OTT Movie : ఓటీటీలో మలయాళం సినిమాలను వదలకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో వచ్చిన, ఈ మూవీ కామెడీ కంటెంట్ తో ఇరగదీసింది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ దక్కించుకుంది ? ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
మాజీ హోం మంత్రి కుమార్తె అయిన అంజలి, విపక్ష ఎమ్మెల్యే ఆదర్శ్‌ని పెళ్లి చేసుకుంటుంది. ఆదర్శ్ అంటే ఇష్టం లేకపోయినా, పెద్దలకోసమే ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉంటుంది. ఆమె తన భర్తపై అనుమానంతో, పోలీసు అధికారి జేమ్స్ సహాయంతో, అతనిని గురించి తెలుసుకుంటూ ఉంటుంది. ఒక రోజు ఆదర్శ్ ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి, అక్కడికి వెళ్ళకుండా ఫామ్‌హౌస్ కి వెళతాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయడానికి వస్తాడు. ఇదే సమయంలో, తంగచ్చన్ అనే ఒక వ్యక్తి మొదటి సారిగా దొంగతనం చేయడానికి అక్కడికి వస్తాడు. ఆదర్శ్ ఢిల్లీలో ఉన్నాడని భావించి, అతని ఫామ్‌హౌస్‌లో ఆదర్శ్ తో పాటు, అతని గర్ల్ ఫ్రెండ్ కూడా రావడంతో, అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది.
ఆదర్శ్ ఆ దొంగ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేస్తాడు. ఇంతలోనే ఆదర్శ్ భార్య అంజలి అక్కడికి వస్తుంది. నిజానికి అంజలి పోలీసు అధికారి జేమ్స్ తో, అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటుంది. ఆదర్శ్ ఢిల్లీకి వెళ్లాడనుకుని, జేమ్స్ తో ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేయడానికి వస్తుంది. అక్కడ ఆదర్శ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ ఆదర్శ్ తన గర్ల్ ఫ్రెండ్ ను బిజినెస్ పార్ట్నర్ గా అంజలికి పరిచయం చేస్తాడు. ఈ గజి బిజి గందరగోళం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. చివరికి ఆదర్శ్ తో వచ్చిన మహిళ ఎవరు? తంగచ్చన్ పరిస్థితి ఏమౌతుంది ? ఆదర్శ్, అంజలిల సీక్రెట్స్ బయటపడిపోతాయా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పోలీసులకు క్లూ ఇచ్చి మరీ దొంగతనం… ఈ మలయాళ హీస్ట్ థ్రిల్లర్ లో ట్విస్టులకు మతి పోవాల్సిందే
మనోరమ మాక్స్ (Manorama MAX) లో
ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘తానారా’ (Thaanara). 2024 లో వచ్చిన ఈ మూవీకి హరిదాస్ దర్శకత్వం వహించారు. ఇందులో షైన్ టామ్ చాకో, విష్ణు ఉన్నికృష్ణన్, దీప్తి సతి, అజు వర్గీస్, చిన్ను చాందిని, స్నేహ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ అంజలి (చిన్ను చాందిని), ఆదర్శ్ (షైన్ టామ్ చాకో), తంగచ్చన్ (విష్ణు ఉన్నికృష్ణన్) చుట్టూ తిరుగుతుంది. మనోరమ మాక్స్ (Manorama MAX) ఓటీటీలో 2024 డిసెంబర్ 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.