BigTV English
Advertisement

OTT Movie : కోరిన వరాలు ఇచ్చే గది … కొడుకు కాని కొడుకుతో ప్రెగ్నెంట్ అయ్యే తల్లి … సస్పెన్స్ తో పిచ్చెక్కించే స్టోరీ

OTT Movie : కోరిన వరాలు ఇచ్చే గది … కొడుకు కాని కొడుకుతో ప్రెగ్నెంట్ అయ్యే తల్లి … సస్పెన్స్ తో పిచ్చెక్కించే స్టోరీ

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఎక్కువగా చూస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకి వేరే ధ్యాస లేకుండా చేస్తున్నాయి. సమయం దొరికినప్పుడల్లా నచ్చిన వాటిని చూస్తూ ఆనందిస్తున్నారు. అయితే కొన్ని స్టోరీలు చాలా విచిత్రంగా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక జంటకి ఒక రహస్యమైన రూమ్, ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఈ మూవీ చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది రూమ్’ (The Room). 2019 లో వచ్చిన ఈ మూవీకి క్రిస్టియన్ వోల్క్‌మాన్ దర్శకత్వం వహించారు. ఓల్గా కురిలెంకో, కెవిన్ జాన్సెన్స్, జాషువా విల్సన్, జాన్ ఫ్లాండర్స్, ఫ్రాన్సిస్ చాప్‌మన్ నటించారు. ఈ మూవీ బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 15 ఏప్రిల్ 2019న ప్రదర్శించబడింది.తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఇది అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మాట్, కేట్ అనే ఒక యువ జంట న్యూయార్క్‌లోని ఒక ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ ఇంట్లో నివాసం ఉండాటానికి వీళ్ళు అక్కడికి వస్తారు. ఇంటిని సరిచేసే క్రమంలో, వారు ఒక రహస్య గదిని కనుగొంటారు. ఇది వారి కోరికలన్నింటినీ నెరవేర్చగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మొదట మాట్, కేట్ ఈ గదిని ఉపయోగించి డబ్బు, విలాసవంతమైన వస్తువులు, కళాఖండాలు వంటివి సృష్టిస్తారు. ఆ డబ్బుతో వాళ్ళకు నచ్చినట్టు విలాసంగా గడుపుతారు. అయితే కేట్ కి గతంలో రెండు గర్భస్రావాలు జరగడంతో, ఆమెకు ఒక బిడ్డ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆమె ఈ గదిని ఉపయోగించి ఒక బిడ్డను కోరుకుంటుంది. ఇంతలోనే ఒక బిడ్డ ఆ రూమ్ లో ప్రత్యక్షం అవుతుంది. అతనికి షేన్‌ అనే పేరు పెడుతుంది కేట్.

అయితే ఈ బిడ్డ ఇంటి బయటకు వెళితే వెంటనే వృద్ధాప్యం వచ్చి చనిపోతాడని వారు తెలుసుకుంటారు.షేన్‌ను పెంచే క్రమంలో కేట్, మాట్ మధ్య సంబంధం ఒత్తిడికి గురవుతుంది. షేన్ గదిలో జరిగేది తెలుసుకుని, దానిని ఉపయోగించి తన కోరికలను నెరవేర్చుకుంటాడు. ఇది మరింత గందరగోళానికి దారితీస్తుంది. ఆతరువాత షేన్‌, కేట్ మీద ఫీలింగ్స్ పెంచుకుంటాడు. షేన్‌ రూంలో, మాట్ రూపం కోరుకుని కేట్ తో రొమాన్స్ చేస్తాడు. ఇప్పుడు ఒక విషాదకరమైన మలుపు తిరుగుతుంది.షేన్ బయటకు వెళ్లడం వల్ల వేగంగా వృద్ధాప్యం చెంది చనిపోతాడు. ఆతరువాత మాట్, కేట్ ఆ ఇంటిని వదిలి ఒక మోటెల్‌లో ఉంటారు. ఆ సమయంలో కేట్ గర్భవతి అని తెలుసుకుంటుంది. చివరికి ఆఇంటి నుంచి ఈ జంట బయట పడతారా ? ఆ గదిలో దాగిఉన్న రహస్యం ఏమిటి ? షేన్ వల్ల నిజంగానే కేట్ ప్రెగ్నెంట్ అవుతుందా అనే విషయాలను, ఈమూవీని చూసి తెలుసుకోండి.

Read Also : చచ్చిన తండ్రితో మాట్లాడాలనుకుంటే దయ్యాలతో దబిడి దిబిడి … మోస్ట్ డేంజరస్ హారర్ మూవీ

Related News

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Big Stories

×