E-Paper
Advertisement

Thakumar Jhuli OTT release date : స్ట్రీమింగ్ కు సిద్ధమైన కొత్త బెంగాలీ మిస్టరీ సిరీస్… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?

Thakumar Jhuli OTT release date : స్ట్రీమింగ్ కు సిద్ధమైన కొత్త బెంగాలీ మిస్టరీ సిరీస్… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?
Advertisement

Thakumar Jhuli OTT release date : ఓటీటీలలో ఇటీవల కాలంలో ఎన్నో కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతున్నాయి. అయితే భాష అడ్డు కాదు అనుకుంటే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో లెక్కలేనంత కంటెంట్ దొరుకుతుంది. తాజాగా మరో కొత్త సిరీస్ విడుదలకు సిద్ధం అవుతోంది. అందులో భాగంగా సదరు సిరీస్ ప్రీమియర్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఇంతకీ ఓటీటీలోకి రాబోతున్న ఆ కొత్త సిరీస్ ఏంటి ? స్ట్రీమింగ్ ఎక్కడ ? అనేది తెలుసుకుందాం పదండి.

హోయిచోయ్ ఓటీటీలో స్ట్రీమింగ్

హోయిచోయ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతున్న కొత్త బెంగాలీ మిస్టరీ డ్రామా సిరీస్ ‘థాకుమార్ ఝులి’. ఈ సిరీస్ క్లాసిక్ బెంగాలీ జానపద కథల సంకలనం “థాకుమార్ ఝులి” ఆధారంగా రూపొందింది. కానీ ఆధునిక మిస్టరీ థ్రిల్లర్‌గా అడాప్ట్ చేశారు. గతంలో టీవీ షోలుగా అడాప్ట్ చేయబడిన ఈ కథలు ఇప్పుడు హోయిచోయ్‌లో మిస్టరీ సిరీస్‌గా వచ్చాయి. ప్రముఖ నటి స్రబంతి ఛటర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్, అమ్మమ్మ – మనవరాలు కలిసి ఒక మిస్టరీని ఛేదించే కథతో నడుస్తుంది. SVF అండ్ హోయిచోయ్ ఒరిజినల్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ లో దివ్యని మండల్ జగ్గసేని పాత్రలో నటించింది. ఇతర నటుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయాన్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ మార్చి 20న హోయిచోయ్‌లో ప్రీమియర్ కానుంది. ఈ సిరీస్ లో సాంప్రదాయ, ఆధునిక ఇన్వెస్టిగేషన్ స్టైల్స్‌ ను మిక్స్ చేసి దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఒకవేళ మీకు గనుక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లు ఇష్టం అయితే ఈ సిరీస్ వచ్చాక ఒక లుక్కేయండి.

Advertisement

Also Read : ఎట్టకేలకు డైరెక్ట్ గా ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

కథలోకి వెళ్తే…

సిరీస్ లో రిజాబాల సన్యాల్ (స్రబంతి ఛటర్జీ) పాత్ర కీలకం. 60 ఏళ్ల ఈ ముసలావిడ బిష్ణుపూర్‌లోని టెర్రకోట దేవాలయాల వలె స్థిరంగా ఉంటుంది. మాటలో నిరాడంబరంగా, అలవాట్లలో సున్నితంగా ఉండే గిరిజాబాల చిన్న వయస్సులోనే విధవరాలు అవుతుంది. ఆమె ఏకైక కుమారుడి మరణం వంటి కఠినమైన దెబ్బలను భరిస్తుంది. కానీ ఆ కష్టాలు అన్నింటినీ దాటుకుని అధునాతనంగా మారుతుంది. ఆమె మూడు పిల్లులు హోరి, బెల్లా, ఫోంటేలను పెంచుతుంది. అవే ఆమె ఫ్రెండ్స్.

Advertisement

ఇలాంటి సన్యాల్ జీవితంలోకి ఆమె మనవరాలు జగ్గసేని (దివ్యని మండల్) విదేశాల నుండి తిరిగి వస్తుంది. చురుకైన మనస్తత్వం కలిగిన క్రిమినల్ సైకాలజీ విద్యార్థిని జగ్గసేని. తన స్నేహితురాలు అమ్రపాలి సింఘా రాయ్ వివాహానికి హాజరు కావడానికి వస్తుంది. అమ్రపాలి పవర్ ఫుల్ రాజకీయ రాజవంశం కుమార్తె. వేడుక మధ్యలో అమ్రపాలి అకస్మాత్తుగా మరణించడంతో సిట్యుయేషన్ భయంకరంగా మారుతుంది. అమ్మమ్మ – మనవరాలు కలిసి దీని వెనకున్న సీక్రెట్ ను బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది అన్నది కథ.

Tags

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×