Case on Yash Dayal : ప్రముఖ క్రికెటర్ యశ్ దయాల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కీలక బౌలర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో బెంగళూరు తరపున అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే తాజాగా ఇతని పై షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇతని పై FIR నమోదు అయింది. లైంగిక వేధింపుల కారణంగా యశ్ దయాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతను సాక్షి అనే ఓ యువతి ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టు సమాచారం. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో క్రికెటర్ యశ్ దయాల్ పై FIR ఛార్జీ షీట్ దాఖలు చేసారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. త్వరలోనే యశ్ దయాల్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Also Read : Case on Yash Dayal : యష్ దయాళ్ పై కేసు నమోదు…పెళ్లి పేరుతో లేడీని వాడుకొని !
మహిళా హెల్ప్ లైన్ లో ఫిర్యాదు..
యశ్ దయాల్ ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అయితే జులై 21 లోపు సమస్యను పరిష్కరించాలని సీఎంవో పోలీసులను కోరింది. ఆ యువతి జూన్ 14న మహిళా హెల్ప్ లైన్ లో కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. వాస్తవానికి యశ్ దయాల్ గుజరాత్ టైటాన్స్ కి ఆడిన సమయంలో 2023లో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ముఖ్యంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్టు ఉండటంతో యశ్ దయాల్ అప్పట్లో వెంటనే డిలీట్ చేశాడు. లవ్ జిహాద్ కి సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని ఇన్ స్టాలో పోస్టు చేశాడు. యువతి కళ్లకు గంతలు కట్టుకొని ఉండగా.. ఓ వ్యక్తి తన వీపు వెనుక చాకును దాచి పెట్టుకొని ఆమెకు ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంది. ఇక ఆ పక్కనే సమాధులుండగా.. మరో మహిళా మృతదేహం ఉంది. ఆ మృతదేహం పై సాక్షి అని పేరు రాసి ఉండటం విశేషం. ఈ పోస్ట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన..
ఆ సీజన్ ఐపీఎల్ లో మాత్రం యశ్ దయాల్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఒక మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ చివరి ఓవర్ యశ్ దయాల్ బౌలింగ్ లో వరుసగా 5 సిక్స్ లు బాది విజయాన్ని అందించాడు. ఇక ఆ తరువాత 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి వచ్చేశాడు. అప్పుడు విరాట్ కోహ్లీ చాలా ప్రోత్సహించినట్టు యశ్ తండ్రి చందర్ పాల్ గుర్తు చేసుకున్నారు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో మ్యాచ్ ని మలుపుతిప్పాడు. అప్పటి వరకు చెన్నై వైపు ఉన్న మ్యాచ్ ను యశ్ తన అద్భుతమైన బౌలింగ్ తో ఆర్సీబీ వైపు తిప్పాడు. చివరి ఓవర్ లో కెప్టెన్ ధోనీని ఔట్ చేశాడు. చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. దూబె సింగిల్ మాత్రమే తీయగలిగాడు. దీంతో ఆ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. యశ్ ఈ సీజన్ లో ఆర్సీబీకి అద్భుతమైన బౌలింగ్ చేశాడు.