BigTV English

OTT Movie : ఫ్యామిలీ ని వెంటాడే శాపం … వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్

OTT Movie : ఫ్యామిలీ ని వెంటాడే శాపం … వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు వెబ్ సిరీస్ లు దూసుకుపోతున్నాయి. ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ గా జానర్లలో తెరకెక్కుతున్నాయి. ఇందులో సెన్సార్ నిబంధనలు కూడా పెద్దగా లేకపోవడంతో , ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కంటెంట్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. ఒక శాపం కారణంగా, ఒక ప్యాలెస్ లో మనుషులు ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే


ది ప్లానెట్ (The Planet)

ఈ మరాఠీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘అథాంగ్’ (Athang). 2022 లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు జయంత్ పవార్ దర్శకత్వం వహించారు. ది ప్లానెట్ (The Planet) మరాఠీ ఓటీటీ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ధైర్య ఘోలప్, భాగ్యశ్రీ మిలింద్, నివేదితా సరాఫ్, కేతకి నారాయణ్ ఇందులో ప్రధానపాత్రలుపోషించారు. తేజస్వినీ పండిత్ సంతోష్ ఖేర్, క్రియేటివ్ వైబ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీనిని నిర్మించారు.
ఈ సిరీస్ ఒక శాపంతో బాధపడుతున్న యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ1930లు మరియు 1960ల మధ్య కాలంలో, కొంకణ్ ప్రాంతంలోని సర్దేశ్‌ముఖ్ ప్యాలెస్లో జరుగుతుంది. రావు అనే యువకుడు, ఒక ఆత్మ వల్ల శాపానికి గురి అవుతాడు. ఈ శాపం కారణంగా అతను తీవ్రమైన బాధలను అనుభవిస్తాడు. అతను ఈ శాపం నుండి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది అంత తేలిగ్గా జరిగేది కాదని తెలుస్తుంది. సుశీల అనే యువతి సర్దేశ్‌ముఖ్ ప్యాలెస్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ స్త్రీలు ప్రవేశించడానికి అనుమతి ఉండదు. రావు అత్త గారు రుక్మిణి, ఒక వితంతువుగా ఉంటుంది. సుశీలకు రావు నుండి దూరంగా ఉండమని, సమీపంలోని సరస్సు వద్దకు కూడా వెళ్లవద్దని హెచ్చరిస్తుంది. రుక్మిణి సలహా మీరి, రావు గదిలోకి సుశీలప్రవేశిస్తుంది. దీనితో రావు కోపంతో ఊగిపోతాడు. ఎందుకంటే అతను తనకి గతంలో జరిగిన గాయాల కారణంగా స్త్రీలకు దూరంగా ఉంటాడు.

అయినప్పటికీ, రుక్మిణి అభ్యర్థన మేరకు అతను సుశీలను అక్కడ ఉండనిస్తాడు. కాలం గడిచేకొద్దీ రావు, సుశీల సన్నిహితంగా మెలుగుతారు. ఒకరి గురించి ఒకరు సన్నిహిత వివరాలను పంచుకుంటారు. ఈ సంబంధం కథలో కొత్త మలుపులను తెస్తుంది. సర్దేశ్‌ముఖ్ ప్యాలెస్లో జరిగిన గత సంఘటనలు, శాపం, రావు జీవితంలోని రహస్యాలు క్రమంగా వెల్లడవుతాయి. సుభద్ర అనే మంత్రగత్తె శాపం ప్యాలెస్లో కి రావడంతో, స్టోరీ మరో మలుపు తీసుకుంటుంది. రావు శాపం నుండి విముక్తి పొందే ప్రయత్నం, సుశీల జీవితంలో జరిగే మార్పులు, ప్యాలెస్లో దాగిన రహస్యాలు కథను ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకెళ్తాయి. ఈ సిరీస్ మరాఠీలో మొదటి పీరియాడిక్ హారర్ డ్రామాగా పరిగణించబడుతుంది. ఈ సిరీస్ తెలుగులో అందుబాటులో లేకపోవచ్చు, కానీ ప్లానెట్ మరాఠీ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో, మరాఠీ భాషలో అందుబాటులో ఉంది.

Read Also : తిండికి గతిలేని బిలియనీర్ … కోట్లు ఉన్నా కటిక దరిద్రంలోనే … తండ్రి ఇచ్చే ట్విస్ట్ కి మతిపోవాల్సిందే

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×