OTT Movie : ప్రకృతి విపత్తులతో వచ్చే సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అక్కడ జరిగే విధ్వంసం సీన్ హైలెట్ గా ఉంటుంది. ఇటువంటి జానర్లలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక సునామీ వచ్చి నగరాన్ని నాశనం చేస్తుంది. ఆ తరువాత దోపిడీ దొంగలు చెలరేగిపోతారు. ఒక ఒంటరి అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ అల్లుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒక భయంకరమైన సునామీ హాంగ్ కాంగ్‌ను పూర్తిగా నాశనం చేస్తుంది. అయిన ఆషా అనే యువతి ఈ విపత్తు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడుతుంది. ఒక శిథిలమైన అపార్ట్‌మెంట్ భవనంలో తల దాచుకుంటుంది. ఆమె ఒంటరిగా, జాగ్రత్తగా జీవనం సాగిస్తూ, బయట ఉండే పైరేట్స్ (దోపిడీదారులు) నుండి తప్పించుకుంటూ ఉంటుంది. దాదాపు ఐదు సంవత్సరాలు అక్కడే జీవితం కొనసాగిస్తుంది. ఆమె జీవితం ఇలా సాగుతున్నప్పుడు, ఒక రోజు హీ హీ అనే ఒక చిన్న అమ్మాయి, ఆషా జీవితంలోకి అకస్మాత్తుగా ప్రవేశిస్తుంది. ఈ చిన్నారి ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆషా తన గత జీవితంలో తన సవతి సోదరికి చెందిన బాధాకరమైన జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటుంది. ఇవి ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా చూపిస్తారు.
హీ హీతో ఆమె సంబంధం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. ఆషా తన గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని అనుకుంటుంది. అయితే ఇంతలోనే వీళ్ళను పైరేట్స్ కనిపెడతారు. దీంతో ఈ స్టోరీ ఇప్పుడు ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా మారుతుంది. ఆషా తనను తాను రక్షించుకుంటూ, హీ హీని కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. చివరికి ఆషా, హీ హీ ఆ పైరేట్స్ నుంచి తప్పించుకుంటారా ? వీళ్ళు పైరేట్స్ వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటారు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసు కోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పిల్లాడిని కిడ్నాప్ చేసి వింత మాస్కులతో భయపెట్టే సైకో… అక్కడ ఆత్మలు చేసే పనికి మైండ్ బ్లాక్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది కామ్ బియాండ్’ (The Calm Beyond). 2020 లో వచ్చిన ఈ సినిమాకి జోసహువా వాంగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇది హాంగ్ కాంగ్‌లో జరిగే ఒక అపోకలిప్టిక్ స్టోరీని చూపిస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.