Ram Charan: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ అదృష్టం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా అందించిన విజయంతో ‘గ్లోబల్ స్టార్’ అనే ట్యాగ్ రావడమే కాకుండా..ఆ విషయంలో తొలి నటుడిగా కూడా రికార్డు సృష్టించారు. అంతేకాదు గౌరవ డాక్టరేట్ కూడా ఆయనకు లభించింది. అసలు విషయంలోకి వెళ్తే.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో హీరో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. లండన్ లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ భారతీయ నటుడి విగ్రహం పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంగా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తొలి మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేసిన నటుడిగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు.
లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ..
ఇకపోతే ఈ విగ్రహ ఆవిష్కరణకు రామ్ చరణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana), కూతురు క్లింకారా (Klinkaara) తో పాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), తల్లి సురేఖ కొణిదెల (Surekha konidela) ఈ వేడుకకు హాజరై, కొడుకు మైనపు విగ్రహాన్ని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా.. ఇక్కడ అనూహ్యంగా చోటు చేసుకున్న ఘటన అందర్నీ మరింత ఆశ్చర్యపరిచింది.
తండ్రి విగ్రహాన్ని చూసి క్లీంకారా రియాక్షన్ ఇదే..
అసలు విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ ఎంతగానో ఇష్టపడే రైమ్ కి కూడా ఇక్కడ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.
ఇక రామ్ చరణ్ తన పెట్ డాగ్ రైమ్ తో వున్నట్టు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామ్ చరణ్ మైనపు విగ్రహంతో రియల్ రామ్ చరణ్ తన పెట్ రైమ్ తో ఫోటో దిగుతుండగా.. అక్కడికి సడన్ గా క్లీంకారా ఎంట్రీ ఇచ్చింది. అయితే పక్కనే ఉన్న తన తండ్రి దగ్గరకు వెళ్లకుండా.. మైనపు రామ్ చరణ్ విగ్రహం దగ్గరకు క్లీంకార వెళ్లడాన్ని ఉపాసన కెమెరాలో బంధించి మరీ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.” మా ముద్దుల కూతురు క్లీంకార తన తండ్రి మైనపు విగ్రహాన్ని చూసి మైమరిచిపోయింది. అంతేకాదు సడన్ గా కన్ఫ్యూజ్ అయిపోయింది.అటు చెర్రీ విగ్రహంతో ఫోటో దిగడానికి ఆగలేకపోయింది. అంత అద్భుతంగా రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు” అంటూ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని మైనపు విగ్రహపురూపకర్తలపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ఈ వీడియోలో ఉపాసన వెనుక నుంచి కారా ఆగు అని ఎంత చెప్పినా ఆగకుండా.. ఆ చిన్నారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ తన తండ్రి విగ్రహం వైపు వెళ్లడం మనం చూడవచ్చు. మొత్తానికైతే ఈ వీడియో చాలా క్యూట్ గా ఉందని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.మరొకవైపు ఉపాసన, చిరంజీవి, సురేఖ కూడా రామ్ చరణ్ మైనపు విగ్రహంతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మనం చూడవచ్చు. మొత్తానికైతే అటు రామ్ చరణ్ కూడా తనను పక్కన పెట్టేసి ఆ విగ్రహంతో వీళ్ళు ఫోటో దిగుతుండడంతో ఇక నన్ను పట్టించుకోరు అంటూ సరదాగా కామెంట్లు చేశారు. రామ్ చరణ్ మైనపు విగ్రహం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. బుచ్చి బాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో ‘ఆర్సి 16’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు.