E-Paper
Advertisement

చెవులు కోసుకుని కరకర నమిలేసే పిల్ల పిశాచి… ‘కాంతారా’ లాంటి థ్రిల్లర్

చెవులు కోసుకుని కరకర నమిలేసే పిల్ల పిశాచి… ‘కాంతారా’ లాంటి థ్రిల్లర్
Advertisement

Mythological Horror Thriller: హర్రర్ సినిమాలలో సీన్స్ ఎలా ఉంటాయి ? దెయ్యం వచ్చి భయపెట్టడం, లేదా ఎవరికైనా దెయ్యం పట్టడం లాంటి సన్నివేశాలు కామన్. అందులో భాగంగా ఆ దెయ్యం పట్టిన క్యారెక్టర్ చేసే హంగామాను కూడా చూశాము. కానీ శవాలను మటుమాయం చేసే అడవి గురించి, అర్దరాత్రి అడవిలో నిలబడి, తన చెవులు తానే కోసుకుని తినే పిల్ల పిశాచిని చూశారా ? చూడకపోతే ఈ మూవీ మీకోసమే. 2024లో విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ ఫాంటసీ మైథాలజీ హారర్ థ్రిల్లరే ‘కళింగ (Kalinga)’. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

తెలంగాణలోని పురాతన గ్రామం ‘కళింగ’ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ ఊరి పొలిమేరను దాటినాక కాకులు దూరని కారడవి ఒకటి ఉంటుంది. ఆ అడవి వైపు వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రారని, అక్కడ భయంకరమైన శక్తులు ఉన్నాయని ఊరి ప్రజలు నమ్ముతారు. ఆ అడవి పేరు వింటేనే వణికిపోతారు. పొరపాటున కూడా అక్కడికి వెళ్ళే సాహసం చేయరు. ఇక్కడే హీరో ఎంట్రీ ఉంటుంది. అదే గ్రామంలో లింగ (ధృవ వాయు) అనే అనాథ యువకుడు ఉంటాడు. అనాథ కావడంతో ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరుగుతాడు. సారా కాస్తూ బతుకుతాడు.

Advertisement

లింగ చిన్నప్పటి నుండి పద్దు (ప్రగ్యా నయన్) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. పద్దు కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఊరి పెద్ద అయిన పటేల్ (ఆడుకాలం నరేన్) తమ్ముడు బలి (సంజయ్) కన్ను పద్దుపై పడుతుంది. ఈ క్రమంలోనే పద్దు తండ్రి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలంటే, లింగకు ఓ షరతు పెడతాడు. తాతల కాలం నాటి రెండెకరాల సొంత పొలాన్ని పటేల్ గుప్పిటి నుండి విడిపించుకుంటేనే పద్దును ఇస్తానని చెబుతాడు. కానీ పటేల్ కుట్ర పన్ని ఆ రెండెకరాలకు బదులుగా ఊరి పొలిమేర దాటి ఎవరూ వెళ్లని భయంకర అడవిలో ఉన్న నాలుగెకరాల భూమిని ఇస్తానని చెబుతాడు.

ఎలాగైనా తన ప్రేమను గెలుచుకోవాలని లింగ స్నేహితుడి (లక్ష్మణ్ మీసాల)తో కలిసి ప్రాణాలకు తెగించి ఆ అడవిలోకి అడుగు పెడతాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత లింగకు ఊహించని భయంకర అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ దాగి ఉన్న ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తులు, ‘అసురభక్షి’ అనే భయంకరమైన శక్తి, క్షుద్రపూజలు… ఇలా ట్విస్ట్ మీద ట్వీస్ట్ ఉంటాయి. ఆ అడవికి శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక భయంకరమైన శాపం ఉంటుంది.

Advertisement

లింగ తన ప్రేమ కోసం ఆ శక్తులను, పటేల్ పన్నిన కుట్రలను ఎలా ఎదుర్కొంటాడు ? అసలు అతని గతం ఏంటి ? హీరోకి ఉన్న శక్తి ఏంటి ? క్లైమాక్స్ లో గ్రామాన్ని, తనను తాను రక్షించుకోవడానికి హీరో చేసే భయంకరమైన త్యాగం ఏంటి ? చివరికి ప్రేమికురాలిని దక్కించుకున్నాడా లేదా ? అన్నది తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే.

తెలుగులో అందుబాటులో

ఈ సినిమా Aha, Amazon Prime Videoలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. ‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు స్వయంగా దర్శకత్వం వహించి, కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రాచీన తాంత్రిక రహస్యాలు, దైవిక శక్తులు, గ్రామీణ హారర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది.

Read Also : బ్రతికుండగానే చితిపై… తాగుబోతుకు బుద్ధి చెప్పడానికి మెంటల్ మాస్ ప్లాన్

Related News

ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మూకుత్తి అమ్మన్ 2.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ హక్కులు!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..

పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి తెలుగులో సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… కిల్లర్ ఎవరో చివరి వరకు కనిపెట్టలేరు

విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు

గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు

Big Stories

Advertisement
×