌతమ్ గంభీర్ పైన ఎప్పుడు వేటు వేసేది ? అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అయిపోయే వరకు అతన్ని ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ టోర్నమెంట్ లో ప్రదర్శన ఆధారంగా గౌతమ్ గంభీర్ భవిష్యత్తు ఉంటుందట. ఒకవేళ t20 ప్రపంచక 2026 టోర్నమెంట్ టీమిండియా గెలిస్తే ఆరు నెలల పాటు గౌతమ్ గంభీర్ పదవికి ఎలాంటి డోకా ఉండదని అంటున్నారు. ఒకవేళ టీమ్ ఇండియా అత్యంత దారుణంగా ప్రదర్శన ఇస్తే, వెంటనే అతన్ని తొలగిస్తారట. అంటే మార్చిలో వివిఎస్ లక్ష్మణ్ కు హెడ్ కోచ్ బాధ్యతలు ఇవ్వనున్నారట. ఈ మేరకు చర్చ జరుగుతుంది.

గౌతమ్ గంభీర్ హయాంలో టీమిండియా చెత్త ప్రదర్శన

గౌతమ్ గంభీర్ హయాంలో టీమిండియా చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాత శ్రీలంక చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై మొన్న బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో గత ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో ఫైనల్ దాకా వెళ్లే ఛాన్స్ ఇండియాకు రాలేదు. ఇక ఈసారి కూడా ఇండియాకు WTC ఛాన్స్ లేనట్లే అని తెలుస్తోంది. మొన్నటికి మున్నా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాదు బ్యాటింగ్ లైనప్ పూర్తిగా గౌతమ్ గంభీర్ డిస్టర్బ్ చేశాడు. రోకో కాంబినేషన్ ను తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు గంభీర్. హర్షిత్ రానా తో పాటు గిల్ కు మాత్రమే అవకాశాలు ఇస్తున్నాడు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ పైన వేటు వేస్తున్నారు.

Advertisement

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×