Kho Kho World Cup 2025: భారత ఒలంపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నిర్వహిస్తున్న ఖో ఖో ప్రపంచ కప్ మెగా టోర్నీ జనవరి 13 సోమవారం నుండి ప్రారంభమైంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఈ ప్రపంచ కప్ లో మొత్తం 20 పురుషుల టీమ్స్, 19 మహిళల టీమ్స్ పాల్గొంటున్నాయి. పురుషులు, మహిళల విభాగాలలో తెలపడే జట్లను మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించారు.
Also Read: BCCI: భారత క్రికెటర్లకు BCCI షాక్.. 50 శాతం జీతాలు కట్?
భారత పురుషుల టీమ్ – ఏ లో నేపాల్, బ్రెజిల్, పెరు, భూటాన్ దేశాలతో తలపడనుంది. ఇక మహిళల టీమ్ కూడా గ్రూప్ – ఏ లో మలేషియా, దక్షిణ కొరియా, ఇరాన్ దేశాలతో ఆడబోతోంది. అన్ని గ్రూపులలో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్ కి అర్హత సాధిస్తాయి. ఈ ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ నేపాల్ – భారత్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ఎ లో తొలి మ్యాచ్ లో నేపాల్ తో తలపడిన భారత్ 42-37 తో నేపాల్ పై గెలుపొందింది.
తొలి టర్న్ లో భారత్ 24 పాయింట్లు సాధించగా.. రెండవ టర్న్ లో నేపాల్ 20 పాయింట్ల స్కోర్ చేసింది. ఇక మూడవ టర్న్ లో భారత్ 18 పాయింట్లు దక్కించుకోగా.. నాలుగో టర్న్ లో నేపాల్ 16 పాయింట్ల స్కోర్ చేసింది. దీంతో నేపాల్ పై ఐదు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు కుర్రాడు శివారెడ్డి బెస్ట్ ఎటాకర్ గా నిలిచాడు. ఇక మంగళవారం జరిగిన రెండో లీగ్ పోరులో భారత్ – బ్రెజిల్ మధ్య పోటీ జరిగింది. ఈ పోరులో బ్రెజిల్ పై భారత పురుషుల టీమ్ 64 – 34 తేడాతో గెలుపొందింది.
అనంతరం మహిళల గ్రూప్ – ఏ లో ఆతిధ్య జట్టు తమ తొలి మ్యాచ్ లో కొరియాతో పోటీ పడింది. ఈ మ్యాచ్ లో సౌత్ కొరియాపై 175 – 18 భారీ తేడాతో గెలుపొందింది. ఇక నేడు రాత్రి 7 గంటలకు భారత్ – ఇరాన్ ఉమెన్స్ మ్యాచ్, రాత్రికి 8:15 గంటలకు భారత్ – పెరు పురుషుల మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో ఇండియా దుమ్ములేపింది. పురుషుల జట్టుకు ప్రతీక్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.
Also Read: Gautam Gambhir: ప్రమాదంలో గంభీర్ పదవి…వాళ్ల చేతిలోనే అతని ఫూచర్?
మరోవైపు ప్రపంచ క్రీడల్లో తెలుగు వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ ఖో ఖో వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళల జట్టుకు తెలంగాణకి చెందిన ఇస్లావత్ నరేష్ కోచ్ గా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. ఇతను కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బంజరు పల్లె తండాకు చెందిన వ్యక్తి. ఈ ప్రపంచ కప్ పోటీలు ఈనెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. 19న ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.
#𝐊𝐡𝐨𝐊𝐡𝐨𝐖𝐨𝐫𝐥𝐝𝐂𝐮𝐩 𝐃𝐚𝐲 𝟐 𝐃𝐢𝐚𝐫𝐢𝐞𝐬! 📖 🤩
Every match is bringing more excitement and surprises to the #KKWC2025! Stay tuned for all the thrilling matches ahead! 💥
📺 Catch all the action LIVE as the #TheWorldGoesKho on Star Sports, Disney+Hotstar,… pic.twitter.com/xhZYWAMyJx
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) January 14, 2025