E-Paper
Advertisement

చేతబడి పేరుతో అమ్మాయి వశీకరణ… అనన్య పాండేను ఇలాంటి రోల్ లో అస్సలు ఊహించలేరు

చేతబడి పేరుతో అమ్మాయి వశీకరణ… అనన్య పాండేను ఇలాంటి రోల్ లో అస్సలు ఊహించలేరు
Advertisement

Telugu Supernatural Horror Movie: హర్రర్ సినిమాలంటే కేవలం దెయ్యాలే కాదు, అప్పుడప్పుడు చేతబడులపై వచ్చే సినిమాలు కూడా ఆసక్తికరంగా, భయంకరంగా ఉంటాయి. అందులో అమ్మాయిలను వశీకరణం చేసుకోవడం, పట్టపగలే దెయ్యాలు కనిపించడం అనే టాపిక్స్ ఎవర్ గ్రీన్. మీకు కూడా ఇలాంటి ఒక మంచి తెలుగు హర్రర్ సినిమాలను చూడాలని ఉందా ? అయితే ఈ మూవీ సజెషన్ పక్కాగా మీ కోసమే. 2024లో విడుదలై తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన ఆ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ పేరు ‘తంత్ర’ (Tantra).

కథలోకి వెళ్తే…

రేఖ అనే అమ్మాయి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆమెకు ఒక విచిత్రమైన శక్తి ఉంటుంది. సాధారణ మనుషులకు కనిపించని దెయ్యాలు, ఆత్మలు, శక్తులు ఆమెకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె జన్మించినప్పుడే తల్లి రాజేశ్వరి చనిపోతుంది. రేఖ ఒక తాంత్రిక పూజ ఫలితంగా జన్మించిందని, అందుకే ఆమెలో ఈ అసాధారణ శక్తులు వచ్చాయని గ్రామంలో పుకార్లు ఉంటాయి. పౌర్ణమి రాత్రుల్లో రేఖ తనకు తెలియకుండానే వింతగా ప్రవర్తిస్తుంది.

Advertisement

రక్తం తాగడం, ఆత్మలతో మాట్లాడడం వంటి పనులు చేస్తున్న రేఖలో శక్తులు రోజురోజుకూ పెరిపోవడంతో ఆమెను కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది. ఇలాంటి హర్రర్ లైఫ్ ఫేస్ చేస్తున్న ఆమె జీవితంలో ఒకే ఒక్క సంతోషం తేజు (ధనుష్ రఘుముద్రి). అతను వేశ్య కొడుకు కావడంతో సమాజం అతన్ని అవమానిస్తుంటే, రేఖ మాత్రం అతన్ని ప్రేమతో చూస్తుంది. రేఖకు ఏ సమస్య వచ్చిన్నా తేజు తోడుగా ఉంటాడు.

కథలో విలన్ విగతి (‘టెంపర్’ వంశీ). అతనొక క్రూరమైన తాంత్రికుడు. భయంకరమైన శక్తులను సొంతం చేసుకోవడానికి రేఖను బలి ఇవ్వాలని కుట్ర పన్నుతాడు. ఊరి ప్రజలను రేఖకు వ్యతిరేకంగా తిప్పి, ఆమెను ఒక చెట్టుకు కట్టి భయంకరమైన తాంత్రిక బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. మరి రేఖకు ఆ శక్తులు ఎలా వచ్చాయి ? రేఖ తల్లి ఎవరు ? ఆమెని వశీకరణంతో లోబరుచుకున్నది ఎవరు ? చివరికి రేఖను ఆ తాంత్రికుడు బలిచ్చాడా ? అతని నుంచి తప్పించుకుని ఆమె ఎలా బయట పడింది ? అన్నది ఈ మూవీ స్టోరీ.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

‘తంత్ర’లో అనన్య నాగళ్ల గతంలో ఎన్నడూ పోషించని పాత్రను చేసింది. ఇక వంశీ విలన్ భయపెడుతుంది. ప్రస్తుతం Ahaలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. మూవీకి ‘A’ సర్టిఫికేట్ రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. సినిమాలో కొన్ని దృశ్యాలు భయంకరంగా ఉంటాయి. అలాగే అక్కడక్కడా చిన్నపిల్లలు చూడకూడని సీన్స్ కూడా ఉంటాయి. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వచ్చే క్షుద్రపూజలు, తాంత్రిక శక్తులు, ఆత్మల ప్రపంచం వంటి సీన్స్ హారర్ మూవీ లవర్స్ ను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి.

Read Also: బ్రతికుండగానే చితిపై… తాగుబోతుకు బుద్ధి చెప్పడానికి మెంటల్ మాస్ ప్లాన్

Tags

Related News

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

Big Stories

Advertisement
×