BigTV English
Advertisement

OTT Movie : తండ్రి కోసం దయ్యాలను వేటాడే అమ్మాయి… ఈ దయ్యాలను చూస్తే పార్ట్స్ ప్యాక్ అయిపోతాయి

OTT Movie : తండ్రి కోసం దయ్యాలను వేటాడే అమ్మాయి… ఈ దయ్యాలను చూస్తే పార్ట్స్ ప్యాక్ అయిపోతాయి

OTT Movie : ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా భయంకరంగా ఉంటాయి. వెన్నులో వణుకు పుట్టించే ఈ సినిమాలను ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. అలా వణుకు పుట్టించే ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తఘుట్‘ (Thaghut). ఈ మూవీకి బాబీ ప్రాసేటో దర్శకత్వం వహించాడు. ఇందులో యస్మిన్,అర్బని యసీజ్,రియా ప్రధాన పాత్రలు పోషించారు. మంత్రాలతో తండ్రి వారసత్వం పుచ్చుకొనే అమ్మాయి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హీరోయిన్ ఒక అనాధ శరణాలయంలో పెరుగుతూ ఉంటుంది. ఆమె చాలా రోజులనుంచి టీవీలో ఒక ప్రోగ్రాం అంటే పడి చచ్చిపోతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో అభ అనే వ్యక్తి మంత్రగాడిగా ఉంటూ, తన మంత్రాలతో చాలామందికి దయ్యాలు వదిలిస్తూ, అక్కడికి వచ్చిన వాళ్ళకి రోగాలను కూడా నయం చేస్తుంటాడు. అతనిలా తను కూడా అవ్వాలని అనుకుంటూ ఉంటుంది హీరోయిన్. ఒకరోజు హీరోయిన్ కలలోకి అభ వచ్చి, నువ్వు రావాల్సిన టైం దగ్గరికి వచ్చిందంటూ గొంతు కోసుకొని చనిపోతాడు. హీరోయిన్ ఉలిక్కిపడి లేచి ఇది కలే కదా అనుకుంటుంది. అయితే అతడు నిజంగానే చనిపోయిన దృశ్యం టీవీలో చూపిస్తుంటారు. అప్పుడు హీరోయిన్ కి అసలు విషయం తెలిసి షాక్ తింటుంది. చనిపోయిన వ్యక్తి తన తండ్రి అని తెలుసుకుంటుంది. అనాధ శరణాలయంలో చిన్నప్పుడు హీరోయిన్ ని తన తల్లి వదిలిపెట్టి ఉంటుంది. తండ్రి ఎవరో చెప్పకుండా పెంచాలని వాళ్లకు చెబుతుంది. అందువల్లే ఆమెకు తన తండ్రి ఎవరో చెప్పకుండా పెంచుతారు శరణాలయం వాళ్ళు.

ఇప్పుడు తండ్రి చనిపోవడంతో అతని చూడటానికి ఫ్రెండ్స్ తో కలిసి వెళుతుంది. అక్కడికి వెళ్లి చూశాక తన తండ్రి నిజంగానే గొంతు కోసుకొని చనిపోయి ఉంటాడు. అక్కడే ఉండే అభ అసిస్టెంట్, హీరోయిన్ తో ఇక నువ్వే మీ నాన్న వారసురాలువి అంటూ చెప్తాడు. అందులో హీరోయిన్ ఫ్రెండ్ ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఆ ఇంట్లో దయ్యాలు గోల పెడుతూ ఉంటాయి. అక్కడికి వచ్చిన హీరోయిన్ ఫ్రెండ్స్ భయపడి వెలిపోవాలని అనుకొంటారు. అయితే హీరోయిన్ మాత్రం అక్కడే ఉండాలనుకొంటుంది. చివరికి హీరోయిన్ తన తండ్రి అడుగుజాడల్లో హీరోయిన్ నడుస్తుందా? హీరోయిన్ తండ్రి ఎలా చనిపోతాడు? ఆమె అనాధ శరణాలయంలో పెరగడానికి కారణం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘తఘుట్’ (Thaghut) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. వెన్నులో వణుకు పుట్టించే ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాని రాత్రిపూట ఒంటరిగా చూస్తే అంతే సంగతులు.

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×