BigTV English

OTT Movie : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

OTT Movie : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

OTT Movie : స్పై థ్రిల్లర్‌ సినిమాలలో ట్విస్టులతో వచ్చే యాక్షన్ సీన్స్ దుమ్ము లేపుతుంటాయి. ఇలాంటి సినిమాలు చూడటానికి ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్పై సినిమా, ఒక పవర్ ఫుల్ ఆయుధం చుట్టూ తిరుగుతుంది. ఇది మూడవ ప్రపంచ యుద్ధాన్ని సైతం మొదలుపెట్టగలదు. దీన్ని తీవ్రవాదుల చేతిలో పడకుండా చేసే ప్రయత్నమే ఈ స్టోరీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఎందులో ఉందంటే

‘ది 355’ (The 355) 2022లో విడుదలైన అమెరికన్ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం. సైమన్ కిన్‌బర్గ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో జెస్సికా చాస్టెయిన్, పెనెలోప్ క్రూజ్, ఫాన్ బింగ్‌బింగ్, డయాన్ క్రూగర్, లుపిటా న్యోంగ్‌ఓ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 జనవరి 7న థియేటర్లలో విడుదలై, 2022 ఫిబ్రవరి 22 నుండి పీకాక్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమాకి 5.6/10 రేటింగ్ పొందింది.


కథలోకి వెళ్తే

కొలంబియాలో ఒక డ్రగ్ లార్డ్ ఎస్టేట్‌లో, ఒక సీక్రెట్ డీల్ జరుగుతుంటుంది. అక్కడ ఒక సీక్రెట్ ఏజెంట్ లూయిస్ ఒక శక్తివంతమైన సూపర్‌ వెపన్ ను పొందుతాడు. ఇది డేటా కీతో కూడిన ఫ్లాష్ డ్రైవ్‌ రూపంలో ఉంటుంది. ఈ వెపన్ ఆర్థిక వ్యవస్థలను, ఉపగ్రహాలను సైతం కూల్చగలిగే సామర్థ్యం ఉంటుంది. దీనివల్ల మూడవ ప్రపంచ యుద్ధమే వస్తుంది. అయితే ఈ ఆయుధం అనుకోకుండా కిరాయి గూండాల చేతిలో పడుతుంది. CIA ఏజెంట్ మేస్ తన సహచరుడు నిక్ ఫౌలర్ తో కలిసి దాన్ని తిరిగి పొందేందుకు పారిస్‌కు వెళ్తుంది. అయితే జర్మన్ ఏజెంట్ మేరీ ష్మిత్ ఈ పనికి అడ్డు తగులుతుంది. ఇప్పుడు మేస్, మేరీ మధ్య ఒక ఉత్కంఠభరితమైన ఛేజ్ సన్నివేశం జరుగుతుంది. కంప్యూటర్ స్పెషలిస్ట్ ఖాదీజా, కొలంబియన్ సైకాలజిస్ట్ గ్రేసియెలా కూడా ఈ మిషన్‌లో చేరతారు.

అయితే ఈ ప్రతి కదలికను లిన్ మీ షెంగ్ అనే చైనీస్ ఏజెంట్ ట్రాక్ చేస్తుంటుంది. ఈ నలుగురు మహిళలకు వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఈ ఆయుధాన్ని తిరిగి పొందేందుకు ఒక కూటమిగా ఏర్పడతారు. ఈ టీమ్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయుధాన్ని పొందేందుకు పోరాడుతుంది. ఈ పోరాటంలో జరిగే యాక్షన్ సీన్స్ చూపు తిప్పుకోకుండా చేస్తాయి. చివరికి ఈ వెపన్ ని ఈ అమ్మాయిలు దక్కించుకుంటారా ? వీళ్ళ వెనుక ఎవరున్నారు ? ఆ వెపన్ తో ఏం చేయాలనుకుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

Read Also : 50 ఏళ్ల ఆంటీతో ఆటగాడి అరాచకం… ఆ పనికి నో చెప్పడంతో ఊహించని షాక్… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

Related News

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

OTT Movie : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

OTT Movie : డేంజరస్ ఐలాండ్… అడుగు పెడితే అబ్బాయిల కోసం పడి చస్తారు… సింగిల్ గా చూడాల్సిన ఏరోటిక్ థ్రిల్లర్

OTT Movie : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×